భారతీయ రైల్వే ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతుంది. సురక్షితమై, ఆహ్లాదకరమైన ప్రయాణం చేసేందుకు వీలుగా కొత్త కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళ తోటి ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా తగిన గైడ్ లైన్స్ ను అమలు చేస్తుంది. వాటిని కచ్చితంగా ఫాలో కావాలని సూచిస్తోంది.
రైళ్లలో ప్రయాణిస్తూ రాత్రి 10 గంటల తర్వాత సెల్ ఫోన్ వినియోగం విషయంలో కొన్ని రూల్స్ పాటించాలని సూచిస్తోంది. ముఖ్యంగా రీల్స్ చూడటం, ఎక్కువ సౌండ్ పెట్టి పాటలు వినడం లాంటి పనులు చేయకూడదని హెచ్చరిస్తోంది. అలా చేస్తే ఇబ్బందుల్లో పడటం ఖాయం అని హెచ్చరిస్తోంది. ఇటీవల, రాత్రి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చడానికి భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం రాత్రి 10 గంటల తర్వాత కొత్త నియమాలను ఇంప్లిమెంట్ చేస్తుంది. కొత్త మార్గదర్శకాలలో భాగంగా, రాత్రి 10 గంటల తర్వాత రైలులో నిశ్శబ్దం పాటించాలని సూచిస్తోంది. మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించే ఏ పనులు చేయకూడదు. ప్రతి ప్రయాణీకుడికి ప్రయాణంలో చక్కటి నిద్ర, విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తోంది.
రైల్వే చట్టం 1989 లోని సెక్షన్ 145 ప్రకారం.. ఎవరైనా ప్రయాణీకుడు రైలులో శాంతికి భంగం కలిగించినా, గట్టి శబ్దాలు చేసినా, ఇతరులను వేధించినా నేరంగా పరిగణిస్తారు. అలాంటి పనులు చేసే ప్రయాణీకులకు ముందుగా హెచ్చరిక లేదంటే జరిమానా విధించబడుతుంది. తొలిసారి తప్పుడు రూ. 500 నుంచి రూ. 1000 వరకు జరిమానా విధిస్తారు.
భారతీయ రైల్వే మార్గదర్శకాల ప్రకారం రైళ్లలో ఎక్కువ శబ్దంతో పాటలు వినడం నేరంగా పరిగణిస్తారు. నిబంధనల ప్రకారం, ఏ ప్రయాణీకుడు రైళ్లలో అధిక వాల్యూమ్ తో పాటలు వినకూడదు. మొబైల్ ఫోన్ లలో గట్టిగా మాట్లాడకూడదు. ఫోన్ మాట్లాడే విధానం ఇతరులకు అసౌకర్యం కలిగించినా, ఇబ్బందికి కారణం అయినా అది నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.
Read Also: ఫ్లైట్ 14 గంటలు ఆలస్యమైతే బర్గర్ ఇస్తారా? ప్రయాణీకుడికి రూ. 55 వేలు కట్టాల్సిందే!
ప్రయాణీకుల సౌలభ్యం కోసం, రాత్రి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు భారతీయ రైల్వే మార్గదర్శకాలను జారీ చేసింది. నిబంధనల ప్రకారం, ప్రయాణీకులు రాత్రి 10 గంటల తర్వాత ఫోన్ లలో బిగ్గరగా మాట్లాడకూడదు. హెడ్ ఫోన్స్ లేకుండా మ్యూజిక్ ప్లే చేయకూడదు. ఇంకా, నైట్ లైట్ మినహా అన్ని లైట్లను ఆపివేయాలి. ఈ నిబంధనలను పాటించని ప్రయాణీకులందరిపై రైల్వే కఠిన చర్యలు తీసుకోవచ్చు.
Read Also: ఈ దేశానికి వెళ్తే మీరు విమానాల్లో ఫ్రీగా తిరగొచ్చు.. చిల్లిగవ్వ కూడా చెల్లించక్కర్లేదు!