యావత్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కొనసాగుతోంది తిరుపతి తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం. ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం కొండల్లో ఉన్న ఈ ఆలయం, సముద్ర మట్టానికి 2,799 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుదీర్ఘ క్యూలలో వేచి ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా APSTRC తిరుమల దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ విధానం ప్రయాణంలో అలసిపోయిన భక్తులకు ఉపశమనం కలిగించనుంది. ప్రతిరోజూ 1000 శీఘ్ర దర్శనం(రూ.300) టికెట్లను అందిస్తోంది ఆర్టీసీ.
శీఘ్ర దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునే నగరాలు
తిరుమల రూ.300 టికెట్లను రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్, నెల్లూరు, పాండిచ్చేరి, బెంగళూరు, చెన్నై, విజయవాడలో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఏపీఎస్ ఆర్టీసీ.
తిరుమల టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలి?
APSRTC ముందుగా ఏ ఏ నగరాల్లో దర్శనం టిక్కెట్లను అందిస్తుందో చెక్ చేసుకోవాలి. మీ నగరాల్లో ఆ సదుపాయం ఉంటే, మీ ఫోన్ ద్వారా లేదంటే ల్యాప్ టాప్ ద్వారా ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్(https://www.apsrtconline.in/oprs-web/guest/home.do?h=1) లింక్ ఓపెన్ చేయాలి.
⦿ మీ సర్కిల్ లోని నగరాలను ఎంచుకోండి.
⦿ మీ టికెట్ బుకింగ్ తేదీని ఎంచుకోండి.
⦿ ‘Check Availability’ మీద క్లిక్ చేయండి.
⦿ అందుబాటులో ఉన్న బస్సును ఎంచుకోండి.
⦿ మీ బస్సు ఎక్కడ ఎక్కాలో, ఎక్కడ దిగాలో ఎంచుకోండి.
⦿ అందుబాటులో ఉన్న సీట్లను చూడటానికి ‘Show layout’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
⦿ నెంబర్ ఆఫ్ సీట్స్ మీద క్లిక్ చేసి మీ సీటును ఎంచుకోండి.
⦿ TTD దర్శన వివరాలును ఎంచుకున్న తర్వాత దర్శన తేదీని సెలెక్ట్ చేయండి.
⦿ దర్శన స్లాట్ సమయాన్ని మధ్యాహ్నం 1:00 గంటలకు, సాయంత్రం 4:00 గంటలకు ఎంచుకొండి.
⦿ దర్శనం టికెట్ కోసం ఆధార్ కార్డు ప్రకారం పూర్తి వివరాలు ఎంట్రీ చేయాలి.
⦿ ఆ తర్వాత చెల్లింపులు చేయండి.
⦿ బస్సు టికెట్ తో పాటు దర్శనం టికెట్లను బుక్ చేసుకోండి.
⦿ చివరగా దర్శనం టికెట్ తో పాటు ఆర్టీసీ టికెట్ ను బుక్ చేసుకోండి.
దర్శనం టికెట్ ను తీసుకునే భక్తులకు సూచనలు
⦿ ఇ-టికెట్ సీటు నంబర్లు, ఎంచుకున్న బస్సు సేవకు మాత్రమే అందించబడుతుంది.
⦿ ప్రయాణం ముగిసే వరకు మీ టికెట్, ప్రయాణికుడి ఫోటో ID కార్డ్‌ను తీసుకెళ్లండి.
⦿ జారీ చేయబడిన టికెట్ కింద బుక్ చేసుకున్న సీటును మరొకరికి బదిలీ చేసే అవకాశం లేదు.
తిరుమల దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు షరతులు
⦿ భక్తులు అంతా సంప్రదాయ దుస్తులలో వెళ్లాలి.
⦿ ఆలయంలో ఎవరూ సామాను, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సెల్ ఫోన్లను తీసుకెళ్లకూడదు.
⦿ ప్రవేశ ద్వారం దగ్గర మీరు ప్రింట్ తీసుకున్న టికెట్లను చూపించాలి.
⦿ మాఢ వీధులు, ఆలయం, క్యూ లైన్లలో చెప్పులు అనుమతించరు.
⦿ టికెట్లు రద్దు చేసుకుంటే నగదు చెల్లించబడదు.
నోట్: పూర్తి వివరాల కోసం ఆర్టీసీ కార్యాలయం లేదా అధికారులను సంప్రదించగలరు.
Read Also: కేరళకు వందేభారత్ స్లీపర్, ఏ రూట్ లో నడుస్తుందంటే?