Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో.. ప్రయాణీకులను ఆకట్టుకునేలా రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తక్కువ ఖర్చుతో మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. తాజాగా రూ. 35 లోపు ఫ్రీగా జర్నీ చేసే అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ ఈ ఆఫర్ ను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ర్యాపిడోతో ఫ్రీ మెట్రో జర్నీ!
ప్రయాణీకులకు మెరుగైన రవాణా అందించే ర్యాపిడో యాప్ తాజాగా సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రస్తుతం మెట్రో టికెట్లు బుక్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవడం ద్వారా సుమారు రూ. 35 వరకు ఉచితంగా టికెట్లు అందిస్తోంది. ఈ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఒక కూపన్ కోడ్ ఇస్తున్నారు. దాన్ని అప్లై చేస్తే ఫ్రీగా టికెట్ పొందవచ్చు. ఇంతకీ ఆ కూపన్ కోడ్ ఏంటి? ఎలా అప్లై చేయాలి? అనేది ఇప్పుడు చూద్దాం..
Read Also: 2 వేల కొత్త రైళ్లు, ప్రయాణీకులందరికీ బెర్తులు.. ఇండియన్ రైల్వే ప్లాన్స్ అదుర్స్ అంతే!
కూపన్ కోడ్ ఎలా అప్లై చేయాలంటే?
మెట్రో ప్రయాణం చేయాలనుకునే ప్యాసింజర్లు ముందుగా ర్యాపిడో యాప్ ఓపెన్ చేయాలి. అందులో మెట్రో టికెట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు మెట్రో రైలు ఎక్కాల్సిన ప్రదేశం, దిగాల్సిన ప్రదేశం అంటే.. ఫ్రమ్, టు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎంజీబీఎస్ లో ఎక్కి దిల్ సుఖ్ నగర్ లో దిగాలంటే ఫ్రమ్ దగ్గర ఎంజీబీఎస్ టు దగ్గర దిల్ సుఖ్ నగర్ సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఫ్రీగా టికెట్ పొందాలంటే, దాని కింద అప్లై కూపన్ దగ్గర క్లిక్ చేయాలి. బాక్స్ లో ‘METRO’ అని క్యాపిటల్ లెటర్స్ లో టైన్ చేసి అప్లై చేయాలి. వెంటనే మీ టికెట్ ప్రైజ్ జీరో అవుతుంది. అంటే.. మీ టికెట్ ఛార్జీ రూ. 35 అంతకంటే తక్కువ ఉంటే జీరో అవుతుంది. ఒకవేళ రూ. 35 కంటే ఎంత ఎక్కువగా ఉన్నా, రూ. 35 రూపాయలు తగ్గించబడుతుంది. ఉదాహారణకు మీ టికెట్ కాస్ట్ రూ. 65 అయితే, రూ. 35 మైనస్ అవుతుంది. మిగతా రూ. 30 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ర్యాపిడో ఓపెన్ చేయండి. ఫ్రీగా మెట్రో జర్నీ చేసేయండి!
Read Also: వందే భారత్ లో విండో సీట్ కోసం ఇన్ని నాటకాలా? మీకు ఇలా జరిగిందా?