BigTV English

Chenab Railway Bridge: గుండె ఉక్కిరి బిక్కిరి చేసే రైలు రైడ్.. ఎక్కడో కాదు.. మన దేశంలోనే!

Chenab Railway Bridge: గుండె ఉక్కిరి బిక్కిరి చేసే రైలు రైడ్.. ఎక్కడో కాదు.. మన దేశంలోనే!

Chenab Railway Bridge: రైలు ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే లైఫ్ లో ఒక్కసారైనా ఈ రైలు ప్రయాణం సాగించాలనే లక్ష్యం అందరికీ ఉంటుంది. అందుకు తగ్గ రైలు ప్రయాణం ఎక్కడో కాదు మన దేశంలోనే ఉంది. మన లైఫ్ లో ఒక్కసారైనా ఈ ప్రయాణం సాగించాల్సిందే. లేకుంటే మనం చాలా మిస్ అవుతామని చెప్పవచ్చు.


ఆ ఫీలింగ్ ఇక్కడే..
మన దేశంలో ఎన్నో రైలు వంతెనలు ఉన్నా.. ఈ ఒక్క వంతెన మాత్రం చూసిన ప్రతి ఒక్కరికీ ఇందులో ప్రయాణించాలనే తపన కలిగిస్తోంది. అది ఉత్తర భారతదేశంలోని చెనాబ్ రైల్వే వంతెన. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా చరిత్రలో నిలిచిపోయింది. ఓ సాధారణ వంతెన కాదిది, గగనతలాన్ని తాకే విధంగా, లోయల నడుమ పలికే ఇంజినీరింగ్ అద్భుతం. ఎత్తుల మీద నడిచే రైలు చూశారా? చెనాబ్ బ్రిడ్జ్‌ చూసిన తరువాత తప్ప మరెక్కడా ఆ ఫీలింగ్ రావదు.

ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో..
జమ్మూ కాశ్మీర్‌లోని రీయాసీ జిల్లాలో చెనాబ్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జ్‌కి మొత్తం ఎత్తు 359 మీటర్లు (1,178 అడుగులు). దీన్ని ఫ్రాన్స్‌లోని ఎఫిల్ టవర్‌తో పోలిస్తే, ఇది దానికంటే 35 మీటర్లు ఎక్కువ. అంటే, మీరు ఈ వంతెనపై ప్రయాణిస్తున్నపుడు, మీరు ఈఫిల్ టవర్ కంటే పైకి ఉన్నట్టే! ఇది భారతదేశానికి మాత్రమే కాక, ప్రపంచ ఇంజినీరింగ్ రంగానికే గర్వకారణం.


ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమైనప్పటినుండి ఎంతోకాలం పట్టింది. భౌగోళికంగా ప్రమాదకరమైన ప్రాంతం కావడంతో, దుర్గమయమైన గిరిగాబళ్ల మధ్య, అతి ఎత్తైన లోయల పైన ఈ వంతెన నిర్మించడం సాహసమే. గట్టి గాలులు, ఎత్తైన లోయలు, వరుసగా సంభవించే భూకంపాలు, ఇవన్నీ ఇంజినీర్లను ఎన్నో సవాళ్లను ఎదుర్కొనేలా చేశాయి. కానీ మేధో ప్రతిభతో, సాంకేతిక పరిజ్ఞానంతో, ఆర్కిటెక్చరల్ శిల్పంతో భారత ఇంజినీర్లు చెనాబ్ వంతెనను విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ వంతెన నిర్మాణంలో ప్రత్యేకమైన స్టీల్ పదార్థాలు వాడారు. భూకంప నిరోధకంగా ఉండేలా, అలాగే హిమపాతం, వర్షాల మధ్య కూడా తడపకుండా నిలబడేలా దీనిని తీర్చిదిద్దారు. దీనిలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యేకమైన మోనిటరింగ్ సిస్టమ్‌తో ప్రతి కంపనాన్ని రికార్డ్ చేసి, ముందస్తు అప్రమత్తతకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

దీని స్పెషాలిటీ ఇదే..
అసలు ఈ వంతెన ఎందుకంత ప్రాధాన్యమైనది? ఇది కేవలం పర్యాటక ఆకర్షణ కాదు. కాశ్మీర్ ప్రాంతానికి రైలు ద్వారా నేరుగా కనెక్టివిటీ కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు సుళ్లగా, సురక్షితంగా రైలు ప్రయాణం చేసే అవకాశాన్ని ఇది కల్పిస్తోంది. సైనిక రవాణా, సరుకు రవాణా, ప్రజల నిత్య ప్రయాణం.. అన్నింటికీ ఈ వంతెన కీలకంగా మారనుంది.

Also Read: Vande Bharat Attack: వందే భారత్ రైలుపై దాడి.. ఢమాల్ అంటూ శబ్దం.. ఎంతకు తెగించారు!

ఇక్కడి అందాలు అదరహో..
ఇక చెనాబ్ వంతెనను చూడడానికి పర్యాటకులు భారీగా వస్తున్నారు. కొండల మధ్య నుంచి పొడవుగా వెళ్లే ఈ బ్రిడ్జ్‌పై రైలు ప్రయాణించడం ఓ లైఫ్‌టైం ఎక్స్‌పీరియెన్స్. గాలి వానల మధ్యలో, మేఘాల తాకిడిలో రైలు దూసుకెళ్తుంటే, అది స్వర్గానికి ప్రయాణించిన ఫీలింగ్ కలిగిస్తుంది అంటున్నారు ప్రయాణికులు. ఇది చూడటానికి మాత్రమే కాదు, మన దేశ శక్తి సామర్థ్యానికి చిహ్నంగా నిలుస్తోంది.

ఇప్పుడు ఈ వంతెన పూర్తిగా తయారవ్వడంతో త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. రైల్వే శాఖ ఈ బ్రిడ్జిని ప్రధాని మోడీ చేతుల మీదుగా శుక్రవారం పూర్తి ప్రయాణాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది.  ప్పటివరకు పర్యాటకుల్ని మాత్రం ఇది ఆకర్షిస్తోంది. హెలికాప్టర్ టూర్స్‌, డ్రోన్ షూటింగ్‌ల కోసం అనుమతులు ఇవ్వబడుతున్నాయి. ఫోటోగ్రాఫర్లు, వ్లాగర్లు, డాక్యుమెంటరీ మేకర్లు ఇప్పటికే ఈ బ్రిడ్జ్‌ను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు.

ఈ వంతెనపై రైలు ఎక్కి ప్రయాణిస్తే మీ గుండె ముడుచుకుపోవచ్చు.. కానీ కళ్లు మాత్రం ఆనందంతో నిండిపోతాయి. ఇది సాధారణ ప్రయాణం కాదు జీవితానుభూతి. మన దేశంలో ఇలాంటి అద్భుతం ఉందంటే.. ఒకసారి చూడక తప్పదు. లైఫ్‌లో ఒక్కసారైనా చెనాబ్ బ్రిడ్జ్‌పై రైలు ప్రయాణం చేయాల్సిందే. దేశ అభివృద్ధి, ఇంజినీరింగ్ ప్రతిభకి ఈ బ్రిడ్జ్ నిలువెత్తిన గుర్తు. మరి మీరు సిద్ధమేనా? చెనాబ్ బ్రిడ్జ్ రైడ్‌కి? రెడీ కండి!

Related News

Air India Express: స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్.. ప్రయాణికులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపరాఫర్

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Big Stories

×