MLC 2025: ప్రస్తుతం MLC 2025 సీజన్ కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ అలెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి 51 బంతుల్లో 151 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో 19 సిక్సులు బాది క్రిస్ గేల్ రికార్డు ను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక రెండో మ్యాచ్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా MI న్యూయార్క్ వర్సెస్ టెక్సాస్ సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రనౌట్ లు ఎక్కడో ఓ గ్రామ క్రికెట్ లో రనౌట్ అయినట్టు కనిపించడం గమనార్హం. ముఖ్యంగా కీరన్ పోలార్డ్, ట్రెంట్ బౌల్డ్ ఇద్దరూ రనౌట్ అయ్యారు. ముఖ్యంగా పోలార్డ్ అయితే బ్యాట్ అందులో పెడితే అస్సలు ఔట్ అయ్యేవాడే కాదు.. నిర్లక్ష్యంగా వ్యవహరించి పరుగెడుతుండగానే.. మిచెల్ విసిరిన బంతి వచ్చి వికెట్ల కి తాకింది.
Also Read : SA ICC Trophy: 27 ఏళ్ళ సౌతాఫ్రికా గ్రహణం వీడింది..WTC ప్రైజ్ మనీ ఎంతంటే
పొలార్డ్ రనౌట్..
MI న్యూయార్క్ బ్యాటర్ కీరన్ పోలార్డ్ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ బౌలింగ్ లో తొలి నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, 1 సిక్సర్ తో రెచ్చిపోయాడు. తరువాత బంతికి వెస్టిండిస్ మాజీ కెప్టెన్ పోలార్డ్ రనౌట్ అయ్యాడు. పొలార్డ్ పుల్ లెంగ్త్ డెలివరీని హేవ్ చేయడానికి ప్రయత్నించాడు. బంతి అతని ఫ్యాడ్ ల నుంచి లెగ్ సైడ్ లో 30 గజాల సర్కిల్ లోపల ఖాళీ ప్రదేశంలోకి మళ్లింది. దీంతో పోలార్డ్ సింగిల్ కోసం బయలుదేరాడు. డారిల్ మిచెల్ తన సొంత బౌలింగ్ లో బంతిని ఫీల్డింగ్ చేసి నాన్ స్ట్రేకర్ స్టంప్స్ వద్ద నేరుగా హిట్ చేసాడు. మిచెల్ బంతిని త్వరగా ఆపినట్టు పొలార్డ్ సగంలోనే గ్రహించాడు. పొలార్డ్ 16 బంతుల్లో 32 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.
క్రీజులో కబడ్డీ ఫీట్స్..
అదేవిధంగా MLC టోర్నీలో ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. MI న్యూయార్క్ తో మ్యాచ్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి 186 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. ఛేదనలో ముంబై ప్లేయర్ ట్రెంట్ బౌల్డ్ 18.3 ఓవర్ లో రెండో రన్ కి ప్రయత్నిస్తూ.. క్రీజ్ వద్ద కబడ్డీ విన్యాసాలు చేశాడు. బ్యాట్ జారిపోగా లోపలికి.. బయటికి దూకుతూ చివరికీ రనౌట్ అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కేవలం 3 పరుగుల తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చివరి ఓవర్ లో MI న్యూయార్క్ 9 పరుగులు చేయాలి. టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ ఒక పార్ట్ టైమ్ బౌలర్ కి బంతిని అప్పగించాడు. డారిల్ మిచెల్ అప్పటికే 3 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు. అయితే చివరి ఓవర్ ను మిచెల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ప్రతీ బంతికి సింగిల్ ఇచ్చాడు. నాలుగో బంతికి మాత్రమే పరుగులు రాలేదు. దీంతో 3 పరుగుల తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్ విక్టరీ సాధించింది. నవీన్ ఉల్ హక్, థిల్లాన్ బ్యాటింగ్ చేస్తున్నారు.
What was my blud trying to do?#MIvsTSK #MLC2025 #TexasSuperKings #MINewYork #FafDuPlessis #TrentBoult #CricketUSA pic.twitter.com/Srra7zq8mO
— ❤️🏏 (@VibesCrick) June 14, 2025