Vande Bharat Sleeper: భారతదేశ రైలు వ్యవస్థలో అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. వేగవంతమైన ప్రయాణం, సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తో పాటు, ఇది విద్యుత్ వినియోగ పరంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ రైలు నడవాలంటే ఎంత విద్యుత్ అవసరమవుతుందనే విషయాలను తెలుసుకుందాం.
అతి త్వరలో దేశ వ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమవుతోంది. దీనితో ఈ రైళ్లపై ప్రయాణీకులకు ఆసక్తి నెలకొంది. ఈ రైలు నడిచే ఒక ఇంద్రభవనంలా ఉంటుందని, ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీనితో రోజురోజుకూ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ పై ప్రయాణీకులకు అంచనాలు పెరిగాయి. మరి ఈ రైలు సుమారు 160 కిలో మీటర్ల స్పీడ్ తో గమ్యానికి గంటల వ్యవధిలో చేరవేస్తుందని రైల్వే అంటోంది. అలాంటి సమయంలో ఈ రైలు కిలోమీటర్ ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుంటే ఔరా అనేస్తారు.
విద్యుత్ వినియోగ అంచనా
వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. అందులో 11 AC 3-టియర్, 4 AC 2-టియర్, 1 AC ఫస్ట్ క్లాస్. ఈ ట్రైన్ ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి సుమారు 60 నుండి 72 కిలోవాట్ గంటలు (kWh) విద్యుత్‌ను వినియోగించగలదు. ఈ విద్యుత్ అవసరం, ట్రైన్‌లోని బరువు, వేగం, కోచ్‌ల లోడింగ్‌పై ఆధారపడి మారవచ్చు.
విద్యుత్ ఖర్చు ఎంత?
భారతదేశంలో విద్యుత్ యూనిట్ ధర సగటున రూ. 6 నుండి రూ. 8 వరకు ఉంటుంది. దీని ప్రకారం, ఈ రైలు ఒక కిలోమీటర్ ప్రయాణానికి సుమారు రూ. 360 నుండి రూ. 576 వరకు విద్యుత్ ఖర్చు చేస్తుంది. పొడవైన మార్గాలలో ఇది వేల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించే అవకాశం ఉంది.
Also Read: Gold Rate Today: భగ్గుమంటున్న బంగారం ధరలు.. మళ్లీ లక్ష వైపు తులం పసిడి పరుగు..
వందే భారత్ కు బ్రేక్ వేస్తే..
ఈ రైలు రీ జనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అంటే ట్రైన్ బ్రేక్ వేసే సమయంలో కొన్ని శాతం విద్యుత్ తిరిగి జనరేట్ అవుతుంది. దీని వలన విద్యుత్ వినియోగంలో కొంత మేర తగ్గుదల కలుగుతుంది. బ్రేక్ వేస్తే విద్యుత్ తిరిగి జనరేట్ కావడం అన్నది ఇదొక గొప్ప విశేషమని చెప్పవచ్చు.
తక్కువ కాలుష్యం.. ఎక్కువ ప్రయోజనం
డీజిల్ రైళ్లతో పోలిస్తే, వందే భారత్ స్లీపర్ రైళ్లు పర్యావరణాన్ని తగ్గమైన మోతాదులో ప్రభావితం చేస్తాయి. విద్యుత్ ఆధారిత రైళ్లు వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయి, దీని వలన ప్రయాణం శుభ్రమైనదిగా మారుతుంది. మొత్తం మీద ఇండియన్ రైల్వే చరిత్రలో వందే భారత్ రైళ్ల ప్రయాణం చెరిగిపోని అధ్యాయంగా చెప్పవచ్చు. దేశీ రైలుగా గుర్తించబడ్డ వందేభారత్ రైలు మన దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరెందుకు ఆలస్యం.. త్వరలో ప్రారంభం కానున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించండి.. గొప్ప అనుభూతి పొందండి.