BigTV English

Indian Railways: వృద్ధులు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు, ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్!

Indian Railways: వృద్ధులు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు, ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్!

భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు నిండిన మహిళలు, వికలాంగులకు లోయర్ బెర్తలను కేటాయించడం లాంటి ప్రత్యేక నిబంధనలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీల్‌ చైర్లు, హెల్ప్ డెస్క్ లు సహా ప్రత్యేక కోటా టికెట్లు అందిస్తున్నారు. ఇంతకీ, రైల్వే అందిస్తున్న ప్రత్యేక రాయితీల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


సీనియర్ సిటిజన్లు, మహిళలకు కల్పించే సదుపాయాలు

⦿ స్లీపర్ క్లాస్‌లో కోచ్‌కు 6 నుంచి 7 బెర్త్‌లు ఉంటాయి.  ఎయిర్ కండిషన్డ్ 3 టైర్ (3AC)లో 4 నుంచి 5 లోయర్ బెర్త్‌లు కేటాయించబడ్డాయి. ఎయిర్ కండిషన్డ్ 2 టైర్ (2AC) కోచ్‌లలో ప్రయాణీకులకు 3 నుంచి 4 లోయర్ బెర్త్‌లు రిజర్వ్ చేయబడతాయి. ఈ కేటాయింపులు రైలులోని కోచ్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంది.


⦿ సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు, గర్భిణీలకు బుకింగ్ సమయంలో ఆటోమేటిక్ గా లోయర్ బెర్త్‌లు కేటాయించబడతాయి. అయితే, అవైలబులిటీని బట్టి అందుబాటులో ఉంటాయి. అర్హత ఉన్న ప్రయాణీకులకు ప్రయాణంలో అసౌకర్యానికి గురి కాకుండా ఈ బెర్తులు ఉపయోగపడనున్నాయి.

⦿ ఇక దివ్యాంగుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. రాజధాని, శతాబ్ది లాంటి ప్రీమియర్ క్లాసులతో సహా అన్ని ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్ కోటాను అందిస్తోంది. స్లీపర్ క్లాస్‌ లో నాలుగు బెర్త్‌ లు, వాటిలో కనీసం రెండు లోయర్ బెర్త్‌లు ఉంటాయి. 3AC/3Eలో నాలుగు బెర్త్‌లు ఉంటాయి. వాటిలో రెండు లోయర్ బెర్త్‌లు ఉంటాయి. రిజర్వ్డ్ సెకండ్ సిట్టింగ్ (2S) లేదంటే ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ (CC)లో నాలుగు సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి.

⦿  ప్రయాణంలో ఏదైనా లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటే, మహిళలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

⦿ బెర్త్ రిజర్వేషన్లతో పాటు స్టేషన్లలో సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. బోర్డింగ్, డీబోర్డింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి  స్టేషన్లలో వీల్‌ చైర్లు, ప్రత్యేక హెల్ప్   కౌంటర్లు, ర్యాంప్ యాక్సెస్ సదుపాయాలను అందిస్తున్నారు.

Read Also: హైదరాబాద్ లో ట్రాఫిక్ డైవర్షన్స్, మీ ప్రాంతాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి!

ప్రయాణీకులు ఏవైనా ఛార్జీ రాయితీలును పొందుతారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా ఈ బెర్తుల కేటాయింపు సౌకర్యాలను అందిస్తోంది భారతీయ రైల్వే. ఈ సౌకర్యాలతో సీనియర్ సిటిజన్లు, 45 ఏండ్లు పైబడిన మహిళలు, దివ్యాంగులు తమ ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే, చాలా మందికి ఈ ఈ సదుపాయాల గురించి తెలియదని, ఇకపై వీటిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణంలో సౌకర్యంతో పాటు భద్రతను పొందాలంటున్నారు.

Read Also: హైదరాబాద్ మెట్రో కొత్త రూట్స్, రాబోయే స్టేషన్లు ఇవే.. మీ ఏరియా ఉందేమో చూడండి!

Related News

Jaffar Express Blast: రైళ్లే టార్గెట్ గా పేలుళ్లు, ఎగిరిపడ్డ బోగీలు, పదుల సంఖ్యలో ప్రయాణీకులు..

President Special Train: ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Vande Bharat Trains: 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అంటే?

Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

Dasara Special Trains: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

Sunrise Express: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Big Stories

×