BigTV English

Pooja Hegde: అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది.. ఎట్టకేలకు కోరికను బయటపెట్టిన పూజా హెగ్డే

Pooja Hegde: అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది.. ఎట్టకేలకు కోరికను బయటపెట్టిన పూజా హెగ్డే

Pooja Hegde: సినిమాల్లో నటించే ప్రతీ ఒక్కరికి ఒక తీరని కోరిక ఉంటుంది. ముఖ్యంగా నటీనటులకు ఒక ప్రత్యేకమైన పాత్రలో.. లేదా ఒక స్పెషల్ జోనర్‌లో నటించాలనే ఆశ ఉంటుంది. కానీ వారికి అలాంటి అవకాశాలు రాక ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్‌కు ఇలాంటి డ్రీమ్ రోల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పూజా హెగ్డే కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటనే విషయాన్ని తాజాగా బయటపెట్టింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అసలు తెలుగులో సినిమాలు చేయడమే లేదు. ప్రస్తుతం తన అప్‌కమింగ్ తమిళ సినిమా అయిన ‘రెట్రో’ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా దాని ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా గడిపేస్తోంది.


ప్రమోషన్స్‌లో బిజీ

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా పూజా హెగ్డేనే ఎంపిక చేసుకున్నారు. చాలావరకు షూటింగ్ కూడా పూర్తయ్యింది. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు.. పూజా హెగ్డే స్థానంలోకి శ్రీలీల వచ్చింది. అలా ‘గుంటూరు కారం’ నుండి తప్పుకున్న తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు పూజా. ఆ తర్వాత చాలావరకు బాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది. అదే సమయంలో తనకు కోలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ స్టార్లతో నటించే ఛాన్స్ కొట్టేసింది. అందులో ముందుగా సూర్య (Suriya)తో నటించిన ‘రెట్రో’ మూవీ విడుదలకు కూడా సిద్ధమయ్యంది.


తప్పకుండా చేస్తా

తాజాగా ‘రెట్రో’ (Retro) ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న పూజా హెగ్డే.. బయోపిక్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీదేవి లాంటి లెజెండరీ నటి బయోపిక్‌లో నటించాల్సి వస్తే నటిస్తారా అనే ప్రశ్న తనకు ఎదురయ్యింది. ‘‘నేను ఆల్రెడీ తన పాట ఎల్లువొచ్చి గోదారమ్మకు డ్యాన్స్ చేశాను. అలాగే తన బయోపిక్‌లో నటించడం కూడా నాకు ఇష్టమే’’ అని చెప్పుకొచ్చింది పూజా. ‘‘నేను ఇంతకు ముందెప్పుడూ బయోపిక్‌లో నటించలేదు. కానీ అందరికీ తెలిసిన ఫేమస్ పర్సనాలిటీస్ బయోపిక్స్ కంటే ఎవ్వరికీ తెలియని వారి బయోపిక్‌లో నటించడం నాకు ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుంది. దాంతో పాటు స్పోర్ట్స్ డ్రామాస్‌లో కూడా నాకు నటించాలని ఉంది’’ అని బయటపెట్టింది పూజా హెగ్డే.

Also Read: నాకు 30 మిలియన్లు ఫాలోవర్స్ ఉండొచ్చు, బట్ అది రియల్ వరల్డ్ కాదు

త్వరలోనే తెలుగు సినిమా

ఇప్పటివరకు పూజా హెగ్డే (Pooja Hegde) ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించింది. స్టార్ హీరోల సరసన గ్లామర్ రోల్స్ మాత్రమే చేసింది. కానీ తను పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇక తను కూడా తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానంపై స్పందించింది. ‘‘ఆడియన్స్ టికెట్‌కు డబ్బులు పెట్టి నన్ను స్క్రీన్‌పై చూడడానికి వస్తున్నారంటే నేను దానిని ప్రశంసలాగానే తీసుకుంటాను. పైగా ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్లెప్పుడూ నా మనసులో ఉండిపోతారు’’ అని చెప్పుకొచ్చింది. త్వరలోనే ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నానని, అదొక ప్రేమకథ అని రివీల్ చేసింది పూజా హెగ్డే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×