Team India: ప్రస్తుతం టీం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇప్పటికే మొదటి వంటి మ్యాచ్ గెలిచింది టీమిండియా. మొన్న నాగపూర్ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో… అవలీలగా టీమిండియా విజయం సాధించడం జరిగింది. ఇక రెండవ వన్డే మ్యాచ్ ఆదివారం రోజున అంటే ఫిబ్రవరి 9వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ కటక్ వేదికగా జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే కటక్ చేరుకున్న టీమిండియా క్రికెట్ సభ్యులు… ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.
Also Read: Champions Trophy 2025: పాకిస్థాన్ కొత్త జెర్సీపై ట్రోలింగ్..మున్సిపాలిటీ డ్రెస్ లా ఉందటూ ?
అయితే… కటక్ ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు టీం ఇండియా క్రికెటర్లు… ఒడిస్సా లో ఉన్న దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మ్యాచ్ ప్రాక్టీస్ కంటే ముందు… దైవ దర్శనం చేసుకొని… కటక్ వెళ్లారు. టీమిండియా జట్టుకు సంబంధించిన ముగ్గురు ప్లేయర్లు తాజాగా పూరీలోని జగన్నాథ టెంపుల్ లో ( JAGANNATH TEMPLE IN PURI ) కనిపించారు. టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి ఈ ముగ్గురు స్పిన్నర్లు… పూరి లోని జగన్నాథ టెంపుల్ లో దర్శనం ఇచ్చారు.
ఈ సందర్భంగా దర్శనం చేసుకొని… తమ మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ఈ దేవాలయానికి వెళ్లే కంటే ముందు ఆటోలో ప్రయాణించారు టీమిండియా క్రికెటర్లు. ఇక పూరి జగన్నాథ్ టెంపుల్ కు టీమిండియా యంగ్ క్రికెటర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి ముగ్గురు రావడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి ముగ్గురికి ఎలాంటి ఇబ్బంది లేకుండా… పోలీసులు దగ్గరుండి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా టీమిండియా ప్లేయర్లు ముగ్గురు రావడంతో ఆలయ సిబ్బందికి వారికి ఘన స్వాగతం పలికింది.
అనంతరం తీర్థం, ప్రసాదం ఇచ్చారు. అర్చన చేయించుకున్న అనంతరం.. కటక్ వెళ్లిపోయారు. ఇక పూరి జగన్నాథ టెంపుల్ లో టీమిండియా ప్లేయర్లు ముగ్గురు రావడంతో దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా.. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు రెండో వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో కూడా టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్సు ఉంది. ఇక రేపటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడు. దీంతో.. యశస్వీ జైస్వాల్ తప్పుకునే ఛాన్స్ ఉంది. అటు.. శుభ్ మన్ గిల్ ఓపెనర్ గా బ్యాటింగ్ చేయనున్నాడు.
ఇరు జట్ల అంచనా
భారత XI: రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ.
ఇంగ్లాండ్ XI: ఫిల్ సాల్ట్ (వారం), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (సి), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
Also Read: Team India: కుంభమేళాలో అఘోరల క్రికెట్.. రోహిత్, కోహ్లీల మధ్య చిచ్చు ?