E-Paper
Advertisement

సుకుమార్, బన్నీ వాస్ ‘ఈడుపు కాగితం’ ఫస్ట్ లుక్‌ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్!

సుకుమార్, బన్నీ వాస్ ‘ఈడుపు కాగితం’ ఫస్ట్ లుక్‌ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్!
Advertisement

Idupu Kayitham: వైవిధ్యమైన కథలను, వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రోత్సహించడంలో టాలీవుడ్‌లో సుకుమార్ రైటింగ్స్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా సుకుమార్ రైటింగ్స్, ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ నిర్మాణంలో సరికొత్త చిత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘ఈడుపు కాగితం’ (Idupu Kayitham) అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

Read also-Nalgonda: నల్గొండ నాలుగు హత్యల కేసు మిస్టరీ.. ఇంటి వ్యక్తుల పనే, హత్యల వెనుక కూతురు-అల్లుడు

Advertisement

ఈ సినిమా పూజా కార్యక్రమానికి టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో భారీ క్రేజ్ ఉన్న స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూజా వేడుకలో పాల్గొన్న ఆయన, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఈడుపు కాగితం’ అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. లోకేష్ కనగరాజ్ చేతుల మీదుగా ఈ పోస్టర్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

పల్లెటూరి స్వచ్ఛత..

విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇదొక స్వచ్ఛమైన రూరల్ బ్యాక్‌డ్రాప్ ఎమోషనల్ అండ్ రియలిస్టిక్ డ్రామా అని స్పష్టమవుతోంది. పోస్టర్‌లో ఒక కొత్త జంట బైక్‌పై ప్రయాణిస్తూ కనిపిస్తోంది. సాంప్రదాయ కట్టుబొట్టుతో, తలలో పూలు పెట్టుకున్న ఒక పల్లెటూరి యువతి, తన భర్తను హత్తుకుని నగరానికి వలస వెళ్తున్నట్లుగా ఈ పోస్టర్‌ను ఎంతో సహజంగా డిజైన్ చేశారు.

Advertisement

Read also-రాజమౌళి ‘వారణాసి’ సెట్స్‌లో షాకింగ్ విషయాలు బయటపెట్టిన పృథ్వీరాజ్!

క్రేజీ టెక్నికల్ టీమ్

ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడీలకు, ఎమోషనల్ ట్యూన్స్‌కు పేరుగాంచిన సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఎంఎన్ బాల్‌రెడ్డి, ఆశిష్ తేజ, శ్రీధర్ సోంపల్లి, శిల్ప, అశ్వంత్ బైరి తదితర సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులయ్యారు. ప్రస్తుతానికి ఈ సినిమాలో నటిస్తున్న హీరో, హీరోయిన్ల వివరాలను మేకర్స్ అధికారికంగా సస్పెన్స్‌లో పెట్టారు. సుకుమార్ మార్క్ కథనం, బన్నీ వాస్ నిర్మాణ విలువలు, దానికి తోడు లోకేష్ కనగరాజ్ వంటి స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం కావడం సినిమాకు భారీ హైప్‌ని తీసుకువచ్చింది.

Related News

మల్టీస్టారర్ కు వెంకీ మామ సిద్ధం.. డైరెక్టర్ ప్లానింగ్ ఇదా..?

యంగ్ హీరోతో నాగదుర్గ ప్రత్యేక పూజలు.. ప్రేమలో పడ్డారా?

“ఆయన నక్క.. నేను కుక్కను” నసీర్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు

డ్రామాలొద్దంటున్న త్రిష.. ఎవరిని ఉద్దేశించిందో తెలుసా?

50కి దగ్గరైనా తగ్గేదేలే.. సురేఖ వాణి జిమ్ వీడియో వైరల్!

మళ్లీ నోరుజారిన చిరు.. ‘మెగా 158’ టైటిల్ లీక్ చేసి.. ఇదే ఆ టైటిల్

రాముడిగా మహేష్ బాబు.. ఫ్యాన్సుకు పూనకాలు తెప్పిస్తున్న వీడియో, ఏం ఉంది భయ్యా!

పరిగెడుతూ ముక్కుపుడక మింగేసిన హీరోయిన్..వైరల్ వీడియో !

Big Stories

Advertisement
×