Kartik Aaryan: ఒకానొక సమయంలో ఒరిజినల్ సినిమాలతో బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం హిట్ దక్కలేదు. అందుకే వారంతా కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే రీమేక్ సినిమాలు చేయాలని.. లేదా బయోపిక్స్ తెరకెక్కించాలని.. కొన్నాళ్ల క్రితం హీరోలంతా కేవలం ఈ రెండే పడవల్లో ప్రయాణం చేస్తూ సక్సెస్‌ను అందుకున్నారు. కానీ ఇప్పుడు రీమేక్స్ కూడా చాలావరకు బాలీవుడ్ హీరోలను కాపాడలేకపోతున్నాయి. రీమేక్ వల్ల ఆల్రెడీ దెబ్బతిన్న ఒక బాలీవుడ్ యంగ్ హీరో మళ్లీ అదే తప్పు చేయడానికి సిద్ధమయ్యాడు. నేచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయాలని కార్తిక్ ఆర్యన్ నిర్ణయించుకున్నాడట.
డిశాస్టర్ రీమేక్
ఒకప్పుడు రీమేక్ సినిమాలు బాలీవుడ్‌లో అందరు హీరోలకు చాలానే సక్సెస్ అందించాయి. కానీ మెల్లగా ఆడియన్స్ కూడా ఏ భాషలో సినిమాను ఆ భాషలోనే చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే రీమేక్స్‌కు పెద్దగా హైప్ క్రియేట్ అవ్వడం లేదు. దానివల్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రీమేక్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిశాస్టర్‌గా మారుతున్నాయి. అందులో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురంలో’ రీమేక్ కూడా ఒకటి. హిందీలో ఈ సినిమా ‘షెహ్జాదా’ అనే టైటిల్‌తో రీమేక్ అయ్యింది. ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించాడు. కానీ ఈ మూవీ భారీ డిశాస్టర్ అయ్యింది.
Also Read: థియేటర్లలో సల్లూ భాయ్ హల్‌చల్.. ఎంట్రీ సీన్ ఎలా ఉందంటే.?
ఇంకా సరిపోదా
సీక్వెల్స్ అనేవి కార్తిక్ ఆర్యన్‌ను మినిమమ్ గ్యారెంటీ హీరోగా బాలీవుడ్‌లో నిలబెట్టాయి. మామూలుగా సీక్వెల్స్ అనేవి పెద్దగా సక్సెస్ అవ్వవు అని అంటుంటారు. కానీ కార్తిక్ ఆర్యన్‌ను బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోను చేసింది మాత్రం అవే. అదే సమయంలో ఒక రీమేక్‌తో అనవసరమైన రిస్క్ తీసుకున్నాడు ఈ యంగ్ హీరో. అది కాస్త తనకు డిశాస్టర్‌ను మిగిల్చింది. అయినా కూడా ఇప్పుడు నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) రీమేక్‌లో నటించడానికి కార్తిక్ ఆర్యన్ సిద్ధమయ్యాడట. ఇప్పటికే దీనికి తగిన ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయని సమాచారం. ఈ వార్త విన్న కార్తిక్ ఫ్యాన్స్ రీమేక్‌తో రిస్క్ వద్దు అని సలహా ఇస్తున్నారు.
అలా చేస్తేనే హిట్
కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) హీరోగా నటించిన చివరి చిత్రం ‘భూల్ భూలయ్యా 3’. రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. మొత్తంగా రూ.417.51 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ‘భూల్ భూలయ్యా 3’ మాత్రమే కాదు.. ‘భూల్ భూలయ్యా 2’ కూడా కార్తిక్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అలా ఒక సక్సెస్ స్ట్రీక్‌ను మెయింటేయిన్ చేస్తున్న కార్తిక్‌కు ‘సరిపోదా శనివారం’ రీమేక్ బ్రేకులు వేస్తుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఈరోజుల్లో ఒక మూవీ రీమేక్ హిట్ అవ్వాలంటే దానికి ప్రమోషన్స్ చేస్తే అది మినిమమ్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.