E-Paper
Advertisement

మెుబైల్ నెంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. సెప్టెంబర్ 25 డెడ్ లైన్.. ఈ ప్రచారంలో వాస్తవమెంత!

మెుబైల్ నెంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. సెప్టెంబర్ 25 డెడ్ లైన్.. ఈ ప్రచారంలో వాస్తవమెంత!
Advertisement

Driving Licence: సోషల్ మీడియాలో డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి విపరీతంగా వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 25 తేదీ నాటికి డ్రైవింగ్ లైసెన్స్‌తో మొబైల్ నంబర్‌ను లింకప్ చేసుకోకపోతే లైసెన్స్ రద్దు లేదా సస్పెండ్ అవుతుందని తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH), రవాణా శాఖకు చెందిన ‘పరివాహన్’ పోర్టల్‌లో ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంలో వాస్తవమెంత? మెుబైల్ నెంబర్ లింకప్ లేకపోతే నిజంగానే లైసెన్స్ రద్దు అవుతుందా? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అసలు ప్రభుత్వం ఏం చెబుతోంది?

డ్రైవింగ్ లైసెన్స్ (సారథి), వాహన రిజిస్ట్రేషన్ (వాహన్) పోర్టల్‌లలో తమ మొబైల్ నంబర్‌లను నవీకరించుకోవాలని రవాణా శాఖ వాహనదారులను కోరుతోంది. నంబర్ సరిగ్గా ఉంటే రవాణా శాఖ అందించే ఆన్‌లైన్ సేవలు, ముఖ్యమైన అలర్ట్‌లు వేగంగా అందుతాయని దీని ముఖ్య ఉద్దేశం. దీనికోసమే ప్రత్యేకంగా ఆన్‌లైన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. అంటే మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవాలనే మాట నిజమే కానీ సెప్టెంబర్ 25 సస్పెన్షన్ గడువు అనేది మాత్రం అధికారికంగా ధృవీకరించబడలేదని తెలుస్తోంది.

డెడ్ లైన్ ప్రచారం ఎలా మొదలైంది?

Advertisement

కొన్ని మీడియా నివేదికలు, సోషల్ మీడియా పోస్టులు సెప్టెంబర్ 25 లేదా 26ను ఆఖరి తేదీగా పేర్కొంటూ అలా చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందనే ప్రచారాన్ని వ్యాప్తి చేశాయి. ప్రభుత్వం మొబైల్ నెంబర్లను అప్‌డేట్ చేసుకోమని చెబుతున్న సాధారణ సూచనకు ఈ డెడ్‌లైన్ వార్తలను ముడిపెట్టడంతో వాహనదారుల్లో తీవ్ర గందరగోళం మెుదలైంది.

లైసెన్స్ నిజంగానే రద్దు అవుతుందా?

సెప్టెంబర్ 25 తర్వాత మొబైల్ నంబర్ లింక్ చేయని లైసెన్సులన్నీ ఆటోమేటిక్‌గా రద్దవుతాయని చెప్పడానికి ఎలాంటి స్పష్టమైన ప్రకటన ప్రభుత్వ వర్గాల నుంచి రాలేదు. అటు రవాణా శాఖ వెబ్ సైట్ లోనూ దీనికి సంబంధించి ఆధారాలు లేవు. అటు పరివాహన్ పోర్టల్‌లో నంబర్ అప్‌డేట్ చేయమని సలహా ఇస్తున్నారే తప్ప చేయకపోతే రద్దు చేస్తామని ఎక్కడా పేర్కొనలేదు. కాబట్టి ప్రచారంలో ఉన్న వార్తలను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదని వాహనదారులకు నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Also Read: బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25వ తేదీనే జీతాలు.. కేంద్రం కీలక ఆదేశాలు!

RTO వద్దకు వెళ్లకుండానే అప్డేట్ చేయవచ్చా?

మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడానికి ఆర్‌టీఓ (RTO) ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పరివాహన్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే ఈ పని పూర్తి చేయవచ్చని సూచిస్తున్నాయి. ఒకవేళ లైసెన్స్ రికార్డుల్లో సాంకేతిక సమస్యలు ఉండి ఆన్‌లైన్‌లో నెంబర్ మారకపోతే మాత్రమే సంబంధిత ఆర్‌టీఓ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాయి.

Also Read: ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

 

Tags

Related News

జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

Big Stories

Advertisement
×