BigTV English

IRCTC Tickets: మీరు ట్రైన్ లేదా కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చెయ్యండి

IRCTC Tickets: మీరు ట్రైన్ లేదా కోచ్  మొత్తాన్ని బుక్  చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చెయ్యండి

ఎంతోమంది ప్రజలు వివాహాలు లేదా వెకేషన్ లకు వెళ్ళినప్పుడు ఎక్కువ మంది కలిసి ప్రయాణాలు చేస్తారు. ఇలా గ్రూపుగా ప్రయాణించేటప్పుడు రైలు టికెట్లను విడివిడిగా బుక్ చేసుకుంటే వారి బెర్తులు ఒక్కోచోట వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్ టికెట్ బుకింగ్ చేసుకుంటే అందరూ ఒకే చోట ఉండవచ్చు. లేదా మొత్తం రైలు కూడా బుక్ చేసుకోవచ్చు . గ్రూప్ టికెట్ బుకింగ్ ఎలా బుక్ చేసుకోవాలో, నియమాలు ఏమిటో తెలుసుకోండి.


గ్రూప్ టికెట్ బుకింగ్ ఇలా?
ముందుగా మీరు ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి. అందులో మీరు మొత్తం రైలును బుక్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా కోచ్ ను బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆఫ్షన్ అడుగుతుంది.మీ అవసరాన్ని బట్టి ఎంచుకోండి. అలాగే ప్రయాణ తేదీ? ఏ స్టేషన్లో ఎక్కాలనుకుంటున్నారు? ఏ స్టేషన్లో దిగాలనుకుంటున్నారు? నమోదు చేయండి. అలాగే ప్రయాణికుల సంఖ్యను కూడా అక్కడ అడుగుతుంది. దాన్ని కూడా నమోదు చేయండి. ఏసీ కోచ్ కావాలా నాన్ ఏసీ కోచ్ కావాలో కూడా ఎంపిక చేసుకోండి. అలా చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ కనిపిస్తుంది. దాని సాయంతో ఆరు రోజుల్లోపు రిజిస్ట్రేషన్ మొత్తాన్ని చెల్లించాలి. చెల్లింపు పూర్తయ్యాక మీ బుకింగ్ నిర్ధారిస్తూ ఒక ఎఫ్‌టిఆర్ నెంబర్ వస్తుంది.

ఎంత ఖర్చు?
ఏడు రోజుల టూర్ కోసం మీరు ఒక కోచ్ ను బుక్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ కు 50,000 ఖర్చు పెట్టాలి. అలాగే 18 కోచులు ఉన్న మొత్తం రైలునో బుకింగ్ బుక్ చేసుకోవాలంటే 9 లక్షలు మేరకు వారం రోజులకుగాను కట్టాల్సి వస్తుంది. రైలు కోచ్ లు 18కి మించి ఉంటే ఒక్కొక్క కోచ్ కు 50 వేల రూపాయలు అదనంగా ఖర్చవుతుంది. 18 కంటే తక్కువ కోచ్ లు ఉన్న రైలును ఎంపిక చేసుకున్నా కూడా దానికి తొమ్మిది లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది.


ఎప్పుడు పడితే అప్పుడు రైలు కోచ్ మొత్తాన్ని, లేదా మొత్తం రైలును బుక్ చేసుకోవడం కుదరదు. మీ ప్రయాణ తేదీకి 6 నెలలు ముందే FTR రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొన్నిసార్లు నెలరోజుల ముందు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Also Read: వందే భారత్‌లో వైష్ణోదేవి ఆలయం నుంచి శ్రీనగర్‌కు.. ఇలా ప్లాన్ చేసుకోండి

ఆఫీసు కోలీగ్స్ అందరూ ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా లేదా వివాహం సందర్భంలో ఇలా గ్రూప్ టికెట్ బుకింగ్ అవసరం పడుతుంది. మతపరమైన యాత్రలకు ఎక్కువగా ట్రైన్ మొత్తం బుక్ చేసుకుంటారు. ప్రస్తుతం గ్రూప్ టికెట్ బుకింగ్ లో భాగంగా 50 నుండి 100 మంది వరకే ఐర్ సీటీసీ అనుమతి ఇస్తోంది. దీనికి తగిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

గ్రూప్ టికెట్ బుకింగ్ గురించి ఇప్పటికీ ఎంతో మందకిి తెలియదు. దీని వల్ల కుటుంబంలోని వ్యక్తులు చెరోచోట కోచ్ లలో కూర్చోవాల్సి వస్తుంది. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో గ్రూప్ టికెట్ బుక్ చేసేందుకు ప్రయత్నించండి. బల్క్ టికెట్ బుకింగ్ అనే పద్దతి కూడా ఉంది. దీనికి ఆన్ లైన్లో కన్నా ఆఫ్ లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది.

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×