Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలని ఉంటుంది. మెగా కాంపౌండ్ నుంచి అడుగుపెట్టిన హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు. అయితే ఏ మెగా హీరోకి దక్కని గౌరవం రామ్ చరణ్ కి దక్కింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నుంచి ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఈయన చేసిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ సినిమా నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే చరణ్ నటిస్తున్న పెద్ది మూవీకి బ్రేకులు పడుతున్నాయి. తాజాగా మరోసారి ఈ మూవీకి లాంగ్ బ్రేక్ పడేలా కనిపిస్తుంది. అసలు ఏమైంది? రామ్ చరణ్ షూటింగ్ కు వెళ్లలేదా..? డైరెక్టర్ చరణ్ మధ్య ఏదైన గొడవలు ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు మెగా అభిమానులలో వినిపిస్తున్నాయి..
‘పెద్ది’ మూవీ షూటింగ్ కు మరో బ్రేక్..?
ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబీనేషన్లో పెద్ది అనే సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీ నుంచి ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్ వీడియోలు రిలీజ్ అయ్యాయి. రామ్ చరణ్ మాస్ లుక్ లో బ్యాట్ పట్టుకొని గంభీరంగా కనిపిస్తున్నాడు. క్రికెట్ మైదానంలో చెలరేగిపోయాడు. ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని చరణ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాని వచ్చేయడాది మార్చికల్లా పూర్తి చేసి థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో ఈ సినిమా కాస్త టైం ఎక్కువగానే పట్టేలా కనిపిస్తుంది. అయితే తొందరగా సినిమా ని పూర్తి చేసి ప్రమోషన్స్ ని మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాని పూర్తి చేయాలంటే రామ్ చరణ్ నిర్విరామంగా షూటింగ్లో పాల్గొనాలి.. కానీ ఈమధ్య చరణ్ చాలావరకు షూటింగ్లకు బ్రేక్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ సింగపూర్ ట్రిప్ కు వెళ్లినట్లు తెలుస్తుంది. ఎందుకు ఆయన వెళ్ళాడో తెలుసుకుందాం..
Also Read : బెడ్ రూం పిక్స్ షేర్ చేసిన మృణాల్..ఇది గమనించారా..?
సింగపూర్ కు రామ్ చరణ్..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సింగపూర్ కు వెళ్తున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అసలు విషయానికొస్తే.. రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడం ట్యూస్సాడ్ లో ఆవిష్కరించారు.. చరణ్ తల్లిదండ్రులు, భార్య ఉపాసన అంతా లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనయుడి మైనపు విగ్రహాన్ని చూసుకుని చిరంజీవి తండ్రిగా ఎంతో గర్వపడ్డారు.. అయితే ఇప్పుడు ఆ విగ్రహాన్ని సింగపూర్ కు షిఫ్ట్ చేస్తున్నారట.. లండన్ మ్యూజియం నుంచి సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ కు శాశ్వతంగా తరలించారు. సింగపూర్ ప్రజలంతా చరణ్ విగ్రహాన్ని చూడటానికి తరలి వెళ్తున్నారు. ప్రజల సందర్శనార్దం సింగపూర్ మ్యూజియంలో అక్కడే ఉంచనున్నారు. అందుకే ఆయన సింగపూర్ కు వెళ్లాడని సమాచారం.. పెద్ది సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ లండన్ ట్రిప్ తర్వాత ఇంకా తిరిగి షూట్ లో జాయిన్ అవ్వలేదు. త్వరలోనే టీమ్ తో కలవనున్నాడు.