Divya PIllai: హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించిన మంగళవారం సినిమా గుర్తుందా.. ? ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ అయినా కూడా.. పేరు మాత్రం ఒక నటి కొట్టేసింది. ఆమె దివ్య పిళ్లై. అదేనండీ .. జమీందార్ భార్య రాజేశ్వరి దేవి.
సినిమా మొదటి నుంచి చూసినప్పుడు జనాలు.. ఆహా.. ఎంత మంచి మనిషి. మాక్కూడా ఇలాంటి భార్యనే రావాలి అనుకున్నారు. కానీ, క్లైమాక్స్ కి వచ్చేసరికి.. దేవి విశ్వరూపం చూసి జడుసుకున్నారు. అంతలా ఆమె విలనిజానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
Ram Gopal Varma: నా ఉద్యోగం కూడా తీసేసుకున్నాడు.. నేనేం చేయాలి.. స్టార్ హీరోపై వర్మ పోస్ట్ వైరల్
ఇక ఆ సినిమా దివ్య కెరీర్ ను మార్చేసింది. ఈ సినిమా తరువాత సినిమాలను ఏరికోరి ఎంచుకుంటున్న ఈ చిన్నది ఇప్పుడు తండేల్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
ఇప్పటికే తండేల్ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. సినిమాలోని నటీనటులను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.
తాజాగా నేడు దివ్య పుట్టినరోజు కావడంతో .. ఆమె పోస్టర్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు. తండేల్ చిత్రంలో దివ్య.. చంద్ర అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. పోస్టర్ చూస్తుంటే దివ్య పాజిటివ్ పాత్రలోనే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. సింపుల్ గా చీర కట్టుకొని.. నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
Miss You Trailer: పెళ్లి తరువాత లవ్ స్టోరీతో వస్తున్న సిద్దు.. ట్రైలర్ అదిరిపోయిందిగా
చైకు ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాపై అటు మేకర్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా చాలా అంచనాలను పెట్టుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దివ్యకు ఈ సినిమా ఒక మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ఇది కనుక హిట్ అయితే.. అమ్మడి రేంజ్ మారుతుందనే చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.