Machilipatnam Beach Helicopter Ride: ఆంధ్రాలో అద్భుతమైన బీచ్ లు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి మచిలీపట్నం సాగర తీరం. ఇక్కడి బీచ్ నేచురల్ గా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హెలికాప్టర్ రైడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ హెలికాప్టర్ లో సామాన్యులు కూడా ఎక్కి హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్యొచ్చు. ఈ నేపథ్యంలో చాలా మంది హెలికాఫ్టర్ లో బీచ్ అందాలు ఆస్వాదించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
జస్ట్ రూ. 4,000కే హెలికాప్టర్ రైడ్
తక్కువ ఖర్చుతోనే మచిలీపట్నం బీచ్ ను ఆకాశంను చూసి ఎంజాయ్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో వ్యక్తికి రూ. 4,000 వసూళు చేస్తున్నారు. సుమారు 7 నిమిషాల పాటు మచిలీపట్నం బీచ్ అందాలను చూసూ అవకాశం కల్పిస్తున్నారు. బీచ్ ఫెస్టివల్ లో భాగంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ రైడ్ కు పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చాలా మంది హెలికాప్టర్ రైడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మచిలీపట్నం బీచ్ ను మరింతగా డెవలప్ చేస్తే, పెద్ద సంఖ్యలో టూరిస్టులు తరలి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు స్థానికులు. అంతేకాదు, పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తే, స్థానికంగా ఉపాధి పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ధి కలుగుతుందంటున్నారు. హెలికాప్టర్ రైడ్ ను కూడా రెగ్యులర్ గా అందుబాటులో ఉంచితే బాగుంటుందంటున్నారు. అటు జెట్ స్కీపై విహరించేందుకు ఒక్కో వ్యక్తి రూ.250గా ఛార్జ్ చేస్తున్నారు. పారాగ్లైడింగ్, ఇతర సాహస క్రీడలను నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వీటిని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమాలను ఇలాగే కంటిన్యూ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also: ప్రపంచంలో ఫాస్టెస్ట్ రైళ్లు ఇవే, ఒక్కోదాని వేగం చూస్తే కళ్లు తిరగాల్సిందే!
బీచ్ ఫెస్టివల్ కు మంచి స్పందన
ఏపీలో తొలిసారి 3వ జాతీయ సీ- కయాకింగ్ పోటీలు మచిలీపట్నంలో నిర్వహించారు. కయాకింగ్, స్టాండప్ పెడలింగ్ ఛాంపియన్‌షిప్-2025 ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. బీచ్ ఫెస్టివల్ లో భాగంగాతొలి రోజు రోజు క్రీడా పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత రకరకాల సాంస్కృతిక కార్యక్రాలు నిర్వహించారు. బీచ్ ఫెస్టివల్ లో ఏర్పాటు చేసిన సాహస క్రీడలకు మంచి స్పందన లభించింది. సాగర తీరంలో రకరకాల విన్యాసాలు చేసేందుకు జనం పోటెత్తారు. అలలపై బోటింగ్ చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. సీ కయాకింగ్, బీచ్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇక ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులలో పలు రకాల బిర్యానీలు, చేపల వేపుళ్లు, రకరకాల స్వీట్లు తిని ఎంజాయ్ చేశారు.
Read Also: భాగ్యనగరంలో అద్భుతం, దేశంలోనే అతి పెద్ద టన్నెల్ అక్వేరియం!