Allu Arjun : తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో అల్లు అర్జున్ ప్రత్యేక స్థానం ఉంది. మెగా కాపౌండ్ నుంచి అడుగుపెట్టినా కూడా తన టాలెంట్ తో ఒక్కో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ ఏ రేంజులో హిట్ టాక్ ను అందుకుందో మనం చూసాము. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉండటం విశేషం.. మొదటి షో నుంచి ఇప్పటివరకు అదే టాక్ ని మెయింటైన్ చేస్తూ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా కాసుల వర్షం కురిపించింది. ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది ఈ మూవీ.. బాలీవుడ్ లో గతంలో స్టార్ హీరోల రికార్డులను తుడిచి పెట్టేసింది పుష్ప 2.. ఈ మూవీ భారీ బిజీ అని అందుకున్న తర్వాత నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ ఏ స్టార్ డైరెక్టర్ తో చేస్తారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్ రానుందని ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. అయితే అల్లు అర్జున్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట దుమారం రేపుతుంది.. అల్లు అర్జున్ ఇకమీదట యాక్షన్ సినిమాలకు దూరం అని ఓ వార్త అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం భక్తి సినిమాలను చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
గతంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ సినిమా సౌత్ కన్నా నార్త్ లోనే ఎక్కువ హవాని కొనసాగించింది. అటు బాలీవుడ్ లో కూడా పుష్ప క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది.. ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాను తీసుకురావాలని చిత్ర డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశారు. మొదటిపాటు కంటే రెండో పార్ట్ లో యాక్షన్ సన్నివేశాలు అంతకుమించి ఉండాలని స్టోరీని అద్భుతంగా రాశారు. అనుకున్నట్లుగానే పుష్పకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీని 2024 డిసెంబర్ 5వ తేదీన థియేటర్లోకి తీసుకొచ్చారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు గతంలో అల్లు అర్జున్ సినిమాలకు ఎన్నడూ లేని రికార్డుని సొంతం చేసుకుంది.. రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయ్యనున్నాడు..
ఈ మూవీలో అల్లు అర్జున్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అయితే మూవీ హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కుతుందని ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. మహా శివుడి కొడుకు కార్తికేయుని పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.. గాడ్ ఆఫ్ వార్ గా కార్తీకేయుని ప్రయాణం, ఆయన తిరిగి తన తండ్రి అయినటువంటి శివుడిని ఎలా కలుసుకుంటారు.. ఆ తర్వాత కథ ఏంటి అనే లైన్ ఆధారంగా ఈ మూవీ తెరకేక్కబోతుందని సమాచారం.. మరి ఈ వార్తల పై స్పష్టత రావాల్సి ఉంది.. త్రివిక్రమ్ టీమ్ ఈ వార్తల పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.. ఏది ఏమైనా అల్లు అర్జున్ ఇలాంటి పాత్రలో కనిపించడం అంటే ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. రిస్క్ అవసరమా బన్నీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి బన్నీ మనసు మార్చుకుంటాడేమో చూడాలి…