Flight Service: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇది శుభవార్త. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీపి కబురు చెప్పారు. విజయవాడ- కర్నూలు నగరాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2025 జూలై 2 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
⦿ తక్కువ సమయంలో గమ్యస్థానం చేరుకునేలా..
ఈ విమాన సర్వీసులు ఇండిగో ఎయిర్‌లైన్స్ ద్వారా వారానికి మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో ఈ విమాన సర్వీసుల ద్వారా ప్రజలు ప్రయాణించవచ్చు. ఈ నూతన విమాన సర్వీస్ మార్గం విజయవాడ-కర్నూలు-విజయవాడ మధ్య అంతర్-రాష్ట్ర కనెక్టివిటీని బలోపేతం చేయనుంది. ప్రజలు త్వరగా గమ్యస్థానం చేరుకోవచ్చు. రాయలసీమ ప్రజలు రాజధాని ప్రాంతానికి తక్కువ సమయంలో చేరేందుకు ఈ సర్వీసులు వినియోగించుకోవచ్చు.
⦿ జూలై 2 సర్వీసులు మొదలు
విజయవాడ నుంచి కర్నూలు వరకు విమాన సర్వీసులు ఆంధ్రప్రదేశ్‌లో అంతర్-రాష్ట్ర కనెక్టివిటీని బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతున్నాయి. ఈ సర్వీసులు రాష్ట్ర రాజధాని ప్రాంతమైన అమరావతిని కర్నూలుతో కలుపుతూ, ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సమయం ఆదా చేసే రవాణా సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ కొత్త విమాన మార్గం జూలై 2, 2025 నుంచి ప్రారంభం కానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ సర్వీసులు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం నడుస్తాయి, ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ మార్గంలో విమానాలను నడుపనుంది.అ
⦿ అమరావతి అభివృద్ధే లక్ష్యంగా మోదీ సర్కార్..
రాజధాని నగరం అమరావతి అభివృద్ధే లక్ష్యంగా మోదీ సర్కార్ సహకారం అందిస్తోంది. అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో రాష్ట్రంతో కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీనే స్వయంగా ప్రకటించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే అమరావతి నగరాన్ని ముఖ్యమైన ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే కేంద్రం అమరావతి రైల్వే లైన్ నిర్మిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
⦿ అమరావతి కేంద్రం స్పెషల్ ఫోకస్
అమరావతిపై స్పెషల్ పోకస్ పెట్టిన కేంద్రం.. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సైతం కసరత్తు జరుపుతోంది. ఈక్రమంలోనే.. కేంద్ర పౌరవిమానాయాన శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అమరావతిని రాయలసీమలో ముఖ్య నగరమైన కర్నూల్ ప్రాంతంతో అనుసంధానం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Also Read: Bullet Train: అప్పుడే 300 కిమీలు పూర్తి చేసుకున్న బుల్లెట్ రైల్ ట్రాక్.. ఇదిగో వీడియో
విజయవాడ నుంచి కర్నూలు మధ్య విమాన సర్వీసును ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. జూలై 2 నుంచి ఈ సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వారంలో మూడు రోజులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. ఇండిగో ఎయిర్ లైన్స్ ఈ విమాన సర్వీసును నడపనున్నట్టు తెలిపారు.
Also Read: Vande Bharat Train: దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ రైలు ఇదే, ఏ రూట్ లో నడుస్తుందంటే?