BigTV English

Lower Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే.. నేచురల్ డ్రింక్స్ ఇవే !

Lower Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే.. నేచురల్ డ్రింక్స్ ఇవే !

Lower Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం, మధుమేహం లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి సాధారణ సమస్య. ఆహారం, వ్యాయామం, లైఫ్ స్టైల్ మార్పులతో పాటు, కొన్ని నేచురల్ డ్రింక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ డ్రింక్స్ చాలా సహజమైనవి అంతే కాకుండా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇవి శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


1.ఉసిరి రసం:
ఉసిరి విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఉసిరి రసం ఇన్సులిన్ సమర్థతను మెరుగుపరుస్తుంది. ఇందులోని గ్లూకోజ్ జీవక్రియను ప్రోత్సహిస్తుంది. తాజా ఉసిరి పండ్లను గ్రైండ్ చేసి, జ్యూస్ తీసి.. ఒక గ్లాసు నీటిలో కలిపి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. రుచి కోసం కొద్దిగా ఇందులో తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ చక్కెర అస్సలు వాడకూడదు.

2. దాల్చిన చెక్క నీరు:
దాల్చిన చెక్క ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. అంతే కాకుండా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి రాత్రంతా నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో కూడా తాగవచ్చు. లేదా ఒక దాల్చిన చెక్క ముక్కను నీటిలో మరిగించి, ఆ నీటిని కూడా తీసుకోవచ్చు. దీన్ని రోజూ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.


3. మెంతుల నీరు:
మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు గ్లూకోజ్ శోషణను తగ్గిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని ఫిల్టర్ చేసి తాగండి. ఈ డ్రింక్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

4. కరివేపాకు రసం:
కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, అంతే కాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. తాజా కరివేపాకు ఆకులను శుభ్రం చేసి.. గ్రైండ్ చేసి, జ్యూస్ తీసి, ఒక గ్లాసు నీటిలో కలిపి తాగండి. రోజూ ఉదయం ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతే కాకుండా శరీరంలో యాంటీఆక్సిడెంట్ల స్థాయి కూడా పెరుగుతుంది.

Also Read: పటికను ఇలా కూడా.. వాడొచ్చు తెలుసా ?

5. గ్రీన్ టీ:
గ్రీన్ టీలో ఉండే కాటెచిన్‌లు , యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. గ్లూకోజ్ జీవక్రియను కూడా ప్రోత్సహిస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గ్రీన్ టీలో చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లు కలపకుండా తాగడం మంచిది.

6.నిమ్మరసం, నీరు:
నిమ్మరసంలో విటమిన్ సి , సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం కలిపి, ఉదయం ఖాళీ కడుపుతో తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయి కూడా నియంత్రణలో ఉంటుంది. చక్కెర లేదా తేనె కలపకుండా ఈ డ్రింక్ తాగడం చాలా మంచిది.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×