Indian Railways: భారతీయ రైల్వే.. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ద్వారా ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నది. అత్యంత వేగం, అద్భుతమైన సౌకర్యాలతో ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నది. వేగంగా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది వందేభారత్ రైలు ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, వందేభారత్ రైల్లో ప్రయాణించే ప్యాసింజర్లకు నాణ్యమైన ఆహారాన్ని అందిసున్నది IRCTC. ఇప్పటి వరకు టికెట్ బుకింగ్ సమయంలోనే ఫుడ్ ఆర్డర్ చేసే అవకాశం ఉండేది. ఇకపై టికెట్లు బుక్ చేసుకునే సమయంలో భోజనాన్ని ఎంచుకోకపోయినా, ప్రయాణంలోనూ ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. తాజాగా ఈ విషయాన్ని రైల్వే బోర్డు వెల్లడించింది.
వందేభారత్ లో అప్పటికప్పుడు ఫుడ్ ఆర్డర్
తాజాగా వందేభారత్ రైలు ప్రయాణీకులు అప్పటికప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా, అందించాలని భారతీయ రైల్వే బోర్డు ఆదేశించింది. ఈ మేరకు IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కు సర్క్యులర్ పంపించింది. “ప్రయాణీకుల సౌలభ్యాన్ని పెంచడానికి క్యాటరింగ్ సేవలను మరింత విస్తరించండి. బుకింగ్, నాన్-ఆప్టీ ప్రయాణీకులకు సైతం వందే భారత్ రైళ్లలో ఫుడ్ అందించండి. అప్పటికప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకున్న ప్రయాణీకులకు సైతం ఈ అవకాశాన్ని కల్పించండి, రెడీ టు ఈట్ భోజన ఎంపికతో పాటు తాజాగా వండిన భోజనాన్ని కూడా అందించండి” అంటూ IRCTCకి ఆదేశాలు జారీ చేసింది.
ప్రయాణీకులు ఫిర్యాదుతో రైల్వే బోర్డు కీలక నిర్ణయం
కొంత మంది ప్రయాణీకులు టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆర్డర్ ఆప్షన్ ను ముందుగా ఎంచుకోనందున వందేభారత్ రైళ్లలో ప్రయాణీకులకు ఆహారాన్ని అందివ్వలేమని సిబ్బంది వెల్లడించారు. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రయాణీకులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణ సమయంలోనూ ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. “బుకింగ్ సమయంలో చాలా మంది ప్రయాణీకులు ప్రీ-పెయిడ్ ఫుడ్ ఆప్షన్ ను చాలా మంది ఎంచుకోవడం లేదు. కానీ, ప్రయాణ సమయంలో ఫుడ్ కావాలని అడుగుతున్నారు. కానీ, IRCTC సిబ్బంది వారికి ఫుడ్ అందించలేమని చెప్తున్నది. ఈ విషయం రైల్వే బోర్డు దృష్టికి వెళ్లడంతో కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆర్డర్ చేసుకోకపోయినా, ప్రయాణ సమయంలో ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది రైల్వే బోర్డు. ఇకపై ప్రయాణీకులు ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడనుంది” అని రైల్వే అధికారులు తెలిపారు.
రైళ్లలో ప్రయాణీకులకు మంచి నాణ్యతతో కూడిని పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రైల్వేబోర్డు IRCTCకి సూచించింది. “ఇకపై ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. ప్రయాణ సమయంలోనూ ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. రాత్రి 9 గంటల తర్వాత ఈ ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం ఉండదు” అని రైల్వే బోర్డు తెలిపింది.
Read Also: రైళ్లలో టాయిలెట్స్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే.. ఇదీ అసలు కథ!