E-Paper
Advertisement

ఈ లోకో పైలెట్ ఎర్రబస్సు డ్రైవర్ లా ఉన్నాడే.. చెయ్యొత్తగానే రైలు ఆపాడు!

ఈ లోకో పైలెట్ ఎర్రబస్సు డ్రైవర్ లా ఉన్నాడే.. చెయ్యొత్తగానే రైలు ఆపాడు!
Advertisement

Loco Pilot Stops Train After People Wave Hands: రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పరుగులు పెట్టడం తరచూ చూస్తుంటాం. కానీ, రైల్వే గేట్ దగ్గర నిలబడి చెయ్యెత్తగానే రైలు ఆగిపోవడం ఎప్పుడైనా చూశారా? అచ్చం ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బీహార్‌ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

పశ్చిమ్ చంపారన్ జిల్లాలోని కుమార్‌బాగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆగస్టు 8, 2026న సాయంత్రం 4 గంటల సమయంలో ముజఫర్‌పూర్-నార్కటియాగంజ్ డెము రైలు అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. రైల్వే గేట్ దగ్గర ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు నిలబడి ఉన్నారు. రైలు వస్తున్న సమయంలో వారిలో కొందరు చేతులు ఊపుతూ లోకో పైలెట్‌కు సిగ్నల్ ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో రైలు నెమ్మదించి అక్కడే ఆగిపోయింది. రైలు ఆగిన తర్వాత ప్రయాణికులు సామానుతో కలిసి లోపలికి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా బయటకు రాలేదు.

Advertisement

సోషల్ మీడియాలో వీడియో వైరల్

అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సరదాగా కామెంట్లు చేస్తూ.. “ఇది రైలా? ఆర్టీసీ బస్సా?” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా చేతులు ఊపగానే రైలు ఆపడంతో, “ఎర్ర బస్సు డ్రైవర్‌లా ఉన్నాడే.. చెయ్యెత్తగానే రైలు ఆపేశాడు” అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ ఘటనపై సీరియస్‌గా స్పందిస్తున్నారు. రైల్వే నిబంధనలకు అనుగుణంగా కాకుండా రైలును మధ్యలో ఆపి ఉంటే, సంబంధిత లోకో పైలెట్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రైలును ఎక్కడ, ఎప్పుడు ఆపాలి అనే విషయంలో రైల్వేలో స్పష్టమైన భద్రతా నిబంధనలు ఉంటాయని, వాటిని ఉల్లంఘించడం ప్రయాణికుల భద్రతకు సమస్యగా మారవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ఆధారంగానే లోకో పైలెట్ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పలేం. రైలు ఎందుకు ఆపారు?  అక్కడ ఏదైనా అత్యవసర పరిస్థితి ఉందా? ఆ వ్యక్తులకు ముందుగా అనుమతి ఉందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంకా స్పందించని రైల్వే

Advertisement

ఈ ఘటనపై రైల్వే శాఖ నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. వీడియోలో కనిపించిన సంఘటనపై అధికారులు విచారణ చేపట్టారా? లోకో పైలెట్‌కు ఏదైనా పరిచయం ఉన్న వ్యక్తుల కోసమే రైలు ఆపారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలు కూడా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. కొందరు దీన్ని సరదా ఘటనగా చూస్తుండగా, మరికొందరు రైల్వే భద్రతా నిబంధనలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రైల్వే అధికారులు స్పందించిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన అసలు కారణం ఏమిటనేది తెలిసే అవకాశం ఉంది.

Read Also: చివరి నిమిషంలో టికెట్ కావాలా? సింపుల్ గా ఇలా ట్రై చేస్తే కన్ఫార్మ్ సీటు పక్కా!

Tags

Related News

మెుబైల్ నెంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. సెప్టెంబర్ 25 డెడ్ లైన్.. ఈ ప్రచారంలో వాస్తవమెంత!

జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

Big Stories

Advertisement
×