E-Paper
Advertisement

మేం కోరేది ఒక్కటే.. ఆ ఆదేశాలు ఎవరిచ్చారు?- ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్లమెంట్ ఆవరణలో నిరసనలు

మేం కోరేది ఒక్కటే..  ఆ  ఆదేశాలు ఎవరిచ్చారు?- ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్లమెంట్ ఆవరణలో నిరసనలు
Advertisement

Delhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. కేవలం మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి వున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అమిత్ షా హౌస్‌లోకి ఎందుకు రావలేదని ప్రశ్నించారు.

 

పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసనలు

Advertisement

విపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం తనకు కావాల్సిన బిల్లులను పాస్ చేయించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. లోక్‌సభకు వచ్చి విద్యార్థులపై జరిగిన లాఠీ‌ఛార్జ్‌‌పై అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

 

లోక్‌సభకు అమిత్ షా రావాలంటూ నిరసనలు

Advertisement

అసలు విద్యార్థులపై పెల్లెట్ గన్స్ పేల్చమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో ఆయన సమాధానం చెప్పాల్సిందేనని కుండబద్దలు కొట్టేశారు. కేంద్రం బిల్లులపై పార్లమెంట్‌లో చర్చ పెడితే వాటి ఆమోదానికి సంబంధించి ప్రతిపక్షాలుగా నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యబద్దంగా పార్లమెంట్‌ను నడపాలన్నారు.

 

నాలుగు రోజులు మాత్రమే పార్లమెంటు సమావేశాలు

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల లాఠీ‌చార్జ్ అంశంపై సోమవారం పార్లమెంటు ప్రారంభానికి ముందు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఎంపీలు నిరసన తెలిపారు. పార్లమెంటు ఆవరణంలో అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభకు వచ్చి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా సభకు హాజరు కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యులు రకరకాల ప్లకార్డులు ప్రదర్శించారు.

 

Related News

మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

హైడ్రా ప్రజావాణికి వెల్లువలా ఫిర్యాదులు.. ఒక్కరోజే ఇన్ని ఫిర్యాదులా..?

గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!

ఐటీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో 1000 మందికి ఉద్యోగాలు!

బహదూర్‌పల్లి బాధితులకు కేటీఆర్ భరోసా.. ప్రభుత్వంపై కీలక డిమాండ్స్!

స్థానిక ఎన్నికలే టార్గెట్.. కవిత తన మార్క్ స్కెచ్.. పార్టీ నేతలతో వరుస భేటీలు!

భార్య పేరుతో భర్త పెత్తనం.. నిజామాబాద్ జిల్లాలో అధికార దుర్వినియోగం!

Big Stories

Advertisement
×