BigTV English

Train Journey Record: 24 గంటల్లో 5 వేల కిమీలు ప్రయాణం.. అది కూడా రైల్లో, వీడు మామూలోడు కాదు!

Train Journey Record: 24 గంటల్లో 5 వేల కిమీలు ప్రయాణం.. అది కూడా రైల్లో, వీడు మామూలోడు కాదు!

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రైలులో వెళ్లాలంటే సుమారు 1600 కిమీలు ప్రయాణించాలి. ఇందుకు పట్టే సమయం సుమారు 22 నుంచి 24 గంటలు. మరి, అలాంటింది ఆ ప్రయాణికుడు ఏకంగా 5000 వేల కిలోమీటర్ల జర్నీని కేవలం 24 గంటల్లో పూర్తి చేసేశాడు. అది కూడా రైలు మార్గంలో. ఈ జర్నీతో ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకు కూడా ఎక్కేశాడు.


అదెలా సాధ్యం?

5 వేల కిమీల జర్నీని 24 గంటల్లో పూర్తి చేయడం అంటే మాటలు కాదు. పైగా రైలు జర్నీ అంటే అది మరింత కష్టం. అయితే, ఇది జరిగింది చైనాలో. ఆ దేశానికి చెందిన వాంగ్ డాంగ్‌కు రైళ్లు అంటే చాలా పిచ్చి. అందుకే అతడికి ఒక ఆలోచన వచ్చింది. రైళ్ల ప్రియుడిగా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు ఏదైనా కొత్తగా చెయ్యాలని అనుకున్నాడు. ఏ ప్రయాణికుడు చేయలేని ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. కేవలం ఒకే రోజులో (24 గంటల్లో) 5,800 కిమీలు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.


ఆ రికార్డు బ్రేక్ చేసే లక్ష్యంతో ముందడుగు

24 గంటల్లో అత్యధిక దూరం రైల్లో ట్రావెల్ చేసిన రికార్డు 1992లో నమోదైంది. ఓ ప్రయాణికుడు 2,842 కిమీలు ప్రయాణించి ఆ రికార్డు సాధించాడు. ఆ తర్వాత ఆ రికార్డును పలువురు ట్రావెల్ ప్రియులు 8 సార్లు అధిగమించారు. అయితే, వాటిని అధికారికంగా రికార్డు చెయ్యలేదు. అయితే, 2019 నుంచి చైనా రైల్వే ఈ రికార్డులను నమోదు చెయ్యడం మొదలుపెట్టింది. ఆ ఏడాది హాంకాంగ్‌కు చెందిన హువాంగ్ విజీ సోదరులు 24 గంటగల్లో చాంగ్ షా నుంచి హెజౌ వరకు 4,968 కిమీలు ప్రయాణించి రికార్డు నెలకొల్పారు. దాని గురించి తెలిసి వాంగ్ డాంగ్‌కు కూడా ఆ కోరిక కలిగింది. ఆ దూరాన్ని తాను అధిగమనించాలని అనుకున్నాడు. అయితే వెంటనే మొదలు పెట్టలేకపోయాడు. దీంతో 2021లో యాంగ్ యోంగ్‌డాన్ అనే వ్యక్తి 5,413 కిమీలు రైల్లో ప్రయాణించి ఆ రికార్డును బద్దలకొట్టాడు. దీంతో వాంగ్ బ్రేక్ చేయాల్సిన రికార్డు లక్ష్యం పెరిగిపోయింది.

మొదటి ప్రయత్నం విఫలం

పాత రికార్డులను బద్దలకొట్టి.. కొత్త రికార్డును నమోదు చెయ్యడం కోసం 2024లో మొదటిసారి ప్రయత్నించాడు. అయితే, అప్పట్లో రైళ్లు ఆలస్యంగా నడవటం వల్ల 3,700 కిమీలు మాత్రమే ప్రయాణించగలిగాడు. అయితే, తర్వాతి ప్రయత్నం ఏ మాత్రం విఫలం కాకూడదనే లక్ష్యంతో రెండు ట్రైల్స్ వేశాడు. జీపీఎస్‌ను సెట్ చేసుకున్నాడు. నడుస్తూ.. పరిగెడుతూ.. ప్లాట్ పారమ్‌లు మారుతూ రైళ్లు మారేందుకు పట్టే టైమ్‌ను తెలుసుకున్నాడు. దాన్ని ఎంతకు తగ్గించాలో అంచనా వేసుకున్నాడు. అలాగే కనెక్టింగ్ ట్రైన్ టైమింగ్స్ కరెక్టుగా ఉండేలా ప్లాన్ చేశాడు.

మొత్తానికి సాధించాడు

ఫిబ్రవరి 14న, ఉదయం 7:54 గంటలకు హాంగ్ షెన్‌జెన్ నార్త్‌లో రైలు ఎక్కాడు. ఇదంత లైవ్‌లో రికార్డు చేశాడు. ఉరుకులు పరుగులతో రైళ్లు ఎక్కడం.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు తదితర వివరాలను అతడు ఎప్పటికప్పుడు లైవ్‌లో చెప్పాడు. కనీసం నిద్ర కూడా పోకుండా అతడు రైళ్లను మారుతూ 24 గంటల్లో 5,887.76 కిమీల లక్ష్యాన్ని పూర్తి చేశాడు.

Also Read: అలర్ట్.. విశాఖ రూట్‌లో వెళ్లే ఈ రైళ్లు క్యాన్సిల్? టికెట్ బుక్ చేసుకొనే ముందు చెక్ చేసుకోండి

కానీ అంత వేగంగా ఎలా?

24 గంటల్లో 5 కిమీల ప్రయాణం అంటే ఇండియా వంటి దేశాల్లో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే.. ఇక్కడ వందే భారత్ వంటి స్పీడ్ రైళ్లు 130 కిమీల పరిమితి వేగంతో ప్రయాణిస్తాయి. అయితే, చైనాలో కొన్ని రైళ్లు గంటలకు 350 కిమీల వేగంతో ప్రయాణిస్తాయి. అందుకే, హాంగ్ తెలివిగా ఆ రైళ్లనే ఎంచుకున్నాడు. స్లోగా నడిచే లోకల్ రైళ్లను కాకుండా హైస్పీడ్ రైళ్లను ఎంచుకున్నాడు. మొత్తానికి తన ప్రయాణానాన్ని.. సరికొత్త రికార్డు నెలకొల్పాలనే లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇప్పుడు ఈ రికార్డు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమొదైంది.

Related News

Ganga Bridge: ఆసియాలోనే అద్భుతం.. 10 కి.మీ పొడవైన గంగా వంతెన.. ఇది వేరే లెవల్ బాస్!

Trains Cancelled: భారీ వర్షాలు.. పట్టాల మీదికి నీళ్లు, 5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు!

Namo bharat Train: అది లోకల్ ట్రైన్ కాదురా అయ్యా, నమో భారత్!

Indian Railways: ఆ టైమ్‌లో టీటీఈ.. ప్రయాణీకులను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, అలా చేస్తే దబిడి దిబిడే!

MMTS Trains: కొత్త రూట్లు, మరిన్ని స్టాప్ లు, MMTS ప్రయాణీకులకు క్రేజీ న్యూస్!

SCR Updates: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖ రైళ్లు తిరిగి అసలు రూట్‌లోకి!

Big Stories

×