E-Paper
Advertisement

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!
Advertisement

Train Coach Colours Explained: రైల్వే స్టేషన్‌ లోకి రైలు వచ్చేసరికి మన కళ్లకు ముందుగా కనిపించేది దాని రంగులే. కొన్ని కోచ్‌లు నీలంగా ఉంటే.. మరికొన్ని ఎరుపు, తెలుపు,  ఇతర రంగుల్లో కనిపిస్తాయి. చాలామందికి ఇవి కేవలం అందం కోసం వేసిన రంగులుగా భావిస్తారు. కానీ, రైళ్లలో రంగులకు ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. రైలు రకం, కోచ్ రకం,  సర్వీసులు, టెక్నాలజీ లాంటి విషయాలను ప్రయాణికులకు సులభంగా గుర్తించేలా రంగులు వేస్తారు.

భారత రైళ్లలో బ్లూ కలర్ ఎందుకు ఎక్కువ?

భారతీయ రైల్వేల్లో చాలాకాలంగా బ్లూ కలర్ కోచ్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి సాధారణంగా స్లీపర్, జనరల్ లాంటి రెగ్యులర్ కేటగిరీ కోచ్‌లతో కూడిన రైళ్లలో కనిపిస్తాయి. రద్దీగా ఉండే స్టేషన్‌లో కోచ్ నంబర్ కోసం వెతకాల్సిన సమయంలో ఈ రంగు కూడా ప్రయాణికులకు ఒక గుర్తింపుగా ఉపయోగపడుతుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) భారత రైల్వే కోచ్ తయారీలో కీలక పాత్ర పోషించింది. పాత కోచ్‌లలో నీలం రంగు ఎక్కువగా ఉపయోగించడంతో అది భారత రైళ్లకు ఓ సాధారణ గుర్తింపుగా మారింది.

ఎరుపు కోచ్‌లు ఎందుకు ప్రత్యేకం?

Advertisement

రైల్లో ఎరుపు రంగు కోచ్ కనిపిస్తే అది సాధారణ కోచ్ కాదని చాలామంది భావిస్తారు. దేశంలో ఎరుపు రంగు ప్రధానంగా LHB (లింకే హాఫ్‌మన్ బుష్) కోచ్‌లతో ముడిపడి ఉంటుంది. ఇవి పాత ICF కోచ్‌లతో పోలిస్తే ఆధునిక డిజైన్, మెరుగైన భద్రతా లక్షణాలతో రూపొందించబడ్డాయి. అయితే, కోచ్ రంగు ఒక్కటే చూసి దాని పూర్తి సౌకర్య స్థాయిని నిర్ణయించడం సరైనది కాదు. కోచ్ రకం, క్లాస్, రైలు సర్వీస్ లాంటి వివరాలను కూడా పరిశీలించాలి.

వైట్ కలర్ దేనికి సంకేతం?   

దేశంలో తెలుపు రంగు ప్రధానంగా లేటెస్ట్,  సెమీ హై-స్పీడ్ రైళ్ల డిజైన్లలో కనిపిస్తుంది. తెలుపు, నీలం లాంటి రంగుల కలయికతో ఉండే రైళ్లు సంప్రదాయ కోచ్‌లకు భిన్నంగా కనిపిస్తాయి. కొత్త తరం రైళ్లలో డిజైన్‌తో పాటు ఏరోడైనమిక్స్, సాంకేతికతకు కూడా ప్రాధాన్యం పెరగడంతో రంగుల ఎంపికలోనూ మార్పులు వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇదే కథ!

Advertisement

రైళ్లకు రంగులు అనేవి భారత్ కు మాత్రమే పరిమితం కాదు. ఫ్రాన్స్‌ లోని TGV రైళ్లు సాధారణంగా వెండి, నీలం రంగులతో కనిపిస్తాయి. జర్మనీ రైళ్లు తెలుపు రంగుపై ఎరుపు చారతో ప్రత్యేక గుర్తింపును పొందాయి. జపాన్‌లో షింకన్సెన్ రైళ్లకు తెలుపు బేస్‌తో పాటు వివిధ రంగుల చారలు ఉంటాయి. ఇవి రైలు సిరీస్, సర్వీస్, మార్గాన్ని గుర్తించడంలో ఉపయోగపడతాయి. బ్రిటన్‌లో మాత్రం రైలు ఆపరేటర్లను బట్టి రంగులు మారుతుంటాయి. అమెరికాలో వెండి, నీలం, ఎరుపు రంగులు సంస్థ బ్రాండింగ్‌లో భాగంగా కనిపిస్తాయి.

Read Also: పట్టాలపై నీడలు.. స్టేషన్‌లో వింత శబ్దాలు.. దేశంలోని హాంటెడ్ రైల్వే స్టేషన్లు ఇవే!

Tags

Related News

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

హోటల్ గదిలో చెక్ ఇన్ చేశాక ఈ 5 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి.. లేకపోతే ప్రమాదకరం

పట్టాలపై నీడలు.. స్టేషన్‌లో వింత శబ్దాలు.. దేశంలోని హాంటెడ్ రైల్వే స్టేషన్లు ఇవే!

Big Stories

Advertisement
×