Puri Jagannadh: ప్రస్తుతం కొంచెం ఫామ్ లో లేరు కానీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అంటే ఖచ్చితంగా వినిపించే పేరు పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పూరి. మొదటి సినిమాతోనే ఆటిట్యూడ్ అంటే ఏంటో చూపించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. వాస్తవానికి పూరి జగన్నాథ్ బద్రి సినిమా చేసేటప్పుడు మొదట ఈ షో చూసిన చాలామంది డిజాస్టర్ అంటూ మాట్లాడారు. కట్ చేస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వైజాగ్ జగదాంబ సెంటర్లో దాదాపు 50 రోజులు పాటు హౌస్ఫుల్ బోర్డుతో ఈ సినిమా నడిచింది. ఈ సినిమా తర్వాత పూరి చేసిన సినిమా బాచి. ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
స్టార్ హీరోలతో సినిమాలు
ఒకప్పుడు పూరి జగన్నాథ్ స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేశాడు. అలానే వాళ్లందరికీ మంచి హిట్స్ ఇచ్చాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వీళ్ళ అందరితోనూ పూరి జగన్నాథ్ కు పని చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్లు పూరి జగన్నాథ్ సినిమాల్లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో పూరి జగన్నాథ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మానేశారు. దీనికి కారణం పూరి ట్రాక్ రికార్డు అని చెప్పాలి. టెంపర్ సినిమా తర్వాత ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కెరియర్ లో ఆరెంజ్ హిట్ సినిమా పడలేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతున్న ప్రతిసారి అంచనాలన్నీ తారుమారవుతున్నాయి. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా సినిమా చేస్తున్నారు పూరి.
విజయేంద్ర ప్రసాద్ కు కథ చెప్పారా.?
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ రైటర్స్ లో విజయేంద్రప్రసాద్ ఒకరు. ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ప్రతి సినిమాకు కథను అందిస్తుంటారు విజయేంద్రప్రసాద్. తన కొడుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు అయినా కూడా, విజయేంద్రప్రసాద్ కు పూరి జగన్నాథ్ అంటే విపరీతమైన ఇష్టం. తన రైటింగ్ స్టైల్ కు విజేందర్ ప్రసాద్ ఫిదా అయిపోయారు. పూరి జగన్నాథ్ లాంటి టాలెంటెడ్ దర్శకులు ప్లాప్ సినిమా తీస్తే తనకు నచ్చదు అని పలు సందర్భాల్లో చెప్పారు. ఈసారి సినిమా మొదలెట్టే ముందు నాకు కథను చెప్పాలి అంటూ పూరిను డిమాండ్ చేశారు. అయితే వీరిద్దరూ కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న సినిమా కథను విజయేంద్రప్రసాద్ కు పూరి జగన్నాథ్ చెప్పారా అని చాలామందికి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : Sukumar: రామ్ చరణ్ కు డెఫ్ క్యారెక్టర్ పెట్టకూడదు అని ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోయాను