E-Paper
Advertisement

మహారాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. స్కూల్ క్యాంటీన్లు, పరిసరాల్లో జంక్ ఫుడ్ బ్యాన్!

మహారాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. స్కూల్ క్యాంటీన్లు, పరిసరాల్లో జంక్ ఫుడ్ బ్యాన్!
Advertisement

Junk Food Ban: మన పిల్లల భవిష్యత్తు, వారి ఆరోగ్యమే మన నిజమైన సంపద. కానీ నేడు ఎక్కడ చూసినా జంక్ ఫుడ్ రాజ్యమేలుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఈ ప్రమాదకరమైన అలవాట్లకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల లోపల, చుట్టు పక్కల జంక్ ఫుడ్ అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధిస్తూ ఎఫ్‌డీఏ (FDA) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చేపట్టిన ఈ చారిత్రాత్మక నిర్ణయం గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎఫ్‌డీఏ నిషేధిత ఆహార పదార్థాల విషయానికి వస్తే.. స్కూల్ క్యాంటీన్లు, విద్యార్థుల ఆరోగ్యానికి హానికరమైన హై-ఫాట్, సాల్ట్, షుగర్ ఉన్న పదార్థాలపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఇందులో ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లు, క్యాండీలు, చక్కెర శాతం ఎక్కువగా ఉండే స్వీట్లతో పాటు నూనెలో వేయించిన చిప్స్, నమ్‌కీన్లు, ఇతర జంక్ ఫుడ్ ప్యాకెట్ల అమ్మకాలను నిలిపి వేసింది. అలాగే కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్, సోడాలు, ఆర్టిఫిషియల్ డ్రింక్స్‌తో పాటు ఎనర్జీ డ్రింక్స్, కెఫిన్ ఉండే డ్రింక్స్, హెవీ ఐస్‌క్రీమ్‌లను కూడా పూర్తిగా బ్యాన్ చేశారు. ఈ నిబంధన కేవలం స్కూల్ క్యాంటీన్లకే పరిమితం కాకుండా.. పాఠశాల క్యాంపస్‌కు 50 మీటర్ల చుట్టు కొలత పరిధిలో ఉన్న దుకాణాలు, క్యాంటీన్లకు కూడా వర్తిస్తుంది. అంటే.. స్కూల్ గేట్ వెలుపల పిల్లలకు చిప్స్, కూల్ డ్రింక్స్ అమ్మడాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం నిషేధించడం జరిగింది.

Advertisement

ఈ నిబంధనలను అమలు చేయడమే కాకుండా.. పాఠశాలలకు ప్రభుత్వం కొన్ని కఠినమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. పిల్లలకు పోషకాహారాన్ని అలవాటు చేయడానికి స్కూల్ యాజమాన్యాలు క్యాంటీన్లలో పండ్లు, తాజా కూరగాయలు, పప్పుధాన్యాలు, పాలు, మజ్జిగ వంటి డెయిరీ ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని సూచించారు.

ఇదిలా ఉంటే.. ఈ నిషేధం విజయవంతంగా కొనసాగాలంటే ప్రతి పాఠశాలలోనూ ఈ నియమాలు కచ్చితంగా అమలయ్యేలా చూసేందుకు ఒక ‘ఫుడ్ సేఫ్టీ నోడల్ ఆఫీసర్’ను తప్పనిసరిగా నియమించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. పిల్లలు, తల్లిదండ్రులలో మంచి ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించేందుకు స్కూల్ ప్రాంగణంలో హెల్తీ ఈటింగ్ బోర్డులను ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఏ పాఠశాలైనా లేదా చుట్టుపక్కల దుకాణాలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, FSSAI మార్గదర్శకాల ప్రకారం వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

Advertisement

పిల్లలే దేశ భవిష్యత్తు కాబట్టి వారి శరీరం దృఢంగా ఉంటేనే రేపటి సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. డబ్బులకు ఆశపడి జంక్ ఫుడ్‌ను అమ్మే వ్యాపారులకు చెక్ పెడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ఈ అద్భుతమైన రూల్‌ను అమలు చేసి, మన చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటున్నారు.

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×