MLC 2025 Captains : ఇండియన్ ప్రీమియల్ లీగ్ 2025 జూన్ 03న ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇది ముగిసిన వారం రోజుల లోపే USA వేదికగా జూన్ 13 నుంచి మేజర్ క్రికెట్ లీగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో ఏర్పాటు చేసిన ఈ టీ20 లీగ్‌లో ప్రపంచ స్థాయి క్రికెటర్లు పాల్గొంటున్నారు. దాదాపు నెల రోజులు పాటు జరిగే ఈ లీగ్ జూలై 14న ముగియనుంది. ఐపీఎల్ మాదిరిగానే మేజర్ లీగ్ క్రికెట్ కూడా లీగ్, ప్లే ఆఫ్ దశలో జరగనుంది. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో ఒక్కొక్కటి పది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. లీగ్ దశలో టాప్ 4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కి వెళ్లగా.. అక్కడ క్వాలిఫైయర్, ఎలిమినేటర్ తర్వాత ఫైనల్ జరగనుంది. మేజర్ క్రికెట్ లీగ్‌లో ఐపీఎల్‌లో ఆడిన ఎంతో మంది స్టార్ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు.
Also Read : Finn Allen : గేల్ రికార్డు బ్రేక్.. న్యూజిలాండ్ ఓపెనర్ సిక్సర్లతో ఊచకోత
ముఖ్యంగా సునీల్ నరైన్, ఫాఫ్ డుప్లెసిస్, ఆండ్రీరసెల్, ట్రెంట్ బౌల్ట్, మ్యాక్స్‌వెల్, నికోలస్ పూరన్ ఇలా ఎంతోమంది ఆటగాళ్లు ఈ లీగ్‌లోనూ పాల్గొంటున్నారు. మేజర్ లీగ్ క్రికెట్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. అందులో ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు చెందిన నాలుగు జట్లు ఉండగా, మిగతా రెండు కూడా భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలవే కావడం విశేషం. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, ఎంఐ న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సియాటల్ ఆర్కస్, టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్లు ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే…? ముఖ్యంగా ఆయా దేశాలకు చెందిన క్రికెటర్లు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్లకే కెప్టెన్సీ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రిటైర్మెంట్ ప్లేయర్లే కెప్టెన్లు..
కెప్టెన్ల విషయానికి వస్తే అందరూ విదేశీ ఆటగాళ్లే కావడం గమనార్హం. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌కు జేసన్ హోల్డర్ కెప్టెన్ కాగా.. మొదటి రెండు మ్యాచ్‌లకు మాత్రం సునీల్ నరైన్ సారథ్యం వహించనున్నాడు. ఎంఐ న్యూయార్క్‌కు నికోలస్ పూరన్, శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కి కోరి అండర్సన్, సియాటల్ ఆర్కస్‌కు హెన్రిచ్ క్లాసెన్, టెక్సాస్ సూపర్ కింగ్స్‌కి ఫాఫ్ డుప్లెసిస్, వాషింగ్టన్ ఫ్రీడమ్‌కి గ్లెన్ మ్యాక్స్‌వెల్ కెప్టెన్లుగా ఉన్నారు. అయితే వీరందరూ కూడా రిటైర్మెంట్ ప్లేయర్లు కావడం విశేషం. మరోవైపు మొదటి మ్యాచ్ లో 51 బంతుల్లో 151 పరుగులు చేసి ఊచకోత కోశాడు న్యూజిలాండ్ ఓపెనర్ అలెన్. MLC ప్రారంభ మ్యాచ్ లో ఓక్లాండ్ కొలిజియంలో వాషింగ్టన్ ఫ్రీడమ్ తో జరిగిన మ్యాచ్ లో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ కి ప్రాతినిధ్యం వహించిన ఫిన్ అలెన్ టీ-20 క్రికెట్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా 19 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టడంతో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్ 20 ఓవర్లలో 269/5 భారీ స్కోర్ చేసింది.