E-Paper
Advertisement

DGCA – IndiGo Airlines: దేశ వ్యాప్తంగా విమానాల రద్దు, ఇండిగోకు DGCA సమన్లు!

DGCA – IndiGo Airlines: దేశ వ్యాప్తంగా విమానాల రద్దు, ఇండిగోకు DGCA సమన్లు!
Advertisement

దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సంస్థ పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేయడంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) దృష్టిసారించింది. విమానాల రద్దు, ఆలస్యంపై వివరణ ఇవ్వాలంటూ ఆ సంస్థకు సమన్లు జారీ చేసింది. వెంటనే తమ కార్యాలయానికి వచ్చి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించింది. ఈ మేరకు DGCA కీలక ప్రకటన చేసింది.

దేశ వ్యాప్తంగా ఇండిగో సేవలకు అంతరాయం

దేశ వ్యాప్తంగా రెండు రోజులుగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ సహా పెద్ద నగరాలకు రాకపోకలు కొనసాగించాల్సిన విమానాలు పెద్ద సంఖ్యలో క్యాన్సిల్ చేసింది. ఢిల్లీలో 30కి పైగా, హైదరాబాద్‌లో 33 విమానాలు రద్దు అయ్యాయి. బుధవారం నాడు నాలుగు ప్రధాన నగరాల్లో 200 విమానాలు రద్దు కాగా, గురువారం నాడు 170కి పైగా ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయి. ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో ఎయిర్ పోర్టులలో గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, విమానాశ్రయాల్లో తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు.

విమానాల రద్దుపై ఇండిగో ఏం చెప్పిందంటే?

Advertisement

అటు దేశ వ్యాప్తంగా విమానాల రద్దుపై ఇండిగో కీలక ప్రకటన చేసింది. వింటర్‌ షెడ్యూల్ మార్పులు, వాతావరణ సమస్యలు, సాంకేతిక లోపాలతోనే విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. కొత్త FDTL నిబంధనలతో పైలట్ల కొరత పెరిగినట్లు తెలిపింది.  షెడ్యూల్ సర్దుబాట్లు చేస్తూ కార్యకలాపాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు వివరించింది. అయితే, ఇందుకోసం సుమారు 48 గంటల సమయం పట్ట వచ్చని బుధవారం సాయంత్రం ప్రకటించింది.

నవంబర్ లో 1,232 ఇండిగో విమానాలు రద్దు

గత నెలలోనూ ఇండిగో విమానాలు దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రద్దు అయ్యాయి. నవంబరులో ఇండిగో ఆయా కారణాలతో ఏకంగా 1,232 విమానాలను రద్దు చేసింది. వీటిలో 258 విమానాలు ఎయిర్‌ స్పేస్ పరిమితుల వల్ల రద్దు అయినట్లు తెలిపింది. మరో 92 విమానాలు ATC వ్యవస్థ వైఫల్యంతో క్యాన్సిల్ అయినట్లు చెప్పింది.

Advertisement

Read Also: 55 ఇండిగో విమానాలు రద్దు, శంషాబాద్ ఎయిర్ పోర్టులో గందరగోళం!

ఇండిగోకు DGCA సమన్లు

దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాల రద్దుపై DGCA విచారణ మొదలు పెట్టింది. ఇండిగో సంస్థకు సమన్లు జారీ చేసింది. విమానాల రద్దు, ఆలస్యంపై వివరణ కోరింది. వీలైనంత త్వరగా ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే విమానాయాన వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని వెల్లడించింది.

Read Also: ఎయిర్ పోర్టులపై కొత్త కుట్ర, అదే జరిగితే ప్రయాణీకుల ప్రాణాలు గాల్లోనే..

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×