E-Paper
Advertisement

Rishikesh Train: గుడ్ న్యూస్.. రిషికేష్‌కు నేరుగా రైలు, ఎప్పటి నుంచంటే?

Rishikesh Train: గుడ్ న్యూస్.. రిషికేష్‌కు నేరుగా రైలు, ఎప్పటి నుంచంటే?

ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లాలో ఒక అందమైన ప్రాంతం రిషికేష్. ఇది మద్యం రహిత నగరం. అంటే రిషికేశ్ లో మీకు మద్యం దొరకడం కాస్త కష్టమే. రిషికేశ్‌లో శాఖాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. హిమాలయాలకు దగ్గరగా ఉండడం వల్ల రిషికేష్ చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, ప్రకృతి నిండిన పరిసరాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ట్రెక్కింగ్ వంటి సాహస కార్యాకలాపాలు రిషికేష్ పెట్టింది పేరు. అందుకే ఈ ప్రాంతానికి వెళ్లే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది.

బెంగళూరు టు రిషికేష్ ట్రైన్
ఇప్పుడు రిషికేష్ వెళ్లాలనుకునే పర్యాటకులకు ఒక శుభవార్త. భారత రైల్వే బెంగుళూరు నుండి రిషికేష్‌కు డైరెక్టుగా సర్వీసును ప్రారంభించనుంది. ఈ కొత్త సర్వీస్ కర్ణాటక ఉత్తరాఖండ్ మధ్య ముఖ్యంగా వేసవి సెలవుల్లో పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడం కోసం మొదలుపెట్టబోతున్నారు. ఈ రైలు నెంబరు 06597 గా నిర్ధారించారు. ఈ ప్రత్యేక రైలు జూన్ 19 నుంచి మొదలవుతుంది. ఈ రైలు ఉదయం ఏడు గంటలకు బెంగళూరు నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం రిషికేష్ కు చేరుకుంటుంది.

ఈ రైలు జైపూర్, సూరత్, వడోదర వంటి అనేక కీలక స్టాపులను కవర్ చేసుకుంటూ వెళుతుంది. ఈ రైలు ఏర్పాటు చేయడం వల్ల రిషికేష్ కు వెళ్లే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని రైల్వే బోర్డు అంచనా వేస్తోంది.

రిషికేష్ ను ప్రపంచ యోగా రాజధానిగా పిలుచుకుంటారు. ఇక్కడకు ఆధ్యాత్మిక అన్వేషకులు, సాహస ప్రియులు, ప్రకృతి ప్రేమికులు నిత్యం రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. ఇలా ప్రత్యేకమైన రైలును బెంగళూరు నుంచి రిషికేష్ కు వేయడం వల్ల రోడ్డు మార్గంలో వచ్చే వారి సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల కార్బన్ ఉద్గారాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. అలాగే ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశం ఉంది.

గంగానది పక్కనే రిషికేష్
రిషికేశ్ గురించి హిందూ పురాణాలలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని ఒక పవిత్ర నగరంగా మన హిందూ పురాణాలు గుర్తిస్తాయి. గంగానది పక్కనే ఈ రిషికేష్ ఉంటుంది. కాబట్టి హిందువులకు ఈ నగరం ఎంతో పవిత్రమైనది. ఇక్కడ ఉన్న యోగాసనాలు, యోగా కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యోగా ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఈ నగరం హిమాలయాల అంచున కొలువుదీరి ఉంటుంది. కాబట్టి చుట్టూ ఉన్న పర్వతాలు, అడవులు, నదులు రిషికేష్ ను సహజ సౌందర్యంతో నిండి ఉండేలా చేస్తాయి.

రబ్బింగ్, రాప్టింగ్, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలకు అనువైన ప్రదేశంగా రిషికేష్ ను చెప్పుకుంటారు. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి రిషికేష్ అద్భుతమైన గమ్యస్థానం. భారతీయ సంస్కృతి ఆచారాలను పాటించే నగరంగా కూడా రిషికేష్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఉండే శాఖాహార వంటకాలు, దుస్తులు అందరినీ ఆకర్షిస్తాయి. రిషికేష్ వెళ్లినవారు రామ్ ఝుల, లక్ష్మణ్ ఝల, నీలకంఠ మహదేవ్ ఆలయాలను తప్పకుండా చూసి రావాలి.

హరిద్వార్ నుండి 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రిషికేష్ మీరు ఈ నగరాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు హరిద్వార్ ను కూడా దర్శించుకోవచ్చు. రిషికేష్ ను సాగాల ప్రదేశం అని పిలుచుకుంటారు. ఉత్తరాఖండ్లోని రిషికేశ్ నడిబొడ్డుని త్రివేణి ఘాట్ ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన ఘాట్లలో ఒకటి. ఎందుకంటే గంగా, యమునా, సరస్వతి సంగమించే పవిత్ర ప్రదేశం ఈ త్రివేణి ఘాట్.

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×