BigTV English

Ahmedabad Bullet Train: హైదరాబాద్ మెట్రోకు లక్ష పాట్లు.. అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్‌కు లక్ష కోట్లు..

Ahmedabad Bullet Train: హైదరాబాద్ మెట్రోకు లక్ష పాట్లు.. అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్‌కు లక్ష కోట్లు..

Ahmedabad Bullet Train: హైదరాబాద్ మెట్రో నెట్ వర్క్ విస్తరణకు పుల్ స్టాప్ పడుతోందా? రూల్స్ ప్రకారం డీపీఆర్ లు ఇచ్చినా కేంద్రం నుంచి ఎందుకు సౌండ్ ఉండడం లేదు? గ్లోబల్ సిటీ అయిన హైదరాబాద్ లో ట్రాన్స్ పోర్ట్ మెరుగుపడితే దేశ ఎకానమీకే మేలు కాదా? సీఎం రేవంత్ సహా మంత్రులు క్రమం తప్పకుండా మెట్రో ఫేజ్ 2పై రిక్వెస్టులు చేస్తున్నా ఎందుకు ముందడుగు పడడం లేదు? అసలు రీజన్ ఏంటి?


గతేడాది నవంబర్ లో మెట్రో ఫేజ్ 2A DPR సమర్పణ

మెట్రో ఫేజ్ 2 నిర్మాణం హైదరాబాద్ కు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగా ఫేజ్-2Aలో 76.4 కిలోమీటర్ల పొడవున్న ఐదు కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌లు గతేడాది నవంబర్ 4న కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. అలాగే ఫేజ్-2B కింద 86.1 కిలోమీటర్ల పొడవున్న మూడు కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌లు ఈ ఏడాది జూన్ 22న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఫేజ్ 2 ఒకేసారి అంటే నిధుల ఇబ్బందులు వస్తాయని చెప్పి.. ఫేజ్ 2 a, ఫేజ్ 2 బి గా డివైడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ కేంద్రం నుంచి ఈ విషయంలో ఉలుకు లేదు, పలుకు లేదు. తెరవెనుక రీజన్స్ ఏంటి? డీపీఆర్ లకు ఎందుకు ఆమోదముద్ర పడడం లేదు?


హైదరాబాద్ లో 95 లక్షలకు పైగా వాహనాలు

హైదరాబాద్ లాంటి గ్లోబల్ సిటీకి మెట్రో ఫేజ్ 2 నిర్మాణం ఎందుకు అత్యవసరమో చూద్దాం. హైదరాబాద్ లో 95 లక్షలు వాహనాలు ఉన్నాయి. వీటికి తోడు రోజూ కొత్తగా 2300 కొత్త వెహికిల్స్ రోడ్డెక్కుతున్నాయి. అంటే ట్రాఫిక్ నరకంగా మారిపోతోంది. గతేడాది వరకు సిటీ రోడ్లపై వాహనాల సగటు వేగం గంటకు 15 నుంచి 18 కిలోమీటర్లే. ఇప్పుడది ఫుట్ పాత్ ఆక్రమణలు తీసేయడం, ట్రాఫిక్ పోలీసులు వర్కవుట్ చేయడంతో కొంతలో కొంత బెటర్ అయింది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయంతే. ఈ స్పీడ్ తో వెళ్తే అనుకున్న పనులు అనుకున్న టైంకు జరగడం కష్టమే. ఇది ప్రొడక్టివిటీపై ఎఫెక్ట్ చూపుతుంది. అంతే కాదు.. అంతర్జాతీయ కంపెనీలు, దేశ విదేశీ ప్రతినిధులు ఈ ట్రాఫిక్ చూసి సగం వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. సో సిటీ అభివృద్ధిలో ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వేగంగా వెళ్తే వేగంగా పనులు జరుగుతాయి. అనుకున్న అవుట్ పుట్ వస్తుంది. అదీ మ్యాటర్.

చెన్నైలో కి.మీ.కి రూ. 619 – 756 కోట్లు

రైట్ ఇప్పుడు మళ్లీ మెట్రో ఫేజ్ 2 నిర్మాణం విషయానికొద్దాం. ఫేజ్ 2-A డీపీఆర్ సమర్పించి 8 నెలలు కావొస్తోంది. ఫేజ్ 2 బీ ఇటీవలే సమర్పించారు. ఫేజ్ 2-A పై ఇంత వరకు కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి. సరే కేంద్ర ప్రయారిటీ ప్రకారం చేస్తుందని అనుకున్నా.. అలా కూడా జరగడం లేదు. హైదరాబాద్ దేశంలోనే వేగంగా విస్తరిస్తున్న సిటీ. ఉద్యోగ, ఉపాధి కల్పన, అంతర్జాతీయ ఐటీ సంస్థలు కొలువై ఉన్న సిటీ. మేజర్ ఎకానమీ జెనరేట్ చేస్తున్న నగరమిది. మరి ఇలాంటి సిటీకి కేంద్రం ఎందుకు మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదన్నది మేజర్ పాయింట్.

గత ప్రభుత్వం మెట్రో విస్తరణను లైట్ తీసుకుందా?

కేంద్రానికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయనుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్టీ ఉంటే ఒకలా.. వేరే పార్టీలు ఉంటే మరోలా పనులు వేగం పుంజుకుంటాయన్న చర్చ అయితే ఉంది. సరే కేంద్రంలో, తెలంగాణలో డబుల్ ఇంజిన్ లేదు. కానీ సపోర్ట్ అవసరం అన్న పాయింట్ ను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. వీటికి తోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెట్రో ఫేజ్ 2 ను పెద్దగా  పట్టించుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వంతో సరైన సఖ్యత లేకపోవడం, ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే నాటి సీఎం కేసీఆర్ సైడ్ అవడం ఇవన్నీ జరిగాయి. అందుకే మెట్రో విషయంలో హైదరాబాద్ వెనుకబడిందన్న టాక్ కూడా వినిపిస్తోంది.

బిహార్ కు మోడీ వరాల జల్లు

గత ప్రభుత్వం రెండో టర్మ్ నుంచే ఈ విషయంపై శ్రద్ధ పెట్టి ఒత్తిడి తెచ్చి ఉంటే ఈ పాటికి మెట్రో ఫేజ్ 2 పట్టాలెక్కి ఉండేదన్న వాదన కూడా ఉంది. మరో పాయింట్.. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు జేడీయూ, టీడీపీ కీలకమైన సపోర్ట్ ఇస్తున్నాయి. ఈ రెండు పార్టీలు హ్యాండ్ ఇస్తే ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు. ఈ సందర్భంలో బిహార్, ఏపీలకు మోడీ సర్కార్ చాలా ప్రాధాన్యం ఇస్తోంది. ఎందుకంటే అది వారి అవసరం. అది బహిరంగ రహస్యమే. పైగా బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడ్డాయి. సో మోడీ అటు బిహార్, ఇటు ఏపీకి వస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది మోడీ ప్రభుత్వ నిర్ణయం.

దేశ జీడీపీకి, ఐటీ ఎక్స్ పోర్ట్స్ కు, ఎకానమీకి చాలా కీలకంగా ఉంది

అయితే ఇందులో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న హైదరాబాద్ లాంటి నగరాల్లో అభివృద్ధిని కూడా పట్టించుకోవడం ముఖ్యమే. ఎందుకంటే దేశ జీడీపీకి, ఐటీ ఎక్స్ పోర్ట్స్ కు, ఎకానమీకి చాలా కీలకంగా ఉంది. అలాంటి చోట మెట్రో వస్తే దేశవ్యాప్తంగా ఉపాధి కోసం వచ్చే అన్ని రకాల ఉద్యోగులకు, అన్ని రకాల వర్క్ ఫోర్సెస్ కి చాలా ఉపయోగం. ఈ సబ్జెక్ట్ ను దృష్టిలో పెట్టుకునైనా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి వెంటనే అనుమతులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.

మెట్రో ఫేజ్ 2కి ఆమోదం ఎప్పుడని ఎదురుచూపులు

నిజానికి ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో తెలంగాణకు మెట్రో ఫేజ్ 2కి ఆమోదం అన్న వార్త వస్తుందేమోనని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఆశగా ఎదురుచూస్తోంది. కానీ ప్రతి కేబినెట్ మీటింగ్ తర్వాతి ప్రెస్ మీట్ చాలా నిరాశనే కల్పిస్తోంది. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ను కలిసి మెట్రో ఫేజ్ 2కి అనుమతి ఇవ్వాలని కోరారు. 26,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పట్టణాభివృద్ధి శాఖ కోరినట్లుగానే డీపీఆర్ ఇచ్చామని గుర్తు చేశారు. మిగితా నగరాలతో పోలిస్తే కిలోమీటర్ కు చాలా తక్కువ ఖర్చుతోనే మెట్రో లైన్ నిర్మాణానికి కోట్ చేశారు. ఇంత చేసినా గ్రీన్ సిగ్నల్ మాత్రం రావడం లేదు. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌ 2పై కేంద్రమంత్రివర్గం నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దేశ జీడీపీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని, ఈ విషయాన్ని దృష్టి పెట్టుకునైనా వెంటనే అనుమతి ఇవ్వాలంటున్నారాయన. సో డీపీఆర్ రెడీగా ఉంది. గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి. మరి తర్వాతి క్యాబినెట్ మీటింగ్ లోనైనా గుడ్ న్యూస్ వస్తుందేమో అన్న ఎదురుచూపులు తెలంగాణ ప్రభుత్వానికి తప్పడం లేదు.

మరి అనుమతి వస్తుందా.. ఆగుతుందా?

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 డీపీఆర్ చాలా పొదుపు మంత్రం పాటించింది. దేశంలోని ఇతర నగరాల్లో మెట్రో నిర్మాణాలతో పోలిస్తే కిలోమీటర్ కు చాలా తక్కువే కోట్ చేశారు. కాకపోతే కొంచెం ఎక్కువ దూరాలు ఉన్నాయి. ఈ స్థాయి గ్లోబల్ సిటీకి ఆ మాత్రం దూరం అవసరమే అన్న అభిప్రాయంతోనే రేవంత్ సర్కార్.. మెట్రో ఫేజ్ 2లో A, B కారిడార్లుగా డివైడ్ చేసింది. పైగా కొన్ని కారిడార్లను ఇప్పుడే నిర్మిస్తే ఆస్తుల సేకరణకు నిధుల భారం అంతగా లేదు. ఇదో ప్లస్ పాయింట్. కేంద్రం అనుమతి ఇవ్వడానికి అన్ని రకాల అర్హతలు హైదరాబాద్ మెట్రోకు ఉన్నాయి. మరి అనుమతి వస్తుందా.. ఆగుతుందా?

మెట్రో ఫేజ్ 2 బడ్జెట్ ఎక్కువని ఆపుతున్నారా?

దేశంలోని అన్ని మెట్రోలకు వేగంగా అనుమతులు వస్తున్నాయ్.. నిర్మాణం పట్టాలెక్కుతోంది. హైదరాబాద్ విషయంలోనే ఆలస్యం జరుగుతోంది. ఇదీ రాష్ట్ర ప్రభుత్వ వాదన. డీపీఆర్‌లు ఇచ్చి చాలా కాలం కాలేదు. అయితే సిటీలో ఉన్న ట్రాఫిక్ కండీషన్స్, అవుట్ పుట్ కెపాసిటీ, గ్లోబల్ అవుట్ రీచ్ ను దృష్టిలో పెట్టుకుని వేగంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందన్నది తెలంగాణ ప్రభుత్వం వాదన. మెట్రో ఫేజ్ 2 చాలా పెద్దదని, బడ్జెట్ కూడా ఎక్కువే అన్నది కేంద్ర ప్రభుత్వ వర్గాల ఆలోచన.

పన్నుల వాటా ప్రస్తావిస్తున్న కాంగ్రెస్

అయితే రేవంత్ సర్కార్ మరో లెక్క కూడా చెబుతోంది. పన్నుల వాటాలో తెలంగాణకు అంతంతే రిలీజ్ చేస్తున్నారని, తెలంగాణ రూపాయి కేంద్రానికి ఇస్తే తిరిగొస్తున్నది 42 పైసలే అన్న విషయాన్ని సీఎం రేవంత్ చాలా సార్లు చెప్పుకొచ్చారు. గతంలో 9 పేజీల లేఖ కూడా విడుదల చేశారు సీఎం. మంచి ఎకానమీ అవుట్ పుట్ ఇచ్చే రాష్ట్రానికి కొంత భారమైనా సరే మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్పేంటన్న వాదనను వినిపిస్తున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద భారం కూడా కాదు ఈ ప్రాజెక్టు. అయినా సరే ఆలస్యం ఎందుకన్నది మంత్రుల ప్రశ్న.

మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్పేంటన్న వాదన

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో A & B డీపీఆర్‌లు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ అలాగే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సహకారంతో రెడీ అయ్యాయి. ట్రాఫిక్ అవసరాల ఆధారంగా రూట్ డిజైన్ చేశారు. ఫేజ్-2Aలో కిలోమీటరుకు 318 కోట్ల రూపాయలు, ఫేజ్-2Bలో 227.39 కోట్ల అంచనా వేశారు. ఇతర నగరాల మెట్రో నిర్మాణాలతో పోలిస్తే మనది చాలా తక్కువ. బెంగళూరులో కిలోమీటర్ కు 373 నుంచి 569 కోట్లు కోట్ చేస్తే, చెన్నైలో కిలోమీటర్ మెట్రో నిర్మాణానికి ఏకంగా 619 నుంచి 756 కోట్ల రూపాయలు, ముంబైలో 543 నుంచి 1,492 కోట్ల రూపాయలు కోట్ చేశారు. ఇందులో ఆస్తుల సేకరణకే చాలా మొత్తం ఖర్చవుతుంది. సరే మ్యాటర్ ఏదైనా మిగితా వాటితో పోలిస్తే మన మెట్రో కొటేషన్ చాలా తక్కువే ఉంది. కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవడానికి ఈ పాయింట్ ను లెక్కలోకి తీసుకోవచ్చు.

ఫేజ్-2A, 2Bతో శంషాబాద్ కు ఫుల్ కనెక్టివిటీ

ఫేజ్-2A, 2B రెండూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కనెక్టివిటీని చాలా పెంచుతాయి. ఫేజ్-1 మూడు లైన్ల నుంచి యాక్సెస్ పెరుగుతుంది. ఫ్లైట్ మిస్ అవకుండా అనుకున్న టైంకు సిటీలో ఎక్కడి నుంచైనా చేరుకోవచ్చు. ఎలివేటెడ్, ఆట్-గ్రేడ్ డిజైన్‌లు ఖర్చును తగ్గించడంతో పాటు, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఫేజ్-2A, 2B కారిడార్లు 2028 నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫేజ్-2 Aలో మొత్తం దూరం 76.4 కిలోమీటర్లుగా ఉంది. 5 కారిడార్లున్నాయి.

PPP నుంచి రూ. 1,816 కోట్లు

ఖర్చు 24, 269 కోట్లు, అలాగే ఫేజ్ 2 బీలో 86.1 కిలోమీటర్లు, 3 కారిడార్లు ఉన్నాయి. ఖర్చు 19,579 కోట్లు. మొత్తంగా ఫేజ్ 2లో 162.5 కిలోమీటర్లు ఉంది. ఫేజ్ 2 నిధుల్లో తెలంగాణ ప్రభుత్వం30 శాతం భరించాలి. అంటే 13,187 కోట్లు, అలాగే కేంద్ర ప్రభుత్వం వాటా 18శాతం. అంటే 7,754 కోట్లుగా ఉండబోతోంది. వీటితో పాటు జైకా, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు, NBD నుంచి 21,091 కోట్లు రుణాలుగా సేకరిస్తారు. PPP నుంచి 4 శాతం అంటే 1,816 కోట్లుగా ఉంది. సో పర్ఫెక్ట్ డీపీఆర్. లెక్కలు సరిగా ఉన్నాయి. పట్టణాభివృద్ధి శాఖ చెప్పినట్లుగానే ఇచ్చారు. కావాల్సింది కేంద్ర ప్రభుత్వ ఆమోదమే.

మెట్రో విస్తరణకు ఢిల్లీ, BNG, ముంబై, పుణె, చెన్నై పోటీ

అయితే దేశవ్యాప్తంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, పుణె, చెన్నై వంటి నగరాలు కూడా మెట్రో విస్తరణ కోసం నిధుల కోసం పోటీపడుతున్నాయి. కేంద్రం బడ్జెట్‌ను ఈ నగరాల మధ్య విభజించాల్సి ఉంటుందంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ఇప్పటికే 18,800 కోట్ల ఖర్చుతో నిర్మితమైంది. ఆ లెక్కలకు, ఇప్పటి లెక్కలకు మార్పు సహజమే. తెలంగాణ ఆందోళన ఎందుకంటే.. కేంద్ర కేబినెట్ జూన్ 25న పుణెలో ఫేజ్-1A కింద 12.75 కిలోమీటర్ల పొడవుతో, 13 స్టేషన్లతో నిర్మించే ఎక్స్ టెన్షన్ కు ఆమోదముద్ర వేసింది. అంచనా వ్యయం 3,626 కోట్లుగా ఉంది. ఇందులో సగం నిధులను కేంద్రం అందించబోతోంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పోలిస్తే ఇది చిన్న మొత్తం కావడంతోనే కేంద్రం ఆమోదం తెలిపిందా అన్న చర్చ కూడా ఉంది.

ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా వెళ్లే ఛాన్స్

అటు బెంగళూరు మెట్రో దేశంలో మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా ఉంది. ఆర్థిక రాజధానిగా ముంబైకి కేంద్రం నుంచి ఇంపార్టెన్స్ చాలానే ఉంది. ఇక చెన్నై మెట్రో రెండో దశకు 63,246 కోట్లతో కేంద్రం, రాష్ట్రం, అంతర్జాతీయ నిధులతో వేగంగా అమలవుతోంది. అన్నీ బాగానే ఉన్నాయి. మన దగ్గరికి వచ్చే సరికే సమస్యలా అన్న చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో చేసిన నిర్లక్ష్యమే కారణమన్న వాదనను కూడా కాంగ్రెస్ వినిపిస్తోంది. హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ 2 మొత్తం నిర్మాణం పూర్తయితే మహా అద్భుతమే జరుగుతుంది. ప్రయాణాల్లో వేగం పెరుగుతుంది. సిటీలో జనాలు ఎక్కడైనా నివాసం ఉండొచ్చు. ఎక్కడికైనా తక్కువ ఖర్చుతో వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. జనం జీవితాలనే మార్చేసే ప్రాజెక్టు ఇది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చాలా పట్టుబట్టి డీపీఆర్ ఆమోదానికి ఒత్తిడి చేస్తోంది.

L.B. నగర్-హయాత్ నగర్ 7.1 కి.మీ.

ఫేజ్ 2 Aలో ఇప్పటికే నిర్మితమైన మెట్రోకు మరింత కనెక్టివిటీ పెంచుతారు. అంటే నాగోల్-శంషాబాద్ మధ్య 36.8 కిలోమీటర్లు, 24 స్టేషన్లు వస్తాయి. రాయ్‌దుర్గం-కొకాపేట్ నియోపోలిస్ లో 11.6 కిలోమీటర్లు, 8 స్టేషన్లు వస్తాయి. ఇది ఐటీ ఏరియాలో చాలా కీలకంగా మారే లైన్ ఇది. బ్లూ లైన్‌ను రాయ్‌దుర్గం నుంచి కొకాపేట్ నియోపోలిస్ దాకా పెంచుతుంది. బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజగూడ, నానక్‌రామ్‌గూడ, విప్రో సర్కిల్ వంటి ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవచ్చు.

2028 నాటికి రోజుకు 7.96 లక్షల మంది జర్నీ అంచనా

MGBS-చంద్రాయణగుట్ట 7.5 కిలోమీటర్లు, 6 స్టేషన్లు. అలాగే మియాపూర్-పటాన్‌చెరు: 13.4 కిలోమీటర్లు, 10 స్టేషన్లు వస్తాయి. రెడ్ లైన్‌ను మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు పొడగిస్తారు. ఆల్విన్ X రోడ్, మదినాగూడ, చందానగర్, BHEL, ఇక్రిసాట్ వంటి ప్రాంతాలను కవర్ చేస్తుంది. అటు L.B. నగర్-హయాత్ నగర్ మధ్య 7.1 కిలోమీటర్లు ఉంటుంది. సో మెట్రో ఫేజ్ 2 Aలో మొత్తం 54 స్టేషన్లు ఉండబోతున్నాయ్. 2028 నాటికి రోజుకు 7.96 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా ఉంది.

JBS-మేడ్చల్ 24.5 కి.మీ, 18 స్టేషన్లు

ఫేజ్ 2 బి అనేది హైదరాబాద్ మెట్రో విస్తరణలో రెండో భాగం. ఇది సిటీ ఉత్తరం, అలాగే ఫ్యూచర్ సిటీ ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచుతుంది. 3 కారిడార్లు, 86.1 కిలోమీటర్లతో ఉంటుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్-ఫ్యూచర్ సిటీ 39.6 కిలోమీటర్లు, అలాగే జూబ్లీ బస్ స్టేషన్ -మేడ్చల్ రూట్ లో 24.5 కిలోమీటర్లు, 18 స్టేషన్లు వస్తాయి. పూర్తిగా ఎలివేటెడ్ ఇది. ఈ కారిడార్ లో తాడ్‌బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, కండ్లకోయ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ట్రాఫిక్ తప్పుతుంది.

సిటీ నలువైపులా రియల్ ఎస్టేట్ ఊపందుకునే వీలు

సిటీలో తక్కువ సమయంలో ఎక్కడికైనా వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. మరొకటి జేబీఎస్ నుంచి శామీర్ పేట్ రోడ్డులో 22 కిలోమీటర్లు, 14 స్టేషన్లు వస్తాయి. ఓవరాల్ గా చూస్తే ఫేజ్ 2 మెట్రో పూర్తయితే హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్ 69 కిలోమీటర్ల నుంచి 231 కిలోమీటర్లకు పెరుగుతుంది. హైదరాబాద్ దశ మొత్తం తిరిగిపోతుంది. సిటీలో అన్ని ప్రాంతాలకు డిమాండ్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ మరింతగా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పై చాలా పట్టుదలగా ఉంది.

Related News

Namo bharat Train: అది లోకల్ ట్రైన్ కాదురా అయ్యా, నమో భారత్!

Indian Railways: ఆ టైమ్‌లో టీటీఈ.. ప్రయాణీకులను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, అలా చేస్తే దబిడి దిబిడే!

MMTS Trains: కొత్త రూట్లు, మరిన్ని స్టాప్ లు, MMTS ప్రయాణీకులకు క్రేజీ న్యూస్!

SCR Updates: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖ రైళ్లు తిరిగి అసలు రూట్‌లోకి!

Trains In Telangana: ఆ రైళ్లన్నీ ఇక సికింద్రాబాద్ నుంచే, రైల్వే అధికారుల కీలక ప్రకటన!

Pamban Rail Bridge: అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి పంబన్ బ్రిడ్జి పరిస్థితి ఇది, రైలు సేవలన్నీ బంద్!

Big Stories

×