Rinku Singh Marriage Postponed: భారత స్టార్ క్రికెటర్ రింకు సింగ్ – సమాజ్వాది పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ ల వివాహం వాయిదా పడినట్లు సమాచారం. రింకు సింగ్ – ప్రియా సరోజ్ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. లక్నోలో ఇటీవల చాలా గ్రాండ్ గా వీరి ఎంగేజ్మెంట్ సెర్మనీ జరిగింది. ఈ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, నటి జయ బచ్చన్ హాజరయ్యారు.
ఇక త్వరలోనే వీరి పెళ్లి జరుగుతుందని అంతా భావించారు. నిజానికి వీరి పెళ్లి నవంబర్ 19వ తేదీన జరగాల్సి ఉంది. కానీ ఈ ఏడాది జరగాల్సిన వీరి వివాహం వచ్చే సంవత్సరంలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా కధనం ప్రకారం.. నవంబరులో క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉన్న కారణంగా రింకు సింగ్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఇరువురు కుటుంబాలు కూడా ఈ వాయిదాకి అంగీకారం తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
2026 ఫిబ్రవరిలో రింకు సింగ్ – ప్రియా సరోజ్ ల పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ జంట పెళ్లికి సంబంధించిన తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. వీరి పెళ్లి కోసం ఇప్పటికే వారణాసిలోని తాజ్ హోటల్ ని బుక్ చేశారు. కానీ క్రికెట్ కమిట్మెంట్ వల్ల రింకు సింగ్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ హోటల్ బుకింగ్ ని 2026 ఫిబ్రవరి చివరి నాటికి బుక్ చేశారట.
ఇక ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ కి ప్రతినిత్యం వహిస్తూ వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్ కి చెందిన రింకు సింగ్. అనంతరం ఐపీఎల్ లో అద్భుతంగా తన ప్రదర్శనను కనబరిచి టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2023 లో ఐర్లాండ్ తో టి-20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు రింకు సింగ్. 2023 ఏడాదిలోనే వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.
ప్రియా సరోజ్ అతిపిన్న వయస్కురాలైన ఎంపీ. ఆమె 25 సంవత్సరాల వయసులోనే లోక్సభ ఎన్నికలలో మచ్లీ షహర్ నుండి గెలుపొందారు. ఆమె సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు. ప్రియా న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టబద్రురాలయింది. నోయిడా లోని అమిటి విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి కూడా పూర్తి చేసింది.
Also Read: Sai Sudarshan – Pant: ఐపీఎల్ లో ఎవడైనా ఆడతాడు.. ఇండియాకు ఆడితేనే మగాడు అవుతాడు
ఇక రింకు సింగ్ 2025 ఐపీఎల్ లో పెద్దగా రాణించలేదు. ఈ సీజన్ లో రింకు 29.42 యావరేజ్ తో కేవలం 206 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ప్రస్తుతం వీరి వివాహం వాయిదా పడడానికి రింకు బిజీ షెడ్యూల్ ఏ కారణమని క్రీడా వర్గాలు అంటున్నాయి. నవంబర్ 14 నుండి డిసెంబర్ 19 వరకు భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు టెస్ట్ లు, 3 వన్డేలు, ఐదు టి-20 లు ఆడబోతోంది. ఈ క్రమంలోనే పెళ్లిని వచ్చే ఏడాది {2026} ఫిబ్రవరికి వాయిదా వేసినట్లు సమాచారం.