BigTV English

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఇది బిగ్ అలెర్ట్. ఇంటర్ ఫలితాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఇంటర్ రిజల్ట్స్ డేట్ ను అధికారులు ప్రకటించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇంటర్ రిజల్ట్స్ ను విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు నుంచి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఫలితాల్లో ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (Telangana State Board of Intermediate Education) అధికారిక వెబ్‌‌ సైట్‌ లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి.


ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే..?

⦿ స్టూడెంట్స్ ముందుగా రిజల్ట్స్ ను యాక్సెస్ చేయడానికి అఫీషియల్ వెబ్ సైట్ tsbie.cgg.gov.in ను సందర్శించాలి.

⦿ ఆ తర్వాత హోమ్ పేజీలో ‘TG Inter Results 2025’ అని లింక్ డిస్ ప్లే అవుతోంది. దానిపై క్లిక్ చేయాలి.

⦿ Inter First Year Results or Inter Second Year Results సెలెక్ట్ చేసుకోవాలి.

⦿ రూల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ లాగిన్ లో ఏం వివరాలు ఉంటే అవ్వి నమోదు చేయాలి.

⦿ మీకు వచ్చిన మార్కులు డిస్ ప్లే అవుతోంది. భవిష్యత్తు అవసరాల నిమిత్తం స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. అనంతరం భద్రపరుచుకోవాలి.

రిజల్ట్స్ స్కోర్ మీ పేరు, స్టూడెంట్ హాల్ టికెట్ నంబర్, సబ్జెక్టుల వారీగా మార్కులు, స్డూడెంట్ అర్హత స్థితి అంటే విద్యార్థులు పాస్ అయ్యారా..? లేదా ఫెయిల్ అయ్యారా..?, అలాగే ఎన్నో డివిజన్ లో పాస్ అయ్యారు..? స్టూడెంట్స్ పొందిన గ్రేడ్ తదితర వివరాలు ఉంటాయి.

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ 2025 మార్చి 5 నుంచి 2025 మార్చి 24 వరకు జరిగాయి. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి 6 నుంచి మార్చి 25 వరకు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సుమారుగా 9 లక్షల 96వేల 971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా.. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4లక్షల 88వేల 448 మంది కాగా.. రెండవ సంవత్సరం విద్యార్థులు 5లక్షల 8వేల 253 మంది ఉన్నారు. ఈ పరీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,532 కేంద్రాలలో జరిగాయని గతంలో అధికారులు పేర్కొన్నారు. పేపర్ల మూల్యాంకన ప్రక్రియ కంప్లీట్ అయ్యింది. ఫలితాల విడుదల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22 న ఫలితాలు విడుదల కానున్నాయి.

Also Read: OFMK Recruitment: మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాబ్స్.. ఈ అర్హత ఉండే ఎనఫ్.. పూర్తి వివరాలివే..

Also Read: UPSC Recruitment: డిగ్రీతో యూపీఎస్సీలో ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×