E-Paper
Advertisement

చివరి నిమిషంలో టికెట్ కావాలా? సింపుల్ గా ఇలా ట్రై చేస్తే కన్ఫార్మ్ సీటు పక్కా!

చివరి నిమిషంలో టికెట్ కావాలా? సింపుల్ గా ఇలా ట్రై చేస్తే కన్ఫార్మ్ సీటు పక్కా!
Advertisement

IRCTC Train Ticket Booking: చివరి నిమిషంలో రైలు టికెట్ కోసం ప్రయత్నించే వారికి తత్కాల్ బుకింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే తత్కాల్‌లో కూడా టికెట్ దొరకకపోతే చాలామంది తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. కానీ,  తత్కాల్ టికెట్ రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా కొన్ని సీట్లు ఖాళీగా ఉంటే వాటిని బుక్ చేసుకునే అవకాశం ఇండియన్ రైల్వే కల్పిస్తోంది. ముఖ్యంగా చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వచ్చిన వారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.

కరెంట్ బుకింగ్ అంటే ఏంటి?

సాధారణ రిజర్వేషన్ పూర్తయిన తర్వాత రైలు బయలుదేరే ముందు రిజర్వేషన్ చార్ట్ తయారు చేస్తారు. చార్ట్ సిద్ధమైన సమయంలో కొన్ని సీట్లు బుక్ కాకుండా ఖాళీగా మిగిలిపోవచ్చు. అలాంటి సీట్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడాన్నే కరెంట్ బుకింగ్ అంటారు. సాధారణంగా మొదటి రిజర్వేషన్ చార్ట్ రైలు బయలుదేరే సమయానికి కొన్ని గంటల ముందు సిద్ధమవుతుంది. ఆ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను ప్రయాణికులు ఆన్‌ లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. బుకింగ్ ముగిసే సమయం మాత్రం రైలు, మార్గం, రైల్వే నియమాలను బట్టి మారవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కరెంట్ బుకింగ్‌లో లభించే టికెట్లు వెయిటింగ్ లిస్ట్, RAC టికెట్లు కావు. అందుబాటులో ఉన్న సీటును బుక్ చేసుకుంటే సాధారణంగా కన్ఫర్మ్‌ డ్ టికెట్‌  లభిస్తుంది.

తత్కాల్ ఛార్జీలు ఉండవు

Advertisement

కరెంట్ బుకింగ్‌ లో మరో ప్రయోజనం తత్కాల్ టికెట్‌లా అదనపు తత్కాల్, ప్రీమియం తత్కాల్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకపోవడం. ప్రయాణికులు వర్తించే సాధారణ రిజర్వేషన్ ఛార్జీలను చెల్లించి టికెట్ బుక్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఆక్యుపై చేయడానికి రైల్వే ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందించే అవకాశం ఉంటుంది. కొన్ని రైళ్లలో సీట్లపై 10 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గింపు లభించవచ్చని సమాచారం.

అయితే, కరెంట్ బుకింగ్‌లో టికెట్ తీసుకునే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి టికెట్లకు సాధారణంగా రద్దు చేసినప్పుడు రీఫండ్ అనేది ఉండదు. అందువల్ల ప్రయాణం ఖరారైన తర్వాతే టికెట్ బుక్ చేసుకోవడం మంచిది.

ఖాళీ సీట్లు ఎలా చూడాలి?

Advertisement

ఖాళీ సీట్లను తెలుసుకోవడానికి ప్రయాణికులు IRCTC వెబ్‌ సైట్, యాప్‌ను ఉపయోగించవచ్చు. అందులో ‘Train’ విభాగంలోకి వెళ్లి ‘Charts/Vacancy’ ఆప్షన్‌ ను ఎంచుకోవాలి. అనంతరం రైలు నంబర్, ప్రయాణ తేదీ వంటి వివరాలను ఎంటర్ చేస్తే అందుబాటులో ఉన్న కోచ్‌లు, ఖాళీ సీట్ల వివరాలను చూడవచ్చు. మీకు అనుకూలమైన సీటు కనిపిస్తే, అందుబాటులో ఉన్న బుకింగ్ ఆప్షన్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు. కరెంట్ బుకింగ్ సదుపాయం ముఖ్యంగా చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వచ్చిన వారికి ఉపయోగపడుతుంది.

Read Also: జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ కోచ్‌లోకి వెళ్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే!

Tags

Related News

జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

హోటల్ గదిలో చెక్ ఇన్ చేశాక ఈ 5 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి.. లేకపోతే ప్రమాదకరం

Big Stories

Advertisement
×