BRS Leader: బెల్లంపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఆయనపై కొంత మంది మహిళలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అమ్మాయిలతో ఆయన ప్రవర్తన తీరు బాగుండదనే పేరు కూడా ఉంది. అయితే తాజాగా బీఆర్ఎస్ నేత దుర్గం చిన్నయ్యపై హైదరాబాద్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్, తెలంగాణ భవన్ సమీపంలో ఆరిజన్ డైరీ యాజమాన్యం పేరుతో ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చాయి. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఈ ఫ్లెక్సీలలో సంచలన ఆరోపణలు చేస్తూ రాశారు. ‘కేసీఆర్ సార్, అటవీ గిరిజనులకు అండగా నిలవాలని.. బెల్లంపల్లి నియోజకవర్గ కామ పిశాచి దుర్గం చిన్నయ్య మీ పార్టీ ముసుగులో జరుగుతోన్న అరాచకాలను ఆపి మహిళలకు అండగా నిలవాలి. మానవ అక్రమ రవాణాలో నిందితులుగా ఉన్న మీ పార్టీ నాయకులని తక్షణమే సస్పెండ్ చేయాలని నిందితులకు కఠినంగా శిక్షలు పడేలా చూడాలని మనవి చేసుకుంటున్నాం’ అని ఫ్లెక్సీలో వేడుకున్నారు. అంతే కాకుండా కొమురం భీం జిల్లాలో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కొన్ని సంఘటనలను సైతం ఆరిజన్ డైరీ యాజమాన్యం వారు ముద్రించారు.
ALSO READ: SBI: నిరుద్యోగులు గుడ్‌న్యూస్.. ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. మంచి వేతనం
రెండేళ్ల కిందనే సంచలన ఆరోపణలు
ఇదిలా ఉండగా.. 2023 లోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సంచలన ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ఆరిజన్ డైరీ పేరుతో దుర్గం చిన్నయ్యపై తెలంగాణ భవన్ ముందు ఫ్లెక్సీలు వెలిశాయి. దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరిజన్ డైరీని బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు కోసం అనుమతులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమ వద్ద డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డాడని డైరీ నిర్వాహకులు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ALSO READ: YS Jagan: కేడర్ ఇక్కడ.. లీడర్ అక్కడ.. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న జగన్?
దుర్గం చిన్నయ్య అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి
అంతే కాకుండా ఆరిజన్ డైరీ ఎండీపై దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు న్యాయం కోసం దుర్గంపై ఆరిజన్ డైరీ నిర్వాహకులు పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరిజన్ డైరీ ఎండీ బయటకు వచ్చి మీడియా ముందు తనను మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ దుర్గం చిన్నయ్యకు ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దారుణంగా ఓటిమి పాలయ్యారు. కాగా అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.