BigTV English

Begumpet Railway Station: వావ్.. ఇది రైల్వే స్టేషనా? విమనాశ్రయమా? ఎంతబాగుందో!

Begumpet Railway Station:  వావ్.. ఇది రైల్వే స్టేషనా? విమనాశ్రయమా? ఎంతబాగుందో!

Begumpet Railway Station Redevelopment: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు రైల్వే స్టేషన్లు అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ లోని  బేగంపేట రైల్వేస్టేషన్‌ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ముస్తాబవుతోంది.  మొత్తం రూ. 38 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ అద్భుతంగా పునర్నిర్మాణం జరుగుతోంది. 2024 ఫిబ్రవరి 26న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులకు పునాది రాయి వేశారు. ప్రస్తుతం స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.


కనువిందు చేసేలా ఎంట్రీ పాయింట్!

ఇక బేగంపేట రైల్వే స్టేషన్ ఎంట్రీ పాయింట్ ను రైల్వే అధికారులు అద్భుతంగా తీర్చిదిద్దారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే రాష్ట్ర పక్షి పాలపిట్ట సహా ఇతర బొమ్మలు దర్శనం ఇచ్చేలా ఏర్పాటు చేశారు. స్టేషన్ పరిసరాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న రాయిని అందమైన పౌంటెన్ గా మలిచారు. ప్రయాణీకులను ఆకట్టుకునేలా పచ్చటి లాన్ ను ఏర్పాటు చేశారు.


ఎయిర్ పోర్టు తరహాలో సౌకర్యాలు   

బేగంపేట రైల్వే స్టేషన్ లో అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్కలేటర్లు, ర్యాంప్‌ లు, లిఫ్టులను నిర్మిస్తున్నారు. ఏసీతో కూడిన వెయిటింగ్‌ హాల్ ను ఏర్పాటు చేస్తున్నారు. రైళ్ల రాకపోకలు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేలా పలు చోట్ల డిస్‌ ప్లేలను ఏర్పాటు చేశారు. ఇక రద్దీకి అనుగుణంగా టికెట్ కౌంటర్లను నిర్మిస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ఎక్కడ ఏ సర్వీసు అందుబాటులో ఉందని ఈజీగా తెలుసుకునేలా ఎల్ఈడీ సైన్ బోర్డును ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ ప్రాంగణాన్ని ఆహ్లాదంగా ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసినపోని విధంగా పునర్నిర్మిస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ కు సంబంధించిన పనులలో 90 శాతం పూర్తయ్యాయి. త్వరలోనే మిగతా 10 శాతం పనులు పూర్తి కానున్నాయి.

Read Also: ప్రయాణీకులకు మట్టి కుండల్లో మంచి నీళ్లు, వేసవి వేళ రైల్వే కీలక నిర్ణయం!

బేగంపేట రైల్వే స్టేషన్ ఫోటోలు షేర్ చేసిన కిషన్ రెడ్డి

రీసెంట్ గా బేగంపేట రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తాజాగా స్టేషన్ అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. బేగంపేట రైల్వే స్టేషన్ లో ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి అయినట్లు వెల్లడించారు. మరో 10 శాతం పనులు మిగిలి ఉన్నట్లు వెల్లడించారు. ఈ పనులను కూడా వీలైనంత త్వరగా  పూర్తి కానున్నట్లు తెలిపారు. ఆ పనులు పూర్తి కాగానే రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తామని తెలిపారు. ఇక ఈ రైల్వే స్టేషన్ లో 100 శాతం మహిళా సిబ్బంది ఉండేలా చూస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో పూర్తి మహిళా సిబ్బందితో నడిచే రైల్లే స్టేషన్లలో ఒకటి గుర్తింపు పొందబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

Read Also: కత్రా- శ్రీనగర్ రూట్ లో కస్టమైజ్డ్ వందే భారత్ రైళ్లు, వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?

Related News

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

Big Stories

×