E-Paper
Advertisement

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!
Advertisement

Indian Railway: రైలు ప్రయాణంలో ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఎప్పుడైనా మర్చిపోయారా? టికెట్ చెకింగ్ కోసం టీటీఈ (TTE) వచ్చినప్పుడు ఐడీ కార్డ్ ఎలా చూపించాలని కంగారు పడ్డారా? అయితే ఇకపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చేతిలోని స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి సులభంగా ఐడెంటీని నిరూపించుకోవచ్చు. ఫిజికల్ ఆధార్ కార్డుకు బదులుగా ‘mAadhaar’ యాప్ ద్వారా డిజిటల్ ఆధార్‌ను టీటీఈకి చూపించవచ్చు. అయితే ఈ డిజిటల్ ఆధార్ ను ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.

mAadhaar యాప్ ద్వారా ఎలా చూపించాలి?

తొలుత ఫోన్‌లో అధికారిక ‘mAadhaar’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. తద్వారా డిజిటల్ ఆధార్ ప్రొఫైల్ ను సేవ్ చేసి ఉంచాలి. ఒకవేళ ప్రయాణంలో టీటీఈ ఐడీ అడిగినప్పుడు ఈ యాప్‌లోని మీ ఆధార్ వివరాలను, క్యూఆర్ (QR) కోడ్‌ను చూపిస్తే సరిపోతుంది. ‘mAadhaar’ యాప్‌లో ఉన్న మరో బెనిఫిట్ ఏంటంటే.. మీతో పాటు ప్రయాణించే కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను కూడా ఇందులో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రయాణానికి ముందే ఈ యాప్‌లో వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

డిజిలాకర్ కూడా వాడొచ్చు!

Advertisement

ఒకవేళ మీ ఫోన్‌లో డిజిలాకర్ యాప్ ఉంటే దాని ద్వారా కూడా మీ ఆధార్‌ను టీటీఈకి చూపించవచ్చు. యాప్ ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత ‘Issued Documents’ సెక్షన్‌లోకి వెళ్తే అక్కడ వెరిఫై అయిన ఆధార్ డాక్యుమెంట్ కనిపిస్తుంది. రైలు ప్రయాణంలో దీనిని కూడా గుర్తింపు కార్డుగా టీటీఈ పరిగణిస్తారు.

రైలులో ఐడీ కార్డ్ ఎందుకు తప్పనిసరి?

రైల్వే నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నా, కౌంటర్లో తీసుకున్నా ప్రయాణీకులు తమ వద్ద చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డును ఉంచుకోవడం తప్పనిసరి. టీటీఈ తనిఖీ సమయంలో ఐడీ కార్డును తప్పకుండా చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధార్ అందుబాటులో లేకపోతే ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి ఇతర అధికారిక గుర్తింపు కార్డులను కూడా వాడవచ్చు.

Advertisement

Also Read: పెన్ డ్రైవ్‌పై ఈ రంధ్రాల సీక్రెట్ తెలుసా? దీనివల్ల ఇన్ని లాభాలా? ఇన్నాళ్లు తెలియలేదే!

ఐడీ కార్డ్ చూపించకపోతే ఏమవుతుంది?

టికెట్ ఉన్నప్పటికీ తగిన గుర్తింపు కార్డు చూపించలేకపోతే రైల్వే చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఐడీ ప్రూఫ్ లేకపోతే మిమ్మల్ని టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించి ప్రయాణ దూరాన్ని బట్టి నిర్ణీత రుసుముతో పాటు జరిమానా (Penalty) విధిస్తారు. అందుకే రైలు ప్రయాణానికి వెళ్లేముందు ఒరిజినల్ ఐడీ కార్డును దగ్గర ఉంచుకోవడం లేదంటే ఫోన్‌లో డిజిలాకర్, mAadhaar యాప్‌లను సిద్ధంగా ఉంచుకోవడం మర్చిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? అంతరిక్షం నుంచి మీ ఇంటికి నెట్‌వర్క్ ఎలా వస్తుంది?

Tags

Related News

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

హోటల్ గదిలో చెక్ ఇన్ చేశాక ఈ 5 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి.. లేకపోతే ప్రమాదకరం

పట్టాలపై నీడలు.. స్టేషన్‌లో వింత శబ్దాలు.. దేశంలోని హాంటెడ్ రైల్వే స్టేషన్లు ఇవే!

Big Stories

Advertisement
×