Viral Video : పాముల సయ్యాట చాలా ఫేమస్. రెండు పాములు పెనవేసుకునే దృశ్యాలు తరుచూ కనిపిస్తుంటాయి. సోషల్ మీడియాలోనూ ఆ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. రెండు పాముల కొట్లాట సైతం పాపులరే. ఒకే జాతి అయినా.. నువ్వా నేనా అన్నట్టు ఫైట్ చేస్తుంటాయి. ఆ స్నేక్ ఫైటింగ్ సైతం చూట్టానికి ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటిదే లేటెస్ట్‌గా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. జెర్రిపోతు పాముకు, నాగు పాముకు ఓ రేంజ్‌లో వార్ నడిచింది. ఎవరు గెలుస్తారు? ఇంకెవరు ఆ యుద్ధంలో నాగు పామే విన్నర్. జెర్రిపోతును దెబ్బకొట్టి.. అమాంతం మింగేసింది నాగు పాము. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం, లింగంపేట గ్రామంలో.. మల్లెపుట్టు ప్రాంతంలో రెండు పాములు ఫైటింగ్ చేశాయి. సుమారు అర గంట సేపు నాగు పాము, జెర్రి పోతు చిన్నపాటి యుద్ధమే చేశాయి. ఆ నాగుపాము చాలా పొడువు ఉంది. జెర్రిపోతును వేటాడింది. పంట పొలాల్లో తీవ్ర స్థాయిలో ఫైటింగ్ నడిచింది. కాసేపటికి జెర్రిపోతు ఓడిపోయింది. నోట కరుచుకుని ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే అదునుగా నాగుపాము దాన్ని మింగేసింది. అది చనిపోయిందని కన్ఫామ్ చేసుకున్నాక మళ్లీ కక్కేసింది. అక్కడి నుంచి పొలాల్లోకి జారుకుంది.
ఆ సీన్ మొత్తం సమీపంలోని స్థానికుడు సెల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఒక పాము మరో పామును మింగడం అరుదైన ఘటనే అంటున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.