Ragini Dwivedi: హీరో, హీరోయిన్లు ఏదైనా పబ్లిక్ ప్లేస్‌కు వచ్చినప్పుడు వారితో మాట్లాడడానికి, ఫోటోలు దిగడానికి ఫ్యాన్స్ అంతా వారి చుట్టుముడతారు. అది సహజమే. కానీ అలాంటి సమయంలోనే కొందరు ఆకతాయిలు హీరోయిన్స్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడానికి ట్రై చేస్తారు. ఇలాంటి చేదు అనుభవాలు ఇండస్ట్రీలోని ప్రతీ నటికి ఎదురయ్యే ఉంటాయి. చుట్టూ బౌన్సర్లు ఉన్నా వారిని దాటుకుంటూ వచ్చి సెల్ఫీల పేరుతో అసభ్యకరంటా టచ్ చేయడానికి ట్రై చేస్తుంటారు అభిమానులు. కొందరు నటీమణులు ఈ విషయంపై స్పందించకుండా సైలెంట్‌గా వెళ్లిపోతే మరికొందరు మాత్రం ఆ ఆకతాయిలకు బుద్ధి చెప్పాలని అనుకుంటారు. తాజాగా ఒక నటి అదే పనిచేసింది.
చేయి పట్టుకొని
బెంగుళూరులో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌కు రాగిణి ద్వివేది అనే నటి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యింది. తనను చూడగానే ఫ్యాన్స్ అంతా సెల్ఫీల కోసం తనను చుట్టుముట్టారు. అదే సమయంలో ఒక వ్యక్తి తన చేయిను గట్టిగా పట్టుకొని లాగాడు. అది నచ్చని రాగిణి వెంటనే అతడి చెంప చెల్లుమనిపించింది. అలా ప్రవర్తించడం తనకు నచ్చలేదని, అందుకే కొట్టానని రాగిణి స్టేట్‌మెంట్ ఇచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన అమ్మాయి అయిన రాగిణి.. అందిరిలాగానే మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆపై నటిగా మారింది. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించి అలరించింది. ప్రస్తుతం రాగిణి ఒక అభిమానిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డెబ్యూతోనే అవార్డ్
ఇప్పటివరకు రాగిణి ద్వివేది ఎక్కువగా కన్నడ సినిమాల్లో నటించింది. 2009లో తను హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ముందుగా ‘ఈ శతమానంద వీర మడకరి’ అనే కన్నడ సినిమాతో డెబ్యూ ఇచ్చింది. ఆ మూవీలో తన నటనకు సువర్ణ ఫిల్మ్ అవార్డ్ కూడా అందుకుంది. మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్‌గా అవార్డ్ అందుకోవడంతో శాండిల్‌వుడ్ మేకర్స్ దృష్టి తనపై పడింది. అలా తనకు కెరీర్ మొదట్లోనే హీరోయిన్‌గా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. దాదాపు అయిదేళ్ల పాటు కన్నడలో బిజీ హీరోయిన్‌గా గడిపేసింది రాగిణి ద్వివేది. ఆ తర్వాత మెల్లగా ఇతర భాషల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది.
Also Read: ఆమె వల్లే ఇదంతా.. నూడుల్స్ తిని జీవితాన్ని నెట్టుకొచ్చాం.. ఓ హీరోయిన్ ధీన కథ ఇది
కన్నడలో మంచి ఫ్యాన్‌బేస్
ముందుగా కన్నడ నుండి మలయాళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బయల్దేరింది రాగిణి ద్వివేది. ఆపై తమిళ, హిందీ భాషల్లో కూడా కనిపించింది. తెలుగులో కూడా రాగిణి ద్వివేది (Ragini Dwivedi) ఒక సినిమా చేసింది. నాని హీరోగా తెరకెక్కిన ‘జెండాపై కపిరాజు’ అనే చిత్రంలో చిన్న పాత్రలో తళుక్కుమని మెరిసింది. అలా కెరీర్ ప్రారంభం అయినప్పటి నుండి ఎక్కడా పెద్దగా బ్రేక్ ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది రాగిణి. అలా శాండిల్‌వుడ్‌లో తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, గెస్ట్ రోల్స్‌లో కనిపించడానికి కూడా వెనకాడలేదు ఈ ముద్దుగుమ్మ.