BigTV English

Jonny Bairstow: పాకిస్థాన్ కంటే దారుణంగా ఫీల్డింగ్ చేస్తున్న గుజరాత్.. ఇలా చేస్తున్నారేంట్రా

Jonny Bairstow: పాకిస్థాన్ కంటే దారుణంగా ఫీల్డింగ్ చేస్తున్న గుజరాత్.. ఇలా చేస్తున్నారేంట్రా

Jonny Bairstow:    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… కాసేపటి క్రితమే ఎలిమినేటర్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. అయితే ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ అదరగొడుతోంది. మూలాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అలాగే బెయిర్ స్టో అటు సూర్య కుమార్ యాదవ్ ముగ్గురు కూడా అద్భుతంగా దున్నేస్తున్నారు. వీళ్ళ ఊపు చూస్తుంటే ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచేలా కనిపిస్తున్నారు.


Also Read: PBKS Fans : తెల్లటి డ్రెస్సుల్లో అందాల భామలు..రాం రాజ్ కాటన్ అంటూ ట్రోలింగ్

పాకిస్తాన్ కంటే దారుణంగా తయారైన గుజరాత్ ఫీల్డింగ్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో గుజరాతి టైటాన్స్ ఫీల్డింగ్ చాలా చెత్తగా తయారైంది. ఒక క్యాచ్ కూడా పట్టడం లేదు గుజరాత్ ఫీల్డర్లు. ముఖ్యంగా వికెట్ కీపింగ్ చేస్తున్న కుషాల్ మెండిస్ అయితే అత్యంత దారుణంగా తయారయ్యాడు. గుజరాత్ ఆటగాడు బట్లర్… ఇంగ్లాండ్ కు వెళ్లిపోగా శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ అతని స్థానంలో జట్టు లోకి వచ్చాడు.

అయితే ఈ మ్యాచ్ లో ఆడిన.. కుశల్ మెండిస్ కీపింగ్ చేశాడు. అయితే మొదట రోహిత్ శర్మ క్యాచ్ ను డ్రాప్ చేసి.. అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మ.. అడ్డంగా దొరికిపోయాడు. కానీ ఆ సింపుల్ క్యాచ్ ను వికెట్ కీపర్ గా ఉండి కూడా పట్టలేకపోయాడు. ఆ తర్వాత డేంజర్ గా మారిన సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ కూడా వదిలేశాడు. జెరాల్డ్ కోట్జీ బౌలింగ్లో సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ ను మిస్ చేశాడు కుశల్ మండిస్. అటు జెరాల్డ్ కోట్జీ కూడా ఒక క్యాచ్ మిస్ చేశాడు. దీంతో గుజరాత్ టీం పాకిస్తాన్ కంటే అత్యంత దారుణంగా ఫీల్డింగ్ చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బెయిర్ స్టో అవుట్

అయితే డేంజర్ గా మారిన బెయిర్ స్టవ్ వికెట్ మాత్రం అద్భుతంగా తీశారు గుజరాత్ ఆటగాళ్లు. 47 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో… వికెట్ ను సాయి కిషోర్ తీశాడు. సాయి కిషోర్ బౌలింగ్ లో ఆఫ్ సైడ్ కొట్టేశాడు బెయిర్ స్టో. అయితే ఆ సమయంలో ఆఫ్ సైడ్ లో ఉన్న సాయి సుదర్శన్ క్యాచ్ అందుకోబోయాడు. అయితే అతని చెయ్యి తగిలి…గిర్రున ఎగిరింది బంతి. ఈ నేపథ్యంలోనే ఆ క్యాచ్ ను జెరాల్డ్ కోట్జీ అందుకున్నాడు. దింతో బెయిర్ స్టో 47 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Stoinis Partner : కోహ్లీ ఇజ్జత్ తీసిన స్టోయినిస్ వైఫ్… బండ బూతులు తిడుతూ

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×