BigTV English
Advertisement

AskDISHA 2.0: రైల్వేలోకి ఏఐ ఎంట్రీ, టికెట్ బుకింగ్ నుంచి క్యాన్సిలేషన్ వరకు అన్ని పనులు చేసేస్తుంది!

AskDISHA 2.0: రైల్వేలోకి ఏఐ ఎంట్రీ, టికెట్ బుకింగ్ నుంచి క్యాన్సిలేషన్ వరకు అన్ని పనులు చేసేస్తుంది!

AskDisha – IRCTC: రైల్వే ప్రయాణీకులలో దాదాపు 75 శాతం మంది ఆన్ లైన్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకుంటారు. అయితే, ఇప్పటికీ చాలా మందికి ఆన్ లైన్ ద్వారా టికెట్స్ బుక్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిజానికి టికెట్ బుకింగ్ అనేది శ్రమతో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ చాలా మంది ప్రయాణీకులు టికెట్స్ బుక్ చేసుకోవడం, క్యాన్సిల్ చేసుకోవడం, రీఫండ్ క్లెయిమ్ చేసుకోవడం లాంటి పనులు ఆన్ లైన్ ద్వారానే చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే సరికొత్త ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో ప్రయాణీకులు మరింత ఈజీగా రైల్వే సర్వీసులు పొందే అవకాశం కల్పిస్తోంది. తాజాగా అప్ డేట్ చేసిన ఏఐ చాట్‌ బాట్  AskDISHA 2.0ను పరిచయం చేసింది. రైల్వే ప్రయాణీకులకు రోజువారీ  సేవలను అందించేందుక సాయపడనుంది.


ఇంతకీ AskDISHA 2.0 అంటే ఏంటి?

రైల్వేకు సంబంధించి పూర్తి వివరాలను ప్రయాణీకులకు అందించేందుకు డిజిటల్ ఇంటరాక్షన్ కోసం AskDISHAను 2018లో IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏఐ సంస్థ CoRover.ai సహకారంతో దీనిని మరింత డెవలప్ చేసింది. తాజాగా AskDISHA 2.0 వెర్షన్ ను ప్రయాణీకులక పరిచయం చేసింది. ప్రయాణీకులకు వాయిస్ ఎనేబుల్డ్ సేవలను అందిస్తుంది. పలు భాషల్లో ఈ ఫీచర్ ప్రయాణీకులకు వివరాలను అందిస్తుంది. AskDISHA 2.0 ప్రతిరోజూ లక్షలాది ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. ఇంగ్లీష్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, గుజరాతీ సహా పలు భాషలలో సర్వీసులు అందిస్తోంది.


AskDISHA 2.0 ప్రత్యేకతలు

⦿ వాయిస్, టెక్స్ట్ చాట్: పలు భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్ రూపంలో ప్రయాణీకుల ప్రశ్నలకు సమాధానం చెప్తుంది.

⦿ పాస్‌వర్డ్‌లు అవసరం లేదు: ఈజీ యాక్సెస్ కోసం OTP ద్వారా లాగిన్ అయ్యే అవకాశం ఉంది.

⦿ ప్రయాణీకుల డేటా సేవ్: తరచుగా రైలు ప్రయాణం చేసే ప్యాసింజర్ల వివరాలను సేవ్ చేసి ఉంచుతుంది.

⦿ చెల్లింపులు ఆలస్యం అయినా: ఒక్కోసారి సైట్ డౌన్ అయినా 15 నిమిషాల్లోచెల్లింపులను ప్రయత్నించే అవకాశం కల్పిస్తుంది.

⦿ TDR సేవలు: టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ల స్టేటస్ ను ట్రాక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

AskDISHA 2.0 ని ఎలా ఉపయోగించాలి

IRCTC వెబ్‌ సైట్, మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉన్న AskDISHA 2.0 డిజిటల్ రైల్వే ప్రశ్నల కోసం వన్ స్టాప్ హబ్‌ గా పనిచేస్తుంది.

⦿ టికెట్ బుక్ చేసుకోవడానికి: టికెట్ బుక్ చేసుకోవడానికి ఈ చాట్ బాట్ లో ‘టికెట్ బుక్ చేయండి’ అని వాయిస్ కమాండ్ ఇవాలి. ఎక్కడ ఎక్కాలి? ఎక్కడ దిగాలి? ప్రయాణ వివరాలను చెప్పాలి. అందుబాటులో ఉన్న రైళ్ల వివరాలను చూపిస్తుంది. అనుకూలమైన రైలును సెలెక్ట్ చేసుకుని ఓటీపీ ఉపయోగించి ఓకే చేయాలి. డబ్బులు చెల్లించిన తర్వాత టికెట్ ఆటోమేటిక్ గా బుక్ అవుతుంది. ఈ టికెట్ ను పొందే అవకాశం ఉంటుంది.

⦿ టికెట్ క్యాన్సిల్ చేయాలంటే?: టికెట్ బుకింగ్ మాదిరిగానే ‘టికెట్ క్యాన్సిల్ చేయండి’ అని వాయిస్ కమాండ్ ఇవ్వాలి. పీఎన్ఆర్ వివరాలను చెప్పాలి. క్యాన్సిలేషన్ ను యాక్సెప్ట్ చేయాలి. ఇమెయిల్ కు క్యాన్సిలేషన్ వివరాలు అందజేయబడుతాయి.

⦿ రీఫండ్ ను ట్రాక్ చేయడం: ఈ ఏఐ చాట్ బాట్ ద్వారా ‘రీఫండ్ స్టేటస్’ అని అడగండి. PNR,  లావాదేవీ IDని ఎంటర్ చేయాలి.

Read Also: కాకినాడకు వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్, స్పెషల్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Related News

IRCTC TN Temples Tour: హైదరాబాదు నుండి తమిళనాడు ఆలయాల యాత్ర.. 7 రోజుల ఆధ్యాత్మిక పర్యటన వివరాలు

Train Food: రైలులో వెజ్ బిర్యానీ కొన్న ప్రయాణికుడు.. రూ.25 వేలు చెల్లించిన రైల్వే, ఎందుకంటే?

Lower Currency Countries: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!

Monorail Derails: ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు.. మరి ప్రయాణికులు?

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Big Stories

×