E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ రెడీ.. చెన్నై స్టార్టప్ సంచలనం!

ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ రెడీ.. చెన్నై స్టార్టప్ సంచలనం!
Advertisement

India’s Electric Air Taxi Takes Flight: భవిష్యత్ రవాణా వ్యవస్థలో మరో కీలక ముందడుగు పడింది. చెన్నైకి చెందిన డీప్ టెక్ స్టార్టప్ ‘ద ఇప్లేన్ కంపెనీ’ తన పూర్తి స్థాయి విద్యుత్తుతో నడిచే ఎయిర్ టాక్సీ ‘ఇ200ఎక్స్’ అసెంబ్లీని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు సిటీ మొబిలిటీని పూర్తిగా మార్చే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. ఇ200ఎక్స్ విమానాన్ని రూపొందించే సమయంలో ఇందులోని ప్రధాన వ్యవస్థలను ఒకే నిర్మాణంలో సమన్వయం చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫ్లైట్ మరింత సమర్థవంతంగా పనిచేయడంతో పాటు చక్కటి భద్రతా ప్రమాణాలు కూడా కలిగి ఉంటుంది.

గ్రౌండ్ టెస్టింగ్ దశలోకి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ

తాజాగా అసెంబ్లీ పూర్తైన ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ కీలకమైన గ్రౌండ్ టెస్టింగ్ దశలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ పరీక్షల్లో ఫ్లైట్ నిర్మాణం, ఆన్‌ బోర్డ్ వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని నిపుణులు పరిశీలించనున్నారు. అలాగే ఏరోడైనమిక్ సామర్థ్యం, మెకానికల్ లోడ్లను తట్టుకునే శక్తి, ఇతర టెక్నికల్ అంశాలను కూడా టెస్ట్ చేయనున్నారు. ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాత భారత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి టైప్ సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫ్లైట్ ను కమర్షియల్ సర్వీసులలోకి తీసుకురానుంది.

తొలుత పీటీ-01 ప్రోటో టైప్‌ అభివృద్ధి

Advertisement

ఈ ప్రాజెక్టులో తొలుత పీటీ-01 అనే ప్రోటోటైప్‌ ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇ200ఎక్స్‌ ను డిజైన్, సిమ్యులేషన్ దశ నుంచి ఫిజికల్ దశకు తీసుకువచ్చారు. ఇది ప్రాజెక్టు అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని మూడు ప్రధాన విభాగాల అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. మొదటిది ప్రయాణికుల రవాణా. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే నగరాల్లో ప్రజలు వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ విమానం ఉపయోగపడనుంది. రెండోది సరకు రవాణా. నగరాల్లో అత్యవసరంగా సరుకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు దీనిని ఉపయోగించవచ్చు. మూడోది ఎయిర్ అంబులెన్స్ సేవలు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో రోగులను త్వరగా ఆసుపత్రులకు తరలించడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. మొదటగా వాణిజ్య సరకు రవాణా సేవలను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. సర్టిఫికేషన్ పూర్తికాగానే ప్రయాణికుల రవాణా, వైద్య సేవల రంగాల్లోకి అడుగుపెట్టనుంది.

సుమారు రూ. 200 కోట్ల ప్రాజెక్టు

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 21 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.200 కోట్లకు సమానం. భవిష్యత్తులో పట్టణ రవాణా రంగంలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలకు మంచి అవకాశాలు ఉన్నాయని, ఈ సాంకేతికత దేశంలో కొత్త మార్పులకు నాంది పలుకుతుందని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Read Also: నీటితో నడిచే రైలు.. సేవలకు సిద్ధం, ఇక డీజీల్ రైళ్లకు గుడ్ బై!

Related News

ప్రయాణికుడికి ఇచ్చిన బిర్యానీలో ఈగ.. రైల్వే క్యాటరింగ్ సంస్థకు షాక్!

IRCTC సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా.. రైల్వే శాఖ ఆమోదం!

భోగాపురం విమానశ్రయం.. ఇది చాలా కాస్ట్‌లీ గురూ.. ప్రయాణికులకు చుక్కలే!

ఏ నేరం చేయకుండానే జైలుకు వెళ్లొచ్చు.. చంచల్‌గూడ జైలులో చిప్పకూడు తినే ఛాన్స్!

బుల్లెట్ రైళ్లు సాధారణ పట్టాలపై వెళ్లలేవా? ప్రత్యేక ట్రాక్‌లు ఎందుకు నిర్మిస్తారు?

అలా జరిగితే.. వందే భారత్‌ రైలులో ఫుడ్ ఫ్రీ, రైల్వే కీలక నిర్ణయం!

జపాన్ టూర్‌కు IRCTC స్పెషల్ ప్యాకేజీ.. బుల్లెట్ రైలు ప్రయాణంతో 10 రోజుల టూర్!

Big Stories

×