E-Paper
Advertisement

Tourists Banned Places: ప్రపంచంలోని ఈ ప్రదేశాలకు పర్యాటకులు అడుగు పెట్టకూడదు, ఎందుకో తెలుసా?

Tourists Banned Places: ప్రపంచంలోని ఈ ప్రదేశాలకు పర్యాటకులు అడుగు పెట్టకూడదు, ఎందుకో తెలుసా?
Advertisement

ప్రతి దేశంలో కొన్ని పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. వాటిని చూసేందుకు టూరిస్టులు తరలి వస్తుంటారు. ప్రకృతి రమణీయతను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, కొన్ని దేశాల్లోని కొన్ని ప్రదేశాలకు పర్యాటకులను అస్సలు అనుమతించరు. భద్రతా కారణాలతో కొన్ని ప్రాంతాలకు, పురాతన ప్రాంతాలను కాపాడాలనే ఉద్దేశంతో మరికొన్ని ప్రదేశాలకు టూరిస్టులను అనుమతించడం లేదు. ఇంతకీ పర్యాటకులను నిషేధించిన ఆ ప్రాంతాలు ఏవంటే..

⦿ స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్, నార్వే

Advertisement

స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్ అనేది నిషేధిత ప్రాంతాల్లో ఒకటి. దీనిని డూమ్స్‌ డే వాల్ట్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచ ఆహార భద్రత కోసం పంట విత్తనాలతో కూడిన సురక్షితమైన విత్తన భాండాగారం. అందుకే ఈ ప్రాంతంలోకి పర్యాటకులను నిషేధించారు.

⦿ UN బఫర్ జోన్, సైప్రస్

Advertisement

UN బఫర్ జోన్  అనేది సైప్రస్‌ లో 110-మైళ్ల పరిధిలో విస్తరించి ఉంది. గ్రీక్, టర్కిష్ ను ఈ ప్రాంతం వేరు చేస్తుంది. ఈ ప్రాంతంలో నిత్యం ఉద్రిక్తతలు కొనసాగుతాయి. ఇక్కడ శాంతిని పరిరక్షించేందు ఐక్యరాజ్య సమితి ప్రయత్నిస్తోంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలోకి పర్యాటకులను అనుమతించడం లేదు.

⦿ క్విన్ షి హువాంగ్, చైనా సమాధి

క్విన్ షి హువాంగ్ అనే ప్రాంతంలో చైనా మొదటి చక్రవర్తి సమాధి ఉంటుంది. ఈ సమాధి భద్రతా బలగాల వలయంలో ఉంటుంది. పురాతనమైన ఈ సమాధిని సంరక్షించాలనే ఉద్దేశంతో పర్యాటకులను ఇక్కడికి అనుమతించడం లేదు.

 ⦿ ఏరియా 51, నెవాడా, USA

ఈ ప్రాంతంలో యుఎస్ ఎయిర్ ఫోర్స్  బేస్ ఉంది. ఇక్కడ గ్రహాంతర పరిశోధనలు కొనసాగుతాయి. గ్రహాంతర వాసుల గురించి శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచి అన్వేషణ కొనసాగిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని రహస్య ప్రాంతంగా కొనసాగిస్తున్నారు. పరిశోధనా భద్రతా కారణాలతో ఇక్కడికి పర్యాటకులను అనుమతించడం లేదు.

⦿ నార్త్ సెంటినెల్ ద్వీపం, భారత్

భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో నార్త్ సెంటినెల్ ద్వీపం కూడా ఒకటి. అండమాన్ దీవులలో ఈ ద్వీపం కూడా ఉంది. ఇక్కడ సెంటినెలీస్ అనే అరుదైన తెగ ప్రజలు ఉంటారు. వారిని, వారి ప్రత్యేక సంస్కృతిని రక్షించడానికి పర్యాటకులను ఇక్కడికి అనుమతించడం లేదు. భారత ప్రభుత్వం 1991లో సందర్శకులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

⦿ వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్, వాటికన్ సిటీ

వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్‌ లో సున్నితమైన చారిత్రక పత్రాలు, రహస్య రికార్డులు ఉన్నాయి. సాధారణ పర్యాటకులను లోపలికి అనుమతించరు. కానీ, మతాధికారులు, పరిశోధకులు లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తారు.

⦿ ఫోర్ట్ నాక్స్, కెంటుకీ, USA

ఫోర్ట్ నాక్స్ భారీ మొత్తంలో బంగారం నిల్వకు US బులియన్ డిపాజిటరీకి నిలయం. భద్రతా కారణాల దృష్ట్యా, ఈ ప్రదేశంలోకి పర్యాటకులకు అనుమతించరు.

⦿లాస్కాక్స్ కేవ్, ఫ్రాన్స్

లాస్కాక్స్ గుహ ఓ పురాతన గుహ. ఇందులో  17,000 సంవత్సరాల నాటి చిత్రాలు ఉంటాయి. ఈ గుహలోకి 1963 నుంచి పర్యాటకులను అనుమతించడం లేదు. ఇందులోని పెళుసుగా ఉండే కళాకృతులను రక్షించడానికి పురావస్తు అదికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read Also: అక్కడ అడుగు పెడితే ప్రాణాలు గాల్లో కలిసినట్టే, ఒళ్లు గగుర్పొడిచే ఈ రైల్వే స్టేషన్ ఘోస్ట్ స్టోరీ గురించి మీకు తెలుసా?

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×