Crime News: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చీరాల మండలం వాడరేవు సమీపంలోని నేషనల్ హైవేపై కారు చక్రం ఊడిపోవడంతో పల్టీలు కొట్టింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
పోలీసులు వివరాల ప్రకారం.. గుంటూరులోని ఓ పాలిటెక్నిక్ కాలేజీ స్టూడెంట్స్ ఇన్నోవా కారులో వాడరేవుకు వచ్చారు. అక్కడ ఎంజాయ్ చేసి ఈ రోజు సాయంత్రం తిరిగి కారులో గుంటూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: NED Recruitment: డిగ్రీ అర్హతతో ఏపీలో ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
మృతిచెందిన వారిని అజయ్, కార్తీక్, నాయక్ లుగా పోలీసులు గుర్తించారు. దేవదత్త, శామ్యూల్, హోసన్న, విష్ణు శశాంక్, తనుష్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చీరాల ఏరియా ఆస్పత్రికి తరిలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Kamal Chandra: వరంగల్‌కు కాకతీయ వారసుడొచ్చాడు.. అదే రాజసం! మీరు చూసేయండి..