Indian Railways: భారతీయ రైల్వేలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరంగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. ప్రయాణ సమయంలో చాలా మంది తమ వస్తువులను మర్చిపోతుంటారు. గతంలో రైల్లో మర్చిపోయిన వస్తువులను ఎవరో ఒకరు పట్టుకెళ్లే వాళ్లు. కానీ, ఇప్పుడు ప్రయాణీకులు మర్చిపోయిన వస్తువులను రైల్వే సిబ్బంది భద్రపరుస్తున్నారు. తమ వస్తువులకు సంబంధించిన ఆధారాలను చూపించి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నారు.
రైల్లో ల్యాప్ టాప్ మర్చిపోయిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాజీ జీఎం
మార్చి 6న కపుర్తల లోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ మాజీ GM ఎస్ శ్రీనివాస్ చెన్నై నుంచి విజయవాడకు వందేభారత్ రైల్లో ప్రయాణించారు. ప్రయాణ సమయంలో కాసేపు ఆయన తన ల్యాప్ టాప్ తో వర్క్ చేసుకున్నారు. ఆ తర్వాత పక్కన మడిచి బ్యాగ్ లో పెట్టాడు. కానీ, ఆయన దిగిపోయే సమయంలో ల్యాప్ టాప్ రైల్లోనే మర్చిపోయారు. చాలా సేపటికి తన ల్యాప్ టాప్ ను రైళ్లు మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
విజయవాడ రైల్వే పోలీసులకు ల్యాప్ టాప్ అందజేసిన టీటీఈ
ఇక వందేభారత్ రైలు టీటీఈ ఈ ల్యాప్ టాప్ ను గుర్తించారు. వెంటనే ఈ గాడ్జెట్ ను విజయవాడ రైల్వే పోలీసులకు అప్పగించాడు. అయితే, విజయవాడ పోలీసులు ఈ ల్యాప్ టాప్ ఎవరిది? అని ఆరా తీశారు. రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా సదరు ప్రయాణీకుడికి గుర్తించారు. ఆయనను కపుర్తల రైల్ కోచ్ ఫ్యాక్టర్ మాజీ GM శ్రీనివాస్ గా గుర్తించారు. కాసేపటి తర్వాత ఆయనే స్వయంగా రైల్వే అధికారులకు తన ల్యాప్ టాప్ మర్చిపోయిన విషయాన్ని చెప్పడంతో ఆయనకు ఆ ల్యాప్ టాప్ ను అందజేశారు.
రైల్వే సిబ్బందిపై GM శ్రీనివాస్ ప్రశంసలు
ఇక తన తన ల్యాప్ టాప్ ను గంటల వ్యవధిలో అందించడం పట్ల శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే GMకి రాసిన లేఖలో రైల్వే సిబ్బందిపై ఆయన ప్రశంసలు కురిపించారు. చెన్నై, విజయవాడ డివిజన్ లకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, కమర్షియల్ సిబ్బందిని పేరు పేరున అభినందించారు. రైల్వే సిబ్బంది పనితీరు కారణంగా ఎంతో మంది పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతున్నట్లు చెప్పారు. పోయిందనుకున్న ల్యాప్ టాప్ ను తన దగ్గరికి చేర్చడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Read Also: ఇక ఆ రైళ్లన్నీ చర్లపల్లి నుంచే, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, కారణం ఏంటంటే?
గత రెండేళ్లుగా కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, డబ్బులను ప్రయాణీకులకు అందజేశారు రైల్వే సిబ్బంది. ఇందుకోసం పలు రైల్వే స్టేషన్లలో దొరికిన వస్తువులను భద్రపరిచే గదులను ఏర్పాటు చేశారు. వస్తువులను పోగొట్టుకున్న ప్రయాణీకులు తగిన ఆధారాలను చూపించి తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
Read Also: హోలీ వేళ ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు!