OTT Movie : ఒక రోజు రాత్రి జేక్ పోర్ట్‌మన్ తన తాత ఏబ్‌ను అపస్మారక స్థితిలో చూస్తాడు. అతని చివరి మాటలలో ఒక ద్వీపం, ఒక సీక్రెట్ ఇల్లు, మిస్ పెరెగ్రిన్ అనే పేరును పలుకుతాడు. అతని మరణం జేక్ కు కొత్త అనుమానాలను క్రియేట్ చేస్తుంది. అతను తన తాత చెప్పిన మాటల వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టాలనుకుంటాడు. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా ‘రాన్సమ్ రిగ్స్’ నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
జేక్ పోర్ట్‌మన్ అనే టీనేజర్ ఫ్లోరిడాలో సాధారణ జీవితం గడుపుతుంటాడు. తన తాత ఏబ్ తో మంచి అనుబంధం ఉంటుంది. జేక్ చిన్నగా ఉన్నప్పుడు ఏబ్ దెయ్యాల కథలు ఎక్కువగా చెప్పేవాడు. ఈ కథలలో ఒక ఇంటి గురించి, అందులోని మిస్ పెరెగ్రిన్ అనే స్త్రీ గురించి కూడా కథలు చెప్పేవాడు. ఈ కథలు జేక్‌కు కేవలం ఊహాజనితమైనవిగా అనిపించేవి. కానీ ఒక రాత్రి ఏబ్ అనుమాన పరిస్థితిలో మరణిస్తాడు. అతని చివరి మాటలు జేక్‌కు ఒక ప్రయాణానికి దారితీస్తాయి. జేక్ ఒక ద్వీపంలో మిస్ పెరెగ్రిన్ ఇంటిని కనిపెడతాడు. అక్కడికి వెళ్ళి తన తాత మరణం వెనుక ఉన్న నిజాన్ని, అతని కథల రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. సస్పెన్స్ ఇక్కడ నుండి మొదలవుతుంది. ఎందుకంటే ఏబ్ మరణం సాధారణమైనది కాదని, అతను ఏదో ప్రమాదకరమైన శక్తులను ఎదుర్కొన్నాడని తెలుస్తుంది. జేక్ తన తండ్రితో కలిసి వేల్స్‌లోని ఈ ద్వీపానికి చేరుకుంటాడు. అక్కడ అతను రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబు దాడిలో నాశనమైనట్లు కనిపించే ఒక పాడుబడిన ఇంటిని చూస్తాడు.
అయితే అతను ఆశ్చర్యంగా ఒక టైమ్ లూప్‌లోకి అడుగుపెడతాడు. ఇది 1943 సెప్టెంబర్ 3 వ రోజు పదేపదే తిరుగుతుంటుంది. ఈ లూప్‌లో అతను మిస్ పెరెగ్రిన్ ను కలుస్తాడు. ఆమెకు సమయాన్ని నియంత్రించగల శక్తి ఉంటుంది. ఆమె అండర్ లో కొంత మంది పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా చాలా పవర్స్ ఉంటాయి. మిస్ పెరెగ్రిన్ ఈ లూప్‌ను నిర్వహిస్తూ, పిల్లలను హోలోస్ అనే దుష్ట శక్తి నుండి రక్షిస్తుంది. కానీ హోలోస్ అనే దుష్ట నాయకుడు వాళ్ళను వెంబడిస్తూనే ఉంటాడు. ఆ పిల్లలను బందీగా చేసి, తన ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటాడు. ఇందుకు గానూ అతడు ఈ టైమ్ లూప్‌ను నాశనం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో జేక్ కి అక్కడ తన తాత మరణానికి అసలు కారణం తెలుస్తుంది. ఇతను కూడా పిల్లలకోసం అతనితో పోరాడుతాడు. చివరికి జేక్ అక్కడ తెలుసుకున్న రహస్యం ఏమిటి ? బారన్ పిల్లలను ఎందుకు బంధించాలనుకుంటాడు ? పెరెగ్రిన్ అతన్ని ఎలా ఎదుర్కుంటుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : నిద్రపోతున్న సింహాన్ని అనవసరంగా లేపారు … అందరికీ చుక్కలు చూపించాడు
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ పేరు ‘మిస్ పెరెగ్రిన్స్ హోమ్ ఫర్ పెక్యులియర్ చిల్డ్రన్ ‘(Miss Peregrine’s Home for Peculiar Children). 2016 లో వచ్చిన ఈ సినిమాకు టిమ్ బర్టన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆసా బటర్‌ఫీల్డ్ (జేక్), ఎవా గ్రీన్ (మిస్ పెరెగ్రిన్), ఎల్లా పర్నెల్ (ఎమ్మా), సామ్యూల్ ఎల్. జాక్సన్ (బారన్), టెరెన్స్ స్టాంప్ (ఏబ్) ప్రధాన పాత్రలలో నటించారు. జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.