E-Paper
Advertisement

జస్ట్ 100 మీటర్ల లింక్ రోడ్డు కోసం.. రోడ్డెక్కిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే!

జస్ట్ 100 మీటర్ల లింక్ రోడ్డు కోసం.. రోడ్డెక్కిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే!
Advertisement

Nalgonda Link Road Issue: నల్లగొండలో 100 మీటర్ల లింక్ రోడ్డు కోసం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆందోళన బాటపట్టారు. 9వ డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్య పరిష్కారం కోసం గళమెత్తారు. సాగర్ రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వెంకటరమణ కాలనీ వరకు లింక్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానిక నాయకులతో కలిసి రోడ్డుపైకి వచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి మంజూరు ఇచ్చిందని, అయినా ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడం విచారకరమని అన్నారు.

ఐదు కాలనీల ప్రజలకు తప్పని ఇబ్బందులు

సాగర్ రోడ్డు నుంచి వెంకటరమణ కాలనీకి సరైన లింక్ రోడ్డు లేకపోవడంతో వెంకటరమణ కాలనీతో పాటు వసుంధర కాలనీ, పటేల్ నగర్, సూర్యవంశం కాలనీ, చైతన్యపురి ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భూపాల్ రెడ్డి వెల్లడించారు. కొద్ది దూరం ప్రయాణించాలన్నా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల సమయం వృథా కావడంతో పాటు స్థానికులకు రాకపోకల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

100 మీటర్ల రోడ్డు వేయడానికి అభ్యంతరమేంటి?

Advertisement

సాగర్ రోడ్డు నుంచి వెంకటరమణ కాలనీ వరకు కేవలం 100 మీటర్ల మేర లింక్ రోడ్డు నిర్మిస్తే ఐదు కాలనీల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం వెంటనే స్థలం కేటాయించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. గతంలో మంజూరైన పనిని పూర్తి చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. లింక్ రోడ్డు లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలు ఆయనకు వివరించారు. ప్రభుత్వం స్పందించి.. వెంటనే రోడ్డు నిర్మించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని భూపాల్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.

నాయకులతో కలిసి సమస్యపై గళం

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టౌన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ భువనగిరి దేవేందర్, 9వ డివిజన్ కార్పొరేటర్ దీప్లా నాయక్, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, గోపగోని స్వాతి రాజశేఖర్ గౌడ్, టౌన్ యూత్ వైస్ ప్రెసిడెంట్ వజ్జ శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు దండంపల్లి సత్తయ్య, రావుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Read Also: నల్లగొండలో యాక్సిడెంట్లకు చెక్.. నాలుగు లైన్లుగా సాగర్ రోడ్డు విస్తరణ!

Tags

Related News

ఆకాశం నుంచి మాంసం ముక్కల వాన.. భయంతో జనాలు పరుగులు, ఎక్కడంటే?

రైలులో దొంగల బీభత్సం.. ఏకంగా ఫస్ట్ ఏసీ కోచ్‌లోనే చోరీ.. రూ.2.5 లక్షల బంగారం మాయం!

తెలంగాణ, ఏపీ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. దీపావళి రద్దీకి ప్రత్యేక రైళ్లు!

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ రైలు.. 20 అద్భుతమైన ఫీచర్లు ఇవే?

ఈ నేషనల్ హైవే ఒకప్పుడు మరణాలకు కేరాఫ్.. నిత్యం రక్తంతో ఎరుపెక్కేది!

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

ఆ రోడ్డు మీద నిలబడి.. ఏం కోరుకున్నా జరిగిపోద్ది, కానీ.. మీ ఆత్మను సైతాన్‌కు రాసివ్వాలట!

Big Stories

Advertisement
×