Bullet Train: అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భాగంగా మరో అడుగు ముందుకు పడింది. 300 కిలోమీటర్ల వంతెన పూర్తి అయినట్టు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ఫుల్ స్పాన్ లాంచింగ్ మెథడ్ (ఎఫ్ఎస్ఎల్ఎం) ద్వారా నిర్మిస్తున్న సూపర్ స్ట్రక్చర్ వీడియోను ఆయన షేర్ చేశారు.
⦿ 3 గంటల్లో 508 కిలోమీటర్లు
భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్-ముంబయి నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధిచన పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు ఉంటుంది. బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అహ్మదాబాద్ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టకు సంబంధించిన స్టేషన్లు గుజరాత్‌లో మొత్తం 8 ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి.
⦿ 350 కిమీ వేగంతో బుల్లెట్ ట్రైన్ పరుగులు
బుల్లెట్ ట్రైన్ తొలి ట్రయల్స్‌ను 2026లో చేపట్టనున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ట్రయల్ రన్‌లో భాగంగా బుల్లెట్ ట్రైన్ గంటలకు 350 కి.మీ. వేగంతో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెడుతుందని.. ఇది విమానం టేకాఫ్ అయ్యే వేగంతో సమానంగా ఉందని పేర్కొన్నారు. అయితే.. ఇది పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో నడపనున్నట్లు వివరించారు.
300 km viaduct completed.
— Bullet Train Project pic.twitter.com/dPP25lU2Gy— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 20, 2025
⦿ ప్రాజెక్ట్ విలువ రూ.1.08 కోట్లు
ఈ ప్రాజెక్ట్ విలువ రూ.1.08 లక్షల కోట్లు అని చెప్పారు. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. గుజరాత్, మహారాష్ట్ర చెరో రూ.5000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ 2028 నాటికి కంప్లీట్ అవుతోందని.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవలే ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.
Construction work is in full swing in the 135 km elevated section of the Bullet Train project in Maharashtra! This challenging section includes 3 stations, 7 mountain tunnels, bridges on 4 major rivers, including the longest one on the Vaitarna river (2.32 km), and more. pic.twitter.com/6nzhnjsEUl
— NHSRCL (@nhsrcl) January 27, 2025
Also Read: Vande Bharat Train: దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ రైలు ఇదే, ఏ రూట్ లో నడుస్తుందంటే?
⦿ 300 KM వంతెన పూర్తి
ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు 300 కిలోమీటర్ల వంతెన కంప్లీట్ అయినట్టు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర్కొంది. 300 కిలోమీటర్ల సూపర్ స్ట్రక్చర్‌లో 257.4 కిలోమీటర్లు ఫుల్ స్పాన్ లాంచింగ్ మెథడ్ ద్వారా నిర్మించామని వివరించింది. వీటిలో 14 నది వంతెనలు, 37.8 కిలోమీటర్ల స్పాన్ బై స్పాన్, 900 మీటర్ల స్టీల్ వంతెనలు , 1.2 కిలోమీటర్ల పీఎస్‌సీ వంతెనలు ఉన్నాయని చెప్పింది.
100 feet below Mumbai, progress powers ahead at the city’s Bullet Train Station. From mighty excavations to precision reinforcements — every step builds the future of urban travel! pic.twitter.com/QAD9ZZjdU1
— NHSRCL (@nhsrcl) April 21, 2025
Also Read: Railway Stations: ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లు ప్రారంభం, ఎప్పుడో తెలుసా?