BigTV English
Advertisement

Airports in Japan: జపాన్ లో ఆహా అనిపించే అద్భుతమైన ఎయిర్ పోర్టులు, చూస్తే, ఆశ్చర్యపోవడం పక్కా!

Airports in Japan: జపాన్ లో ఆహా అనిపించే అద్భుతమైన ఎయిర్ పోర్టులు, చూస్తే, ఆశ్చర్యపోవడం పక్కా!

Beautiful Japan Airports: జపాన్ అనగానే అధునాతన బుల్లెట్ రైళ్లు గుర్తుకు వస్తాయి. క్షణాల్లో దూసుకెళ్లే ఈ రైళ్లు ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. బుల్లెట్ రైళ్లే కాదు, ఇక్కడి విమానాశ్రయాలు కూడా ఎంతో అద్భుతంగా నిర్మించారు. ప్రతి ఏటా జపాన్ లోని విమనాశ్రయాల ద్వారా లక్షలది మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే, ఆ దేశంలోని అత్యంత అందమైన విమానాశ్రయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


⦿నరిటా అంతర్జాతీయ విమానాశ్రయం, టోక్యో

ఈ విమానాశ్రయం టోక్యోకు 60 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ విమనాశ్రయం టెర్మినల్ 1 అత్యంత అందమైన 10 మీటర్ల పొడవైన గ్లాస్ వాల్ ను కలిగి ఉంటుంది. నేచురల్ లైటింగ్ తో ప్రయాణీకులకు ఆహ్లాదకరంగా స్వాగతిస్తుంది.  నరిటాలో అబ్జర్వేషన్ డెక్‌ ను కలిగి ఉంది. ప్రయాణీకులు పైలట్లు, కంట్రోల్ టవర్  సంభాషణలను వింటూ విమానాల టేకాప్, ల్యాండింగ్ ను చూసే అవకాశం ఉంటుంది.


⦿ హనేడా విమానాశ్రయం, టోక్యో

టోక్యో డౌన్‌ టౌన్ నుండి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొదట దేశీయ ప్రయాణాల కోసం ఉపయోగించినా, ఆ తర్వాత ఇంటర్నేషనల్ విమానాశ్రయంగా మారింది. టెర్మినల్ 1 ప్యూచర్ జపనీస్ విలేజ్ ను పోలి ఉంటుంది. సాంప్రదాయ మాచియా టౌన్‌ హౌస్‌ల మాదిరిగా కనిపించేలా దుకాణాలు రూపొందించారు. ఇక టెర్మినల్ 2 ఎడో కాలం నాటి నిహోన్‌ బాషి బ్రిడ్జిలా కనిపిస్తుంది. ఇది జపాన్ 5 ప్రధాన రహదారుల చారిత్రక ప్రారంభ కేంద్రానికి కేరాఫ్ గా ఉంటుంది.

⦿ కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఒసాకా

ఒసాకా బేలోని కృత్రిమ ద్వీపంలో దీనిని నిర్మించారు. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ రెంజో పియానో ​​రూపొందించిన ఇంజనీరింగ్ అద్భుతం ఇది. మైలు పొడవున్న టెర్మినల్ భవనం, ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైనది. పై నుంచి చూసినప్పుడు గ్లైడింగ్ ఎయిర్‌ ఫాయిల్‌ ను పోలి ఉంటుంది. భూకంపాలు, తుఫానులను తట్టుకునేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. కానీ, ఇది రోజు రోజుకు సముద్రంలోకి కుంగిపోతోంది.

⦿ ఫుకుయోకా విమానాశ్రయం, ఫుకుయోకా

ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విమనాశ్రయాల్లో ఇది ఒకటి. డౌన్‌ టౌన్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ, సౌండ్ పెద్దగా బయటకు వెళ్లకుండా పని చేస్తుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య విమాన రాకపోకలు ఉండవు. ఇక్కడి టెర్మినల్‌ లో అద్భుతమైన 80 మీటర్ల లైట్ వ్యాలీ రోజంతా సహజ కాంతి కనిపించేలా చేస్తుంది. జపాన్ ప్రవేశ ద్వారం ఫుకుయోకా 1,400 సంవత్సరాల చరిత్రను ప్రదర్శిస్తుంది.

⦿ చుబు సెంట్రైర్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐచి

ఇస్ బేలోని ఒక కృత్రిమ ద్వీపంలో ఉన్న చుబు సెంట్రైర్ అంతర్జాతీయ విమానాశ్రయం చుక్యో మెట్రోపాలిటన్ ప్రాంతానికి సేవలు అందిస్తుంది. జపనీస్ ఇంజనీరింగ్ చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. దీని విశాలమైన పైకప్పు డిజైన్ సాంప్రదాయ జపనీస్ లక్షణాలను ప్రతిబింబిస్తుంది. ప్రయాణీకులు టేకాఫ్ సమయంలో విమాన ఇంజిన్ల పూర్తి శబ్దాన్ని స్పష్టంగా వినే అవకాశం ఉంటుంది.

⦿ న్యూ చిటోస్ విమానాశ్రయం, హక్కైడో

హక్కైడోలో అతిపెద్ద విమానాశ్రయం న్యూ చిటోస్. అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలను ప్రదర్శించే విస్తారమైన గాజు గోడలను కలిగి ఉంటుంది. ఈ విమానాశ్రయంలో యానిమేషన్ సినిమా థియేటర్‌ను కలిగి ఉంది. స్టూడియో గిబ్లి, ఇతర జపనీస్ యానిమేషన్ స్టూడియోలకు సంబంధించిన చిత్రాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఇక్కడ చాక్లెట్ షాపింగ్ మాల్ ఉంటుంది. ఇందులో అన్నీ చాక్లెట్స్ ఉంటాయి. ఈ విమానాశ్రయం డైరీ ఫామ్‌ ను రన్ చేస్తుంది. విమానాశ్రయ రెస్టారెంట్లకు అల్ట్రా ఫ్రెష్ పాలు, ఐస్ క్రీంను అందిస్తుంది!

⦿ కగోషిమా విమానాశ్రయం, కగోషిమా

దక్షిణ క్యుషు పర్వతాల మధ్య ఉన్న కగోషిమా విమానాశ్రయం చుట్టూ చురుకైన అగ్ని పర్వతాలు ఉంటాయి.  జపాన్‌ లోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటైన సకురాజిమా, కింకో బే నిత్యం లావాను వెదజల్లుతుంటాయి.  ఆ దృశ్యాలు విమానాశ్రయం వరకు కనిపిస్తాయి.

⦿ హిరోషిమా విమానాశ్రయం, హిరోషిమా

హిరోషిమాకు 50 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. పశ్చిమ జపాన్‌కు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. దీని ఆధునిక టెర్మినల్ శాంతి, సామరస్యాన్ని సూచించే విలక్షణమైన తరంగ ఆకారపు పైకప్పును కలిగి ఉంది.  విమానాశ్రయంలో అణు బాంబు దాడికి సబంధించిన శాంతి స్మారక గ్యాలరీ ఉంది.

Read Also: తిరుపతికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఏపీలోని ఆ నగరం నుంచి వందేభారత్!

Related News

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Vande Bharat Sleeper: ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పట్లో రానట్టే!

Safest Seats: బస్సుల్లో సేఫెస్ట్ సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు!

Kashmir Tour: కాశ్మీర్ టూర్ బుకింగ్ ఓపెన్.. హైదరాబాద్ నుంచి కేవలం రూ.36వేల లోపే ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్

IRCTC Air Travel: రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌తో విమాన ప్రయాణం.. విద్యార్థులు, ఉద్యోగులకు ఐఆర్‌సిటిసి ఎయిర్ ఆఫర్

Big Stories

×