BigTV English

Telangana: సోమశిల టు శ్రీశైలం బోటు జర్నీ, 120 కిమీ ప్రయాణం, ఇంకెందుకు ఆలస్యం?

Telangana: సోమశిల టు శ్రీశైలం బోటు జర్నీ, 120 కిమీ ప్రయాణం, ఇంకెందుకు ఆలస్యం?

Telangana: తెలుగు రాష్ట్రాలు టూరిజంపై దృష్టి పెట్టాయి. ఈ విషయంలో ఏపీ-తెలంగాణ రాష్ట్రాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. కార్తీకమాసం నాటికి అంతా సిద్ధం కావాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ఓ అడుగు ముందుకేసింది. తాజాగా పర్యాటకులకు శుభవార్త చెప్పేసింది తెలంగాణ టూరిజం.


ఆగష్టు 19 నుంచి సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచి ప్రయాణం చేపట్టాలని డిసైడ్ అయ్యింది. భారీ వర్గాల నేపథ్యంలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం మొదలుపెడుతుందా? కొద్దిరోజులు ఆపుతుందా? అనేది పర్యాటకులకు వెంటాడుతోంది. ఆగష్టు 19 నుంచి నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ తీరంలో సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాలు వివరాలు తెలుసుకుందాం.

ఈ రెండు ప్రాంతాల మధ్య సుమారు 120 కిలోమీటర్లు బోరు జర్నీ ఉండనుంది. దాదాపు ఆరు నుంచి 7 గంటల సమయం పట్టనుంది. కృష్ణమ్మ ఒడిలో ప్రకృతి అందాలను వీక్షిస్తూ జర్నీ సాగుతుంది. ఈ జర్నీ కొన్నిరోజులు అందుబాటులో ఉండనుంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జర్నీకి బ్రేక్ పడనుంది.


గడిచిన వారం రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బూటు జర్నీ కంటిన్యూ అవుతుందా? లేదా? అన్న డౌట అప్పుడే పర్యాటకుల్లో మొదలైంది. ఎందుకంటే జలాశ్రయాలు భారీగా వరద నీరు వచ్చి చేరింది. జర్నీకి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డబుల్‌ డెక్కర్‌ ఏసీ లాంచీలు, మినీ లాంచీలు, స్పీడ్‌ బోట్లను రెడీగా ఉన్నాయి.

ALSO READ: భవిష్యత్ రైలు ప్రయాణం ఇలాగేనా? ఫస్ట్ ప్రయోగం సక్సెస్

పెద్దలకు రూ. 2 వేలు, చిన్నారులకు రూ.1,600 చొప్పున ధర నిర్ణయించారు అధికారులు. ఏమైనా మార్పులుంటే అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ఉదయం-సాయంత్రం టీ, స్నాక్స్, లంచ్ అందిస్తారు. ఈ ప్యాకేజీ గురించి వివరాలు తెలుసుకునేందుకు https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలి.

లేకుంటే సోమశిలలో టూరిజం ఆఫీసును సంప్రదించవచ్చు. వన్ వే ధరలతో పోల్చితే రెండువైపులా ధరలు వేర్వేరుగా ఉంటాయి. వాటి వివరాలను ఆ వెబ్ సైట్‌లో చూడొచ్చు.ఇంకెందుకు ఆలస్యం త్వరపడింది.

Related News

Indian Railways: భవిష్యత్ రైలు ప్రయాణం ఇలాగేనా? ఫస్ట్ ప్రయోగంతోనే అదరగొట్టిన రైల్వే!

AP Airport: ఏపీలోని ఆ ఎయిర్ పోర్ట్ ఒక రికార్డ్.. అందరి చూపు అటువైపే!

Condor Airlines plane: విమానంలో మంటలు.. పేలిన ఇంజిన్, 273 మంది ప్రయాణికులు

Diwali Tickets Sold out: దీపావళి టికెట్లకు ఫుల్ డిమాండ్, బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లోనే..

India’s Fastest Train: దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైళ్లు ఇవే, టాప్ ప్లేస్ లో ఏది ఉందంటే?

Big Stories

×