E-Paper
Advertisement

జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!

జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!
Advertisement

Budget International Trips: విదేశాలకు వెళ్లాలని.. అక్కడి పర్యాటక ప్రాంతాల్లో విహరించాలని చాలా మందికి ఉంటుంది. కానీ విమాన ఛార్జీలు, హోటల్ ఖర్చులు గుర్తుకురాగానే ఆ ఆలోచనను విరమించుకుంటారు. అయితే సరైన ప్రణాళిక, ముందుచూపు ఉంటే కేవలం రూ.50,000 బడ్జెట్‌లోనే విదేశీ పర్యటన పూర్తి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముందుగానే విమాన టికెట్లు బుక్ చేసుకోవడం, బడ్జెట్ హోటళ్లను ఎంచుకోవడం ద్వారా జేబుకు చిల్లు పడకుండానే అందమైన తీరాలు, చారిత్రక నగరాలు, మంచు కొండలను సందర్శించవచ్చని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో సందర్శించగలిగే ఐదు అద్భుతమైన దేశాలు, వాటి ప్రత్యేకతల గురించి ఈ కథనంలో చూద్దాం.

శ్రీలంక

భారత్ కు అతి సమీపంలో ఉండే శ్రీలంకలో తక్కువ ఖర్చుతోనే పర్యటించవచ్చు. చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల నుండి ఇక్కడికి తక్కువ ఛార్జీలతో విమాన సర్వీసులు ఉన్నాయి. అక్కడ స్థానికంగా లభించే బొటిక్ హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు తక్కువ ధరకే లభిస్తాయి. అందమైన తీర ప్రాంతాలు, రావణుడి కోట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్థానిక ఆహారాలైన రైస్ అండ్ కర్రీ, హాపర్స్, కొట్టు రోటీ తక్కువ ధరకే దొరుకుతాయి.

వియత్నాం

Advertisement

తక్కువ ఖర్చులో ఎక్కువ అనుభూతిని పొందాలనుకునే వారికి వియత్నాం బెస్ట్ ప్లేస్. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటే రూ. 50,000 లోపే ఆ దేశాన్ని చుట్టిరావొచ్చు. హా లాంగ్ బే లోని సున్నపురాయి దీవుల మధ్య క్రూయిజ్ ప్రయాణం, హోయ్ ఆన్ వీధుల అందాలు, హనోయ్, హో చి మిన్ నగరాల సోయగాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వేడి వేడి ఫో నూడుల్స్, బన్ మి (Banh mi), వియత్నామీస్ కాఫీ తక్కువ ధరకే లభిస్తాయి.

నేపాల్

అందమైన పర్వతాలు, ఆధ్యాత్మికతను కోరుకునే వారికి నేపాల్ తక్కువ ఖర్చులో బెస్ట్ ఆప్షన్. ఖాట్మండు దర్బార్ స్క్వేర్‌లోని పురాతన కట్టడాలు, పోఖారాలోని ఫేవా సరస్సు, చిన్నపాటి ట్రెక్కింగ్‌లు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి. స్థానిక ఆహారమైన మోమోస్, తుక్పా, దాల్ భాత్ కడుపు నింపడమే కాక బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటాయి.

దుబాయ్

Advertisement

దుబాయ్ అనగానే కేవలం ధనికులకే పరిమితం అనుకుంటారు. కానీ సరైన ప్లానింగ్‌తో రూ. 50,000 బడ్జెట్‌లోనే దుబాయ్‌ని కూడా సందర్శించవచ్చు. దుబాయ్ మాల్ వద్ద ఫౌంటెన్ షో, ఓల్డ్ దుబాయ్‌లోని సాంప్రదాయ మార్కెట్లు, బుర్జ్ ఖలీఫా అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రత్యేక ప్యాకేజీల ద్వారా తక్కువ ధరకే ఏడారిలో సఫారీ కూడా చేయవచ్చు. షవర్మా పాయింట్లు, భారతీయ రెస్టారెంట్లు, మెట్రో ప్రయాణం వల్ల రోజువారీ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి.

Also Read: స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

థాయిలాండ్

పర్యాటకులకు అత్యంత ఇష్టమైన దేశాల్లో థాయిలాండ్ కూడా ఒకటి. దీనిని కూడా బడ్జెట్ లోనే చుట్టి రావొచ్చు. ఫుకెట్‌లోని పటాంగ్ బీచ్, బిగ్ బుద్ధా, ఓల్డ్ సిటీ, ఫి ఫి దీవుల బోట్ టూర్లు ఇక్కడ బెస్ట్ ప్లేసెస్. అలాగే క్రాబీలోని రైలే బీచ్, టైగర్ కేవ్ టెంపుల్.. ప్రకృతి ప్రేమికులను మైమరిపిస్తాయి. థాయ్ వంటకాలైన ప్యాడ్ థాయ్, గ్రీన్ కర్రీ, మ్యాంగో స్టిక్కీ రైస్.. తక్కువ ధరకే లభిస్తాయి. మరోవైపు ఓ నాంగ్ బీచ్ పరిసరాల్లో బడ్జెట్ లోనే హోటల్స్ లో బస చేయవచ్చు.

Also Read: పెన్ డ్రైవ్‌పై ఈ రంధ్రాల సీక్రెట్ తెలుసా? దీనివల్ల ఇన్ని లాభాలా? ఇన్నాళ్లు తెలియలేదే!

Tags

Related News

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

హోటల్ గదిలో చెక్ ఇన్ చేశాక ఈ 5 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి.. లేకపోతే ప్రమాదకరం

Big Stories

Advertisement
×